కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఉదాసీన లోకంలోకి!

ఉదాసీన లోకంలోకి!

ఉదాసీన లోకంలోకి!

పుట్టుకతోనే ఒక శిశువు కఠినమైన, ఉదాసీనమైన, ఒత్తిడితో నిండిన లోకంలోకి ప్రవేశిస్తాడు. శిశువు తన భావాలను మాటల్లో వ్యక్తం చేయలేకపోయినప్పటికీ, జన్మించక ముందు నుండే పిండానికి తన చుట్టూ జరిగే విషయాలు తెలుస్తాయని కొందరు శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు.

గర్భస్థ శిశువు రహస్య జీవితం (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా చెబుతోంది: “గర్భస్థ శిశువు, ఆరవ నెల నుండే (బహుశా దానికంటే ముందు నుండే కూడా) భావోద్వేగపరంగా చురుకైన జీవితం జీవించే ఒక జాగృత మరియు ప్రతిస్పందించే వ్యక్తని మనకిప్పుడు తెలుసు.” పసిబిడ్డకు జన్మించేటప్పుడు ఎదురైన ఒత్తిడితోకూడిన అనుభవం గుర్తుండకపోయినప్పటికి అది ఆ బిడ్డ తర్వాతి జీవితంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయా అని కొంతమంది శాస్త్రజ్ఞులు ఆలోచిస్తున్నారు.

జన్మించిన తర్వాత ఒత్తిడి కొనసాగుతుంది. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చాక బిడ్డ ఇక యాంత్రికంగా పోషించబడదు. ఆక్సిజన్‌ మరియు పోషకాహారాలు అందే మార్గం ఉండదు. జీవించివుండడానికి ఆ బిడ్డ తనంతట తానే ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించి, పోషకాహారాలు తీసుకోవాలి. తనకు ఆహారం పెట్టడానికి, ఇతర శారీరక అవసరాలు తీర్చడానికి ఆ పసికందు ఎవరిపైనైనా ఆధారపడాలి.

అంతేకాక ఆ నవజాత శిశువు మానసికంగా, భావోద్వేగపరంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలి. కాబట్టి ఆ శిశువును ఎవరో ఒకరు పెంచి పెద్ద చేయాలి. అలా చేయడానికి సరైన వ్యక్తి ఎవరు? పసిపిల్లలకు తల్లిదండ్రుల నుండి అవసరమైనదేమిటి? ఆ అవసరాలను ఎలా తీర్చవచ్చు? ఈ ప్రశ్నలకు సమాధానాలు పొందడానికి తర్వాతి ఆర్టికల్‌లు సహాయం చేస్తాయి. (g03 12/22)