కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారందరూ దాన్ని స్వీకరించారు

వారందరూ దాన్ని స్వీకరించారు

వారందరూ దాన్ని స్వీకరించారు

స్విట్జర్లాండ్‌లోని బేసిల్‌ నగరంలో ఉన్న ఒక స్కూలులో, విద్యార్థులందరూ తమకిష్టమైన ఏ విషయం మీదైనా 10 నుండి 15 నిమిషాల వ్యవధిగల ఒక ప్రసంగాన్ని సిద్ధపడాలని ఉపాధ్యాయుడు ప్రకటించాడు. పదిహేను సంవత్సరాల రోజీ “మీ యౌవనం—దాన్ని శ్రేష్ఠంగా అనుభవించడం” అనే అంశాన్ని తన ప్రసంగ విషయంగా ఎంపిక చేసుకుంది.

“ఇది దేని గురించి? నువ్వు మాదకద్రవ్యాల గురించి మాట్లాడబోతున్నావా?” అని క్లాస్‌మేట్‌లు అడిగారు.

“మీరే చూస్తారు,” అని రోజీ సమాధానమిచ్చింది.

ఆమె ప్రసంగం ముగిసిన తర్వాత విద్యార్థులందరూ కరతాళ ధ్వనులు చేశారు. తర్వాత రోజీ ఇలా వ్యాఖ్యానించింది: “ఒకరు తమ యౌవనాన్ని శ్రేష్ఠంగా ఎలా అనుభవించాలో చెప్పడానికి పదిహేను నిమిషాలు అసలు సరిపోవు.” కాబట్టి “మీ అందరి కోసం నా దగ్గర ఒక బహుమానం ఉంది” అని ఆమె చెప్పింది. ఆమె యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ప్రతి విద్యార్థికి ఒకటిచొప్పున, మొత్తం 20 పుస్తకాలను అందించింది. ఆ పుస్తకాలు నీట్‌గా ప్యాక్‌ చేయబడి ప్రతి పుస్తకంపై ఒక్కో క్లాస్‌మేట్‌ పేరు వ్రాయబడి ఉన్నాయి.

అందరూ ఇష్టపూర్వకంగా ఆ బహుమానాన్ని స్వీకరించారు, తర్వాత వారందరూ దాని విషయసూచికను పరిశీలిస్తూ కనిపించారు. ఆ విషయసూచికలో “నా తల్లిదండ్రులు నాకు మరింత స్వేచ్ఛను ఇచ్చేలా నేను ఎలా చేయగలను?” “నేను నిజమైన స్నేహితులను ఎలా సంపాదించుకోగలను?” “నేను ఏ కెరీర్‌ను ఎంపిక చేసుకోవాలి?” “వివాహానికి ముందు లైంగిక సంబంధాల విషయం ఏమిటి?” “అది నిజమైన ప్రేమని నేను ఎలా తెలుసుకోగలను?” వంటి అధ్యాయాలు ఉన్నాయి.

మొత్తం కలిపి 39 అధ్యాయాలు ఉన్నాయి. మీకు మరింత సమాచారం కావాలంటే క్రింద ఇవ్వబడిన కూపన్‌ను పూరించి, కూపన్‌లో ఇవ్వబడిన చిరునామాకు లేదా ఈ పత్రిక 5వ పేజీలోని చిరునామాల్లో మీకనుకూలమైన దానికి పంపించండి.

యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకాన్ని గురించి నాకు మరింత సమాచారం పంపించండి.

□ఉచిత గృహ బైబిలు అధ్యయనం గురించి దయచేసి నన్ను సంప్రదించండి.