వివాహబంధాలను కాపాడడానికి సహాయపడగల పుస్తకం
వివాహబంధాలను కాపాడడానికి సహాయపడగల పుస్తకం
అమెరికాలోని లూజియానాలో నివసిస్తున్న లెస్లీ అనే స్త్రీకి టూలేన్ విశ్వవిద్యాలయ ప్రతినిధి నుండి గత సంవత్సరం ఒక ఫోన్‌కాల్ వచ్చింది. టూలేన్ విశ్వవిద్యాలయం అలాగే మరో విశ్వవిద్యాలయం కలిసి లూజియానాలోని నవ దంపతులపై ఒక సర్వే జరుపుతున్నట్లు ఆ ఫోన్ చేసిన వ్యక్తి తెలియజేసింది.
ఆ సర్వేలో పాల్గొనడానికి అంగీకరించిన తర్వాత ఆ స్త్రీ ఒక ప్రశ్నావళి అందుకుంది, ఆమె దాన్ని పూరించి దానికి కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తక ప్రతిని జతచేసి పంపించింది. ఆమె, ఆమె భర్త యెహోవాసాక్షులు గనుక వివాహానికి సిద్ధపడేటప్పుడు ఆ పుస్తకాన్ని వారిద్దరూ కలిసి చదివినట్లు ఆమె వివరించింది.
కొన్ని వారాల తర్వాత, ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ నుండి ఆమెకొక లేఖ వచ్చింది, దానిలో ఆయనిలా వ్రాశాడు: “మీ వంటి జంటలు దృఢమైన, సంతోషభరితమైన వివాహబంధాలను ఏర్పరచుకోవడానికి ఏమి అవసరమో మాకు బోధిస్తారని ఎదురుచూస్తున్నాం. మీరిద్దరూ విభిన్నమైన నేపథ్యాల నుండి వచ్చారన్న వాస్తవం ప్రాముఖ్యమైనది. ఎందుకంటే, సాధారణంగా ఇది వివాహ బంధంపై ఒత్తిడిని తీసుకువస్తుంది. కానీ వివాహానికి మీరు సిద్ధపడడం, ప్రాముఖ్యంగా మీరు మాకు పంపిన పుస్తకం వంటి వాటి సహాయంతో మీరు సిద్ధపడడం మీ వైవాహిక జీవితంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు తలెత్తినప్పటికీ వాటిని విజయవంతంగా ఎదుర్కోవడానికి మీకు సహాయపడుతుంది. అయితే, వివాహానికి మతపరంగా ఒక ప్రేరణ ఉండడం అత్యంత ప్రాముఖ్యం. బలమైన విశ్వాసం, దేవుని సహాయంపై ఆధారపడడం అనే ఈ రెండు విషయాల్లోనూ మీ ఇద్దరి అభిప్రాయమూ ఒకటే కావడం ఆనందదాయకమైన విషయం.
“మీరు పంపిన పుస్తక ప్రతిని నేను నా బల్ల మీద ఉంచుకున్నాను, వివాహం చేసుకోవడం గురించి నా విద్యార్థులు నన్ను సలహా అడిగితే నేను వారికి ఇప్పుడు దాన్నే చూపిస్తున్నాను. ఈ పుస్తకాన్ని నేను ముందెప్పుడూ చూడలేదు, ఇది నిజంగా అద్భుతంగా ఉంది.”
ఈ పుస్తకం అమూల్యమైనదని మీరు కూడా గ్రహిస్తారని మేము విశ్వసిస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి క్రింద ఇవ్వబడిన కూపన్‌ను పూరించి, కూపన్‌లో ఇవ్వబడిన చిరునామాకు లేదా ఈ పత్రిక 5వ పేజీలోని చిరునామాల్లో మీకనుకూలమైన దానికి పంపండి. సమస్యలను పరిష్కరించుకుని, కుటుంబ జీవితం ఎలా ఉండాలని సృష్టికర్త ఉద్దేశించాడో అలా ఆనందభరితంగా చేసుకోవడానికి సహాయం చేయగల నిర్దిష్టమైన సలహాలను మీరు పొందుతారు. (g02 4/22)
□ కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకం గురించిన మరింత సమాచారాన్ని నాకు పంపండి.
□ ఉచిత గృహ బైబిలు అధ్యయనం గురించి దయచేసి నన్ను సంప్రదించండి.