కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు జీవితం ఓ అమూల్య బహుమానం

యేసు జీవితం ఓ అమూల్య బహుమానం

యేసు జీవితం ఓ అమూల్య బహుమానం

దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, దేవుడు మానవాళికి ఒక అత్యంత గొప్ప బహుమానాన్ని​—⁠తన కుమారుడైన యేసుక్రీస్తు జీవితాన్ని బహుమానంగా ఇచ్చాడు, అది మనం నిత్యజీవం పొందడాన్ని సాధ్యం చేస్తోంది. (యోహాను 3:​16) దీనిని అమూల్యంగా పరిగణించిన అనేకులు తమ స్నేహితులకు, బంధువులకు జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ పుస్తకం నాలుగు సువార్తల్లో ఇవ్వబడిన యేసు జీవిత సమాచారాన్ని చక్కగా వర్ణిస్తోంది.

తనకు క్రిస్మస్‌ కార్డ్‌లు పంపిన వారందరికి తాను ఈ పుస్తకం బహూకరించానని కొద్దికాలం క్రితం ఓ వ్యక్తి వివరించాడు. సర్వసంగ్రహ నిఘంటువు, డిక్షనరీ మరియు బైబిలు నుండి రెఫరెన్సులు ఉపయోగిస్తూ తానెందుకు క్రిస్మస్‌ జరుపుకోవడం మానుకున్నాడో క్లుప్తంగా వివరిస్తూ ఆయన వారికి ఉత్తరం వ్రాసేవాడు. దానితోపాటు జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకాన్ని కూడా జతచేసి పంపేవాడు.

విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల నుండి ప్రోత్సాహకరమైన రెండు జవాబులు తానందుకున్నానని ఆయన చెప్పాడు. ఒక ఉత్తరమిలా ఉంది: “మీరు పంపిన చక్కని బహుమానం జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకం నిన్ననే నాకు అందింది. మాకది లభించడం చాలా సంతోషం కలిగించింది. అనేక రీతుల్లో అదెంతో మనోహరమైన పుస్తకం. ఇప్పటికే మేము దానిని చదివి దాని సమాచారాన్ని ఇతరులతో పంచుకుంటున్నాము.”

ఈ పుస్తకంలో యేసు చేసిన ప్రసంగాలు, ఆయన ఉపయోగించిన ఉపమానాలు, అద్భుతాలు చేర్చబడ్డాయి. సాధ్యమైన మేరకు, జరిగిన సంఘటనల అనుక్రమంగా ప్రతీదీ వివరించబడింది. యేసు ఆయన సమకాలీనుల భావాలు కళ్లకు కట్టినట్లు అందజేసేలా చక్కని పరిశోధనాత్మక చిత్రాలు అందులో పొందుపర్చబడ్డాయి.

ఈ 448 పేజీల పుస్తకం గురించి మీరింకా ఎక్కువ తెలుసుకోవాలంటే, దీనితోపాటు ఉన్న కూపన్‌ పూరించి, ఈ పత్రిక 5వ పేజీలో ఉన్న చిరునామాల్లో సముచితమైనదానికి పంపించండి. (g03 12/22)

జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి పుస్తకానికి సంబంధించి మరింత సమాచారం ఉచితంగా పంపించగలరని మనవి.

□ దయచేసి ఉచిత బైబిలు అధ్యయనానికి నన్ను సంప్రదించండి.