కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మా పాఠకుల నుండి

మా పాఠకుల నుండి

మా పాఠకుల నుండి

హింసలనుభవిస్తున్న స్త్రీలు “హింసలనుభవిస్తున్న స్త్రీలకు సహాయం” (జనవరి - మార్చి 2002) అనే శీర్షిక కోసం నా కృతజ్ఞతను తెలియజేయడానికి నాకు మాటలు చాలడం లేదు. నేను గృహహింసకు గురవుతున్న బాధితురాలిని, నాకు ఏమి జరుగుతుందో పైఅధికారులకు తెలియజేసినప్పటికీ, నేను ఏ విధంగానూ తగ్గించుకోలేకపోయిన నా బాధను, ఆవేదనను, తీవ్రమైన దుఃఖాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరని గట్టిగా నమ్మేదాన్ని. ఈ ఆర్టికల్‌లు నా భావాలను సరిగ్గా వర్ణిస్తున్నాయి.

ఎన్‌. ఎల్‌., ఇటలీ (g02 6/22)

పత్రిక చుట్టూ ఉన్న కాగితాన్ని విప్పి, ముఖచిత్రాన్ని చూసిన వెంటనే నా కళ్ళు చెమర్చాయి. ఎన్నడూ జరుగనట్లు నేను కప్పిపుచ్చాలనుకుంటున్న నా గతం గురించి ఆ ఆర్టికల్‌లు చర్చిస్తున్నాయని భావిస్తూ నేను వెంటనే పత్రికను మళ్ళీ మడిచి పెట్టేశాను. ఆ పత్రికను చదవడం ప్రారంభించడానికి శక్తినివ్వమని నేను ప్రార్థించాను. నేను అలా చేసినందుకు ఎంతో కృతజ్ఞురాలినై ఉన్నాను! నా బాధలో నేను ఒంటరిదాన్ని కాదని గ్రహించడానికి ఈ శీర్షిక నాకు సహాయపడింది. “భాగస్వామిని కొట్టడం దేవుని దృష్టిలో ఘోరమైన పాపము” అన్న మాటలను చదవడం, పుండు మీద ఉపశమింపజేసే నూనె పోసినట్లు అనిపించింది. నిజ జీవిత పరిస్థితులను చర్చించే ఇటువంటి ఓదార్పుకరమైన ఆర్టికల్‌ల కోసం మీకు కృతజ్ఞతలు.

డి. జి. ఎమ్‌., అమెరికా (g02 6/22)

ఈ ఆర్టికల్స్‌లో ప్రస్తావించబడిన స్త్రీల అనుభవాలనే నేనూ అనుభవించాను. అలా జరగడానికి మద్యం, నా భర్త పెరిగిన వాతావరణమే కారణాలని నేను అనుకునేదాన్ని. పరిస్థితులు ఇలా ఉండడానికి ఆ విషయాలు కారణమైనప్పటికీ, హింసించడం న్యాయం కాదని అర్థం చేసుకున్నప్పుడు నేను ఓదార్పు పొందాను. నా భర్త బైబిలును చదివి, యెహోవా ప్రేమ గురించి తెలుసుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.

ఎస్‌. ఐ., జపాన్‌ (g02 6/22)

నేను హింసలనుభవిస్తున్న భార్యను కాబట్టి ఈ శీర్షిక నా మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపింది. నేనే రొక్సానాలా భావించాను. హింసలనుభవిస్తున్న ఒక భార్య ఎలా భావిస్తుందో తెలిసిన ఇతర ప్రజలు ఉన్నారని తెలుసుకోవడం నాకు ఎంతో సహాయపడింది. నా భర్త వైఖరికి నేను నిందార్హురాలిని కాదు అని నేను ఈ ఆర్టికల్‌ల ద్వారా నేర్చుకున్నాను. నా భర్త నన్ను విలువలేనిదానిగా, పనికిరానిదానిగా దృష్టించినప్పటికీ నేను దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైన దాన్ని అని గ్రహించడానికి కూడా అవి నాకు సహాయపడ్డాయి. ఇలాంటి సహాయకరమైన సమాచారాన్ని ప్రచురించినందుకు కృతజ్ఞతలు. ఇది ధనం కంటే ఎంతో విలువైనది!

బి. ఎల్‌., ఫిలిప్పీన్స్‌ (g02 6/22)

నేను వ్యక్తం చేయలేకపోయిన బాధా ఆవేదననంతటినీ మీరు మాటల్లో పెట్టగలిగారు. ఈ సమస్య కలుగజేసే మానసిక, భావోద్రేక బాధను యెహోవా అర్థం చేసుకుంటాడని తెలుసుకోవడానికి ఈ శీర్షిక నాకు సహాయపడింది. దయచేసి ఇలాంటి ఆర్టికల్‌లను వ్రాస్తూ ఉండండి, ఎందుకంటే ఈ సమస్యను ఇతరులు తెలుసుకోవాలి, వారు దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ఆర్టికల్స్‌ నుండి నేను పొందిన ఓదార్పునే చాలామంది పొందుతారు అని నిశ్చయంగా చెప్పగలను.

కె. ఈ., ఆస్ట్రేలియా (g02 6/22)

నేను ఒక కోపిష్ఠి నాన్న ద్వారా పెంచబడ్డాను, కాబట్టి నాకు తరచూ నా భర్త మీద కోపం వస్తుంది. కొన్నిసార్లు​—⁠కాదు, చాలాసార్లు​—⁠నేను ఆయన్ని కొడతాను. నా భర్త నాకంటే బలమైనవాడు, కాబట్టి నేను ఆయన్ను నిజంగా గాయపర్చడంలేదని నేను అనుకునేదాన్ని. నేను ఆ ఆర్టికల్‌ నివేదించినదాన్ని​—⁠భాగస్వామిని కొట్టడం దేవుని దృష్టిలో ఘోరమైన పాపము అని చెబుతున్నదాన్ని​—⁠చదివినప్పుడు దిగ్భ్రాంతి చెందాను. నా భర్త యెహోవా వినమ్ర సేవకుడు. నేను ఆయనకు క్షమాపణ చెప్పాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ క్రమశిక్షణ కోసం నేను యెహోవాకు కృతుజ్ఞురాలిని.

టి. ఐ., జపాన్‌ (g02 6/22)

ఈ పత్రిక నా కళ్ళలో నీళ్ళు నింపింది. నాకు నా వ్యక్తిగత అనుభవాన్ని చదివినట్లు అనిపించింది. కానీ ఈ మధ్య నా భర్త బైబిలు గురించి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆయన రాజ్యమందిరంలో కొన్ని కూటాలకు వెళ్ళాడు, ఇప్పుడు బైబిలు అధ్యయనం చేస్తున్నాడు. “నేను కలగంటున్నానేమో అని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది!” అని 11వ పేజీలో లార్డెస్‌ చేసిన వ్యాఖ్యానం నా మనస్సులోని మాటలా ఉంది.

ఈ. ఆర్‌., అమెరికా (g02 6/22)