కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘సంక్షిప్తమైనదే అయినా సమాచారంతో నిండివుంది’

‘సంక్షిప్తమైనదే అయినా సమాచారంతో నిండివుంది’

‘సంక్షిప్తమైనదే అయినా సమాచారంతో నిండివుంది’

దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? బ్రోషుర్‌ను ఒక స్త్రీ అలా వర్ణించింది. తనలా చెప్పడానికి తననేది పురికొల్పిందో వివరిస్తూ ఆమె ఇలా అంటోంది: “ఈ బ్రోషుర్‌వల్ల గ్లోరియా అనే వృద్ధ స్త్రీకి బైబిలు చదవాలనే కోరిక బలపడింది. ఆమె కదలకుండా కూర్చుని ఏకాగ్రత నిలపలేని పరిస్థితి నుండి రెండు గంటలపాటు అధ్యయనం చేయగల స్థితికి ఎదిగింది. ఆమె ముందుగానే పాఠాలన్నిటికీ సిద్ధపడుతూ, లేఖనాలన్నీ పరిశీలిస్తుంది.”

దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే 32 పేజీల బ్రోషుర్‌ ఈ పత్రిక సైజులోనే ఉంటుంది. అది మానవాళిపట్ల దేవుని సంకల్పమేమిటో స్పష్టంగా చూపిస్తూ, ఆయన ఆమోదం పొందడానికి మనమేమి చేయాలో వివరిస్తుంది. అందులోని ఆకర్షణీయమైన పాఠాల్లో “దేవుడెవరు?,” “యేసు క్రీస్తు ఎవరు?,” “భూమి ఎడల దేవుని సంకల్పమేమిటి?,” “దేవుని రాజ్యమంటే ఏమిటి?” అనేవి ఉన్నాయి.

ఈ బ్రోషుర్‌ గురించి మరింత సమాచారం కావాలనుకుంటే క్రిందున్న కూపన్‌ను పూరించి ఈ పత్రికలో 5వ పేజీలో ఇవ్వబడిన చిరునామాల్లో తగినదానికి పంపించండి. (g04 1/8)

□ ఎలాంటి నిర్భంధం లేకుండా, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? బ్రోషుర్‌ గురించి మరింత సమాచారం పంపించగలరని మనవి.

□ ఉచిత గృహ బైబిలు అధ్యయనం గురించి దయచేసి నన్ను సంప్రదించండి.