కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

డయబెటిస్‌తో బాధపడేవారికి బైబిలు ఎలా సహాయం చేయగలదు?

డయబెటిస్‌తో బాధపడేవారికి బైబిలు ఎలా సహాయం చేయగలదు?

డయబెటిస్‌తో బాధపడేవారికి బైబిలు ఎలా సహాయం చేయగలదు?

డయబెటిస్‌ ఉన్న ప్రజల ఆరోగ్యానికి, సంక్షేమానికి ఆశానిగ్రహం, అనుకూల దృక్పథం ఎంతో అవసరం. కాని అలాంటి లక్షణాలను పెంపొందించుకోవడానికి, బాధితులకు అన్ని వేళలా మద్దతు అవసరం. కాబట్టి కుటుంబ సభ్యులు, స్నేహితులు ‘ఒక్కసారి తింటే ఏమీ కాదులే’ అని చెబుతూ చిరుతిళ్ళు తినమని డయబెటిస్‌ ఉన్న వ్యక్తిని ఊరించకూడదు. గుండె జబ్బు, టైప్‌ 2 డయబెటిస్‌ ఉన్న హారీ, “నా భార్య నాకు చక్కగా మద్దతునిస్తుంది” అని చెబుతున్నాడు. “ఆమె నేను తినకూడని ఆహార పదార్థాలను ఇంట్లో ఉంచదు. కానీ కొంతమంది పరిస్థితిని అర్థం చేసుకోరు, నేను తినకూడని ఆహార పదార్థాలు ఇంట్లో ఉంటే కొన్నిసార్లు అది నా పరిస్థితిని ఎంత కష్టతరం చేస్తుందో వారికి తెలియదు” అని ఆయన చెబుతున్నాడు.

డయబెటిస్‌ ఉన్న వ్యక్తితో మీరు సహవసిస్తుంటే, బైబిల్లోని ఈ రెండు అద్భుతమైన సూత్రాలను మనస్సులో ఉంచుకోండి: “ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను,” మరియు “ప్రేమ . . . స్వప్రయోజనమును విచారించుకొనదు.”​—1 కొరింథీయులు 10:24; 13:4, 5.

తమ ఆరోగ్యం గురించి చింతించే వారందరూ, వారికి డయబెటిస్‌ ఉన్నా లేకపోయినా సరే, ఆహారం విషయంలో ఆశానిగ్రహంతో ఉండడం అవసరం. ఈ విషయంలో బైబిలు సహాయం చేస్తుంది ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరం ఆశానిగ్రహాన్ని పెంపొందించుకోవలసిన అవసరత గురించి అది తెలియజేస్తోంది. మీరు మీ జీవితంలో ఈ లక్షణాన్ని పెంపొందించుకోవాలని తీర్మానించుకున్నారా? (గలతీయులు 5:22) క్రైస్తవ అపొస్తలుడైన పౌలు మాదిరి వంటి బైబిల్లోని మాదిరుల నుండి అదనపు సహాయం లభించవచ్చు. “ఆయనకు శరీరంలో శాశ్వతమైన ముల్లు ఉండేది, అయినప్పటికీ ఆయన దేవునికి విశ్వసనీయంగా, సంపూర్ణంగా సేవ చేశాడు. నేను కూడా అలా చేయగలను” అని డయబెటిస్‌తో బాధపడే ఒక వ్యక్తి చెప్పాడు.

అవును, పౌలు తాను మార్చలేని విషయాలను అంగీకరించి, ఒక మిషనరీగా ఎంతో విజయవంతుడయ్యాడు. (2 కొరింథీయులు 12:7-9) 18 సంవత్సరాల డస్టిన్‌ పుట్టుకతోనే గుడ్డివాడు, అతనికి 12 సంవత్సరాల వయసునుంచే డయబెటిస్‌ ఉంది. ఆయన ఇలా వ్రాశాడు: “ఈ లోకంలో ప్రతీది పరిపూర్ణంగా ఉన్నవారు ఎవ్వరూ లేరని నాకు తెలుసు. దేవుని నూతనలోకంలో నాకు డయబెటిస్‌ ఉండకుండా పోయే కాలం కోసం నేను ఎదురుచూస్తున్నాను. నాకు ఇది కేవలం తాత్కాలికమైనదే. ఈ వ్యాధి జలుబు లేదా ఫ్లూ జ్వరం కంటే ఎక్కువ కాలం ఉండవచ్చు కానీ చివరకు అది అంతమవుతుంది.”

ఆ వ్యాఖ్యానం చేసేటప్పుడు డస్టిన్‌ మనసులో, దేవుని రాజ్యం క్రింద భూపరదైసులో సంపూర్ణమైన ఆరోగ్యం అనుభవించవచ్చు అనే బైబిలు ఆధారిత నిరీక్షణ ఉంది. (ప్రకటన 21:3, 4) అలాంటి దైవిక పరిపాలన క్రింద “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు” అని దేవుని వాక్యం వాగ్దానం చేస్తోంది. (యెషయా 33:24; మత్తయి 6:9, 10) ఈ బైబిలు ఆధారిత వాగ్దానం గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారా? స్థానిక యెహోవాసాక్షులను కలుసుకోండి లేదా 5వ పేజీలో ఇవ్వబడిన అడ్రసుల్లో ఒక దానిని ఉపయోగించి ఈ పత్రిక ప్రకాశకులకు ఉత్తరం వ్రాయండి. (g03 5/08)

[12వ పేజీలోని చిత్రం]

ఆశానిగ్రహం, అనుకూల దృక్పథం ఎంతో అవసరం