కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మా పాఠకుల నుండి

మా పాఠకుల నుండి

మా పాఠకుల నుండి

ఉపాధ్యాయులు నేను గత నాలుగు సంవత్సరాలుగా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను, “ఉపాధ్యాయులు​—⁠వాళ్ళు లేకుండా మనం ఏమి చేయగలం?” (ఏప్రిల్‌ - జూన్‌ 2002) అన్న పరంపరను చదివి నేను ఎంతో ఆనందించాను. పిల్లల్లో నేను గమనించిన ఒక కలతపెట్టే ధోరణి ఏమిటంటే, వాళ్ళకు సరైనదానికీ సరికానిదానికీ తేడా తెలియడం లేదు. పిల్లలు తమ బాధ్యతల గురించి తెలుసుకోక ముందే తమ హక్కుల గురించి పూర్తిగా అర్థంచేసుకున్నప్పుడు కూడా ఉపాధ్యాయులు సవాలును ఎదుర్కొంటారు. అయినప్పటికీ ఉపాధ్యాయులుగా ఉండడమనేది ఒక ఫలవంతమైన కెరియర్‌, ప్రత్యేకించి విద్యార్థులు నేర్చుకోవడంలో ఆసక్తి చూపించినప్పుడు వారు అభివృద్ధి సాధిస్తున్నప్పుడు అది ప్రతిఫలదాయకంగా ఉంటుంది.

జె. కె., అమెరికా (g02 10/22)

ఈ ఆర్టికల్‌లను అందించినందుకు మీకు కృతజ్ఞతలు. మేము ఉపాధ్యాయుల కోసం తరచూ త్యాగాలు చేయకపోయినప్పటికీ వారు మా కోసం ఎన్ని త్యాగాలు చేస్తారో అర్థం చేసుకోవడానికి అవి నాకు సహాయం చేశాయి.

ఎస్‌. ఎమ్‌., ఇటలీ (g02 10/22)

నాకు ఎనిమిది సంవత్సరాలు. ఉపాధ్యాయుల గురించి మీరు ప్రచురించిన ఆర్టికల్‌లు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రేమిస్తారని అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేశాయి. కష్టంగా ఉన్నప్పుడు కూడా పిల్లలకు బోధించడం ఉపాధ్యాయులకు ఇష్టం. నేను నా ఉపాధ్యాయురాలికి కృతజ్ఞతలు చెబుతూ ఒక ఉత్తరం వ్రాశాను. నేను, నాలుగు సంవత్సరాల మా చెల్లి, ప్రజలకు యెహోవా గురించి ఎలా బోధించాలో అదీ కొన్నిసార్లు కష్టమైనప్పటికీ ఎలా బోధించాలో నేర్చుకుంటున్నాము, ఎందుకంటే మాకు ప్రజలంటే ఇష్టం.

టి. ఎమ్‌., అమెరికా (g02 10/22)

నేను నా ఉపాధ్యాయ వృత్తిని వదిలేసిన నాలుగు సంవత్సరాల తర్వాత, నేను తనకు సహాయపడినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక విద్యార్థి నాకు ఉత్తరం వ్రాసింది. తాను స్వయంగా తయారుచేసిన ఒక బుక్‌మార్క్‌ని ఆమె నాకు పంపించింది. ఆ ఉత్తరాన్ని అందుకున్నందుకు నేను ఎంత సంతోషించానో మీరు ఊహించవచ్చు!

ఏ. ఆర్‌., స్లొవేనియా (g02 10/22)

మా పిల్లల స్కూల్‌ ప్రిన్సిపాల్‌కి, ఇద్దరు ఉపాధ్యాయులకు నేను ఈ పత్రికను ఇచ్చాను. రెండు రోజుల తర్వాత వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి నేను తిరిగి వెళ్ళాను. తల్లిదండ్రులకు ఇవ్వడానికి స్పానిష్‌, ఇంగ్లీష్‌ భాషల్లో మరో 20 పత్రికలు కావాలని వారు కోరారు.

ఎమ్‌. ఎమ్‌., అమెరికా (g02 10/22)

గత సంవత్సరంలో నాలుగు నెలలు నేను ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పని చేశాను. తల్లిదండ్రులు మెప్పుదల చూపించకపోవడంవల్ల ఉపాధ్యాయులుగా తాము చేసే పని కష్టమైనదిగా తయారవుతోందని నాతోపాటు పని చేసిన ఇతర ఉపాధ్యాయులు చెప్పారు. కష్టించి పనిచేసే ఉపాధ్యాయుల పనికి ఈ పరంపర నిజమైన విలువనిస్తుందని నేను చాలా సంతోషించాను. నా టర్మ్‌ పూర్తైనప్పుడు నా విద్యార్థులు నాకు కృతజ్ఞతలు చెబుతూ ఎన్నో ఉత్తరాలు ఇచ్చారు. వాటిలో ప్రతి ఒక్కటి నాకు ఎంతో విలువైనది!

ఎస్‌. ఐ., జపాన్‌ (g02 10/22)

గాలిగుమ్మటాలు “గాలి వేగంతో గగన విహారం” (ఏప్రిల్‌ - జూన్‌ 2002) అనే అద్భుతమైన ఆర్టికల్‌కై మీకు నా కృతజ్ఞతలు. గాలిగుమ్మటంలో ప్రయాణించాలని ఎంతో కాలంగా నేను మనసారా కోరుకుంటున్నాను, కానీ నా కోరిక నెరవేరలేదు. అయితే, మీ ఆర్టికల్‌ నాకు ఊరటనిచ్చింది ఎందుకంటే నిజంగానే అలాంటి విహారం చేసినట్లు నాకనిపించింది! గుమ్మటం పైకి ఎగిరి అటూ ఇటూ ఊగడాన్ని నేను నిజంగా “అనుభవించగలిగాను.” అంత ఎత్తునుండి ఈ ప్రపంచం ఎంతో చిన్నదిగా కనిపిస్తుండవచ్చు, అయినా ఈ ప్రపంచం, దీనిలోని మానవజాతి యెహోవాకు ప్రాముఖ్యము.

ఎస్‌. ఏ., జర్మనీ (g02 10/22)

అపరాధ భావాలు “బైబిలు ఉద్దేశము: అపరాధ భావాలు కలగడం పూర్తిగా తప్పా?” (ఏప్రిల్‌ - జూన్‌ 2002) అన్న ఆర్టికల్‌ నాకు ఎంతో అవసరమయ్యింది. నేను ఇతరుల నుండి చాలా ఎక్కువగా నిరీక్షించేదాన్ని కాబట్టి పూర్తికాల సువార్త పనిలో నా తోటి సహోదరితో వ్యవహరించేటప్పుడు నా భావోద్రేకాలను అదుపులో ఉంచుకోవడం నాకు చాలా కష్టంగా ఉండేది. కానీ, ఇతరులు ఫలానా విధంగా పనిచేయాలి అని మనం అనుకున్నప్పుడు, వారు ఎప్పుడూ ఆ విధంగా చేయకపోతే వాళ్ళు తప్పు చేశారని భావించేలా చేయడానికి తదేకంగా ప్రయత్నించడం ప్రేమరహితమైనదనీ దుష్ఫలితాలనిస్తుందనీ ఈ ఆర్టికల్‌ చూపించింది. నేను నా దృక్కోణాన్ని సరిచేసుకోగలిగినందుకు నాకు సంతోషంగా ఉంది. విషయాలను యెహోవా ఎలా దృష్టిస్తాడో దయచేసి మాకు నేర్పిస్తూ ఉండండి.

కె. కె., జపాన్‌ (g02 10/22)