కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిస్థితి ఎప్పటికైనా చక్కబడుతుందా?

పరిస్థితి ఎప్పటికైనా చక్కబడుతుందా?

పరిస్థితి ఎప్పటికైనా చక్కబడుతుందా?

నేడు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఈ విషయం గురించి చింతిస్తున్న ఇతర సంస్థలు, వ్యాధులు ఎలా వ్యాపిస్తున్నాయో కనిపెట్టి వాటిని అదుపులో ఉంచడానికి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. వివిధ సంస్థలు వీటి గురించిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాయి మరియు కొత్త మందులు, వ్యాధులను అదుపు చేయడానికి కొత్త మార్గాలు కనుగొనడాన్ని ప్రోత్సహిస్తున్నాయి, ఈ కృషి అంతా పెరుగుతున్న సమస్య అయిన కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధులతో విజయవంతంగా వ్యవహరించడానికే. ప్రజలు వ్యక్తిగతంగా, ఒక సమాజంగా దీనిగురించి సమాచారాన్ని తెలుసుకోవడానికి, తమను తాము కాపాడుకోవడానికి ఎంతో చేయవచ్చు. అయితే ఒక్కో వ్యక్తినీ కాపాడడం, ప్రపంచవ్యాప్తంగా వ్యాధిని అదుపు చేయడంతో సమానం కాదు.

వ్యాధులను అదుపు చేయడంలో విజయం సాధించడానికి భూవ్యాప్త సహకారం, విశ్వాసం ఆవశ్యకమని చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. “ప్రపంచవ్యాప్తంగా ప్రజల మధ్య, దేశాల మధ్య సంబంధాలను సత్వరమే పెంచడానికి, భూమ్మీద ఉన్న మానవులందరూ తమ ఇరుగు పొరుగు ప్రాంతాలు, జిల్లాలు, దేశాలు లేదా అర్థగోళాలు మాత్రమే తమ వ్యక్తిగత పర్యావరణంలో భాగమని దృష్టించకూడదు. మానవులు నెలకొల్పిన కృత్రిమమైన సరిహద్దులను సూక్ష్మక్రిములు, వాటి రోగవాహకాలు గుర్తించవు” అని పులిట్జర్‌ బహుమతిని గెలుచుకున్న విలేఖరి లారీ గ్యారెట్‌ ద కమింగ్‌ ప్లేగ్‌​—న్యూలీ ఎమర్జింగ్‌ డిసీజెస్‌ ఇన్‌ ఎ వరల్డ్‌ ఔట్‌ ఆఫ్‌ బ్యాలెన్స్‌ అనే తన పుస్తకంలో వ్రాసింది. ఒక దేశంలో వ్యాధి వ్యాప్తిచెందడం ప్రారంభమైతే అది వెంటనే ఇరుగు పొరుగు దేశాలనే కాక భూవ్యాప్తంగా ఉన్న దేశాలను కూడా చింతకు గురిచేస్తుంది.

కొన్ని ప్రభుత్వాలు, కొన్ని దేశాలు ఇతర దేశాల నుండి వచ్చిన ఎలాంటి సహాయాన్నైనా, చివరకు వ్యాధులను అదుపు చేసే కార్యక్రమాలనైనా అనుమానిస్తారు. అంతేకాక ప్రభుత్వాలకు ముందు చూపు లేకపోవడమూ వాణిజ్యపరమైన స్వార్థమూ కలిసి తరచూ అంతర్జాతీయ సమైక్య కృషిని ఆటంకపరుస్తాయి. మానవునికీ వ్యాధులకూ జరుగుతున్న పోరాటంలో సూక్ష్మక్రిములు విజయం సాధిస్తాయా? అవి అలా విజయం సాధిస్తాయి అని అభిప్రాయపడే రచయిత యూజీన్‌ లిండెన్‌ ఇలా నివేదిస్తున్నాడు: “పరిస్థితిని తారుమారు చేయడానికి చాలా తక్కువ సమయం మిగిలివుంది.”

నిరీక్షణకు కారణం

వ్యాధులకు వ్యతిరేకంగా సాగుతున్న పరుగుపందెంలో విజ్ఞానపరమైన, సాంకేతికపరమైన అభివృద్ధి ఎంతో వెనకబడి ఉంది. కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధులు మానవుని ఆరోగ్యానికున్న అనేక ప్రమాదాల్లో కేవలం ఒకటి మాత్రమే. అయితే మనం నిరీక్షించడానికి ఒక కారణం ఉంది. శాస్త్రజ్ఞులు ప్రాణుల మధ్యవున్న క్లిష్టమైన సంబంధాలను అర్థం చేసుకోవడం ఇప్పుడిప్పుడే ప్రారంభించారు కానీ భూమికి తనను తాను నయం చేసుకోగల సామర్థ్యం ఉందని వారు గ్రహించారు. మన గ్రహంలో ప్రకృతి వ్యవస్థలను సమన్వయపరిచే ప్రక్రియలు ఉన్నాయి. ఉదాహరణకు అడవులు నరికివేయబడిన ప్రాంతాల్లో తరచూ మళ్ళీ అడవులు పెరుగుతాయి, సూక్ష్మక్రిములకు, కీటకాలకు, జంతువులకు మధ్యవున్న సంబంధాలు కొంతకాలానికి స్థిరపడతాయి.

మరింత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రకృతి యొక్క సంక్లిష్టమైన రూపకల్పన ఒక సృష్టికర్త అంటే భూమిలోని ప్రక్రియలను మొదట ప్రారంభించిన దేవుడు ఉన్నాడని సూచిస్తోంది. భూమి సృష్టించబడడానికి కారణమైన ఉన్నతమైన బుద్ధిసూక్ష్మతగల వ్యక్తి ఉండాలని చాలామంది శాస్త్రజ్ఞులు అంగీకరిస్తారు. అవును ఈ విషయం గురించి గంభీరంగా ఆలోచించేవారెవరైనా దేవుని ఉనికిని విజయవంతంగా నిరాకరించలేరు. బైబిలు సృష్టికర్తను అంటే యెహోవా దేవుణ్ణి సర్వశక్తిమంతుడైన ప్రేమపూర్వకమైన దేవుడని వర్ణిస్తుంది. ఆయన మన సంతోషం గురించి ఎంతో శ్రద్ధ కలిగివున్నాడు.

మొదటి మానవుడు ఉద్దేశపూర్వకంగా పాపం చేయడం వలన మానవుడు అపరిపూర్ణతను, అనారోగ్యాన్ని, మరణాన్ని వారసత్వంగా పొందాడని కూడా బైబిలు వివరిస్తోంది. అంటే మనం శాశ్వతంగా బాధలనుభవించాలని తీర్పు తీర్చబడిందని దాని అర్థమా? కాదు! మానవులు ఇతర ప్రాణులతో, పెద్ద ప్రాణులు మరియు చిన్న ప్రాణులతో కూడా, సంతోషంగా జీవించేందుకు ఈ భూమిని పరదైసుగా మార్చాలన్నది దేవుని సంకల్పం. పెద్ద జంతువైనా లేదా చిన్న కీటకమైనా మానవునికి హాని చేయని ఒక లోకం గురించి బైబిలు ప్రవచిస్తోంది.​—యెషయా 11:6-9.

మానవ సమాజానికి సంబంధించి, పర్యావరణకు సంబంధించి ఇలాంటి పరిస్థితులను కాపాడడానికి మానవులు ఒక పాత్ర పోషించవలసి ఉంటుంది. భూమిని ‘కాయమని’ దేవుడు మానవునికి ఆజ్ఞాపించాడు. (ఆదికాండము 2:15) భవిష్యత్తులో రానున్న పరదైసులో సృష్టికర్త స్వయంగా ఇచ్చే మార్గనిర్దేశాలను అనుసరించడం ద్వారా మానవుడు ఆ పనిని సంపూర్ణంగా నెరవేరుస్తాడు. కాబట్టి “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును” అనని కాలం కోసం మనం ఎదురుచూడవచ్చు.​—యెషయా 33:24. (g03 5/22)