కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ఎంతో అర్థవంతంగా ఉంటాయి”

“ఎంతో అర్థవంతంగా ఉంటాయి”

“ఎంతో అర్థవంతంగా ఉంటాయి”

జర్మనీలోని కెస్సల్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ కళా ప్రదర్శన వద్ద యెహోవాసాక్షుల సాహిత్యాల్లోని చిత్రాల గురించి అలా వ్యాఖ్యానించబడింది. పదహారేళ్ళ కాట్యా తన తోటి విద్యార్థులతోపాటు ఆ ప్రదర్శనకు వెళ్ళి అక్కడ కొన్ని మతసంబంధ కళాఖండాలను చూస్తున్నప్పుడు జరిగిన సంఘటనను ఇలా వివరిస్తోంది:

“మా గైడ్‌, యెహోవాసాక్షుల పత్రికలను ఎప్పుడైనా పరిశీలించారా అని విద్యార్థులను ప్రశ్నించాడు. అందరూ లేదు అని చెప్పడంతో ఆయన కావలికోట, తేజరిల్లు! పత్రికల్లోని చిత్రాలను ఎంతగానో పొగుడుతూ మాట్లాడడం ప్రారంభించాడు. చిత్రాలు ఎంతో చక్కగా వేయబడతాయని, ఫోటోగ్రాఫులు చక్కగా ఎంపిక చేయబడతాయని, అవి ‘ఎంతో అర్థవంతంగా ఉంటాయి’ అని చెప్పాడు.

“ఆ ఆసక్తికరమైన చిత్రాలను జాగ్రత్తగా పరిశీలిస్తే మంచిదని” చెబుతూ, బైబిలు కాలాల్లోని సంఘటనలను ఆధునిక చిత్రాలుగా చిత్రిస్తే ఆ సంఘటనలు మన కాలానికి ఎలా అన్వయిస్తాయో అర్థం చేసుకోవడం సులభంగా ఉంటుందని ఆయన మాకు చెప్పాడు. యెహోవాసాక్షులు ఆ పత్రికలు అందించినప్పుడు వాటిని స్వీకరించమని, ఆ తర్వాత కేవలం వాటిలోని చిత్రాలను చూడడమే కాక ఎంతో సమాచారాత్మకమైన, ఆసక్తికరమైన ఆర్టికల్‌లను చదవమని కూడా ఆయన విద్యార్థులను ప్రోత్సహించాడు. (g04 4/22)