కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“బైబిలు సంవత్సరం”

“బైబిలు సంవత్సరం”

“బైబిలు సంవత్సరం”

ఆస్ట్రియా, ఫ్రాన్స్‌, జర్మనీ, స్విట్జర్లాండ్‌లలో 2003వ సంవత్సరం “బైబిలు సంవత్సరం” అని పిలువబడింది. జర్మన్‌ దినపత్రిక ఫ్రాంక్‌ఫర్టర్‌ ఆల్‌జెమీనె ట్సైటూంగ్‌ ఇలా చెబుతోంది: “ఇదే పేరుతో మొదటిసారి 1992లో జరిపిన విధంగానే, [చర్చీలు] ఈ ‘జీవగ్రంథం’ పట్ల ప్రజల్లో అధిక చైతన్యం కలిగించాలని, పరిశుద్ధ లేఖనాల సాంస్కృతిక విలువను నొక్కి చెప్పాలని లక్ష్యంపెట్టుకున్నాయి.”

జూన్‌ 2002 నాటి బైబల్‌రిపోర్ట్‌ ప్రకారం, బైబిలు కనీసం కొంత భాగంగానైనా 2,287 భాషల్లోకి అనువదించబడింది. ఇప్పటివరకు దాదాపు 500 కోట్ల బైబిళ్లు పంచిపెట్టబడ్డాయని కూడా అంచనాలు చూపిస్తున్నాయి. ప్రజలు ఈ పుస్తకాన్ని ఎంత విలువైనదానిగా ఎంచుతున్నారో ఈ బృహత్తర ప్రయత్నాలు చూపిస్తున్నాయి.

బైబిలు ఆచరణాత్మకమైనదని నేడు చాలామంది ఒప్పుకోకపోవచ్చు. వాస్తవానికి చాలామంది బైబిల్లోని సూత్రాలు చాలా పురాతన కాలానివని, వాస్తవ దూరాలని భావిస్తారు. అయితే బైబిలు సంవత్సరంలో జర్మనీలోని చర్చీలు ఈ రెండు విషయాలను సాధించాలని ఆశించాయి​—⁠బైబిలుకు మరింత సన్నిహితంగా జీవించమని ప్రజలను ప్రోత్సహించడం, చర్చికి దూరమైనవారిలో బైబిలు పట్ల ఆసక్తి కలిగించడం.

బైబిలు మొదటి నుండి చివరి వరకు చదవడమంటే మాటలుకాదు, కానీ లేఖనాల్లోని ముఖ్యాంశాలను గ్రహించడానికి అలా చదవడం నిశ్చయంగా ఒక మంచి పద్ధతే. అయితే బైబిలు నుండి అత్యధిక ప్రయోజనం పొందాలనుకునే వ్యక్తి, 2 తిమోతి 3:16, 17 లోని ఈ మాటలు మనసులో ఉంచుకోవాలి: “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.”

జర్మన్‌ కవి యోహాన్‌ వొల్ఫ్‌గాంగ్‌ ఫొన్‌ గొయెతె (1749-1832) ఇలా అన్నాడు: “బైబిలును ఎంత అర్థం చేసుకుంటే అది అంత ఆసక్తిదాయకంగా మారుతుందని నాకు విశ్వాసం కలిగింది.” అవును, కేవలం దేవుని వాక్యంలోనే మనమెక్కడి నుండి వచ్చాము, మనమిక్కడ ఎందుకున్నాము, భవిష్యత్తు ఏమి తెస్తుంది అనే విషయాలపై సరైన వివరణ లభ్యమవుతుంది.​—యెషయా 46:9, 10. (g03 9/22)

[31వ పేజీలోని చిత్రసౌజన్యం]

From the book Bildersaal deutscher Geschichte