కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యాన్ని లోతుగా పరిశీలించండి!

దేవుని వాక్యాన్ని లోతుగా పరిశీలించండి!

దేవుని వాక్యాన్ని లోతుగా పరిశీలించండి!

అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి అనే పుస్తకం దేవుని వాక్యాన్ని లోతుగా పరిశీలించడానికి సహాయం చేస్తుంది. బైబిలు విద్యార్థులు దేవుని వాక్యంలోని బోధలను తమ జీవితాల్లో అన్వయించుకోవడానికి సహాయం చేసేందుకు ఆ పుస్తకం రూపొందించబడింది. దక్షిణాఫ్రికాలోని నైజీరియాకు చెందిన ఒక బైబిలు బోధకుడు ఇలా వ్యాఖ్యానించాడు: “ప్రతి అధ్యాయంలోను ఇవ్వబడిన ఆలోచింపజేసే ప్రశ్నలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి, పాఠకుడు తాను చదువుతున్న దానిని అర్థం చేసుకొని దాని గురించి ధ్యానించడానికి అవి సహాయం చేస్తాయి.”

ఎన్నో సంవత్సరాలుగా బైబిలు బోధకురాలిగా ఉన్న ఒక స్త్రీ ఇలా చెప్పింది: “ఈ పుస్తకం ఎంత సరళంగా వ్రాయబడిందో! దీనిని ఉపయోగించి అధ్యయనాలు నిర్వహించడం ఎంతో సంతోషాన్నిస్తుంది.”

“మనందరం ఎదుర్కోవలసిన వివాదాంశం,” “దేవుడు దుష్టత్వాన్ని అనుమతించడం నుండి మనమేమి నేర్చుకుంటాము?,” “పునరుత్థాన నిరీక్షణా శక్తి,” “ఉపదేశం వినండి, క్రమశిక్షణ అంగీకరించండి” వంటి అధ్యాయాలను పరిశీలించినప్పుడు బహుశా మీరు కూడా ఈ పుస్తకం గురించి అలాగే భావించవచ్చు. క్రిందవున్న కూపన్‌ను పూరించి ఈ పత్రికలోని 5వ పేజీలో ఇవ్వబడిన చిరునామాల్లో తగినదానికి పంపించడం ద్వారా మీరు అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి అనే 192 పేజీల పుస్తకం గురించి మరింత సమాచారాన్ని పంపించమని కోరవచ్చు. (g04 4/8)

□ ఎలాంటి నిర్భంధం లేకుండా, అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి అనే పుస్తకం గురించి మరింత సమాచారం పంపించగలరని మనవి.

□ ఉచిత గృహ బైబిలు అధ్యయనం గురించి దయచేసి నన్ను సంప్రదించండి.

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

పుస్తకం ముఖచిత్రం: U.S. Navy photo