కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తమ విశ్వాసం గురించి ధైర్యంగా మాట్లాడే యౌవనస్థులు

తమ విశ్వాసం గురించి ధైర్యంగా మాట్లాడే యౌవనస్థులు

తమ విశ్వాసం గురించి ధైర్యంగా మాట్లాడే యౌవనస్థులు

యెహోవాసాక్షుల్లో చాలామంది యౌవనస్థులున్నారు. వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, బైబిల్లో తెలియజేయబడిన దేవుని ప్రమాణాల ప్రకారం జీవించడానికి కృషి చేస్తున్నారు. ఈ యౌవనస్థులు తమ విశ్వాసాన్నిబట్టి ఎంతో గర్విస్తూ, స్కూల్లో దాని గురించి ఇతరులతో స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

హోలీ ఆరవ తరగతిలో ఉన్నప్పుడు, “దౌర్జన్యం చేయకుండా తీవ్రవాద సమస్యను మీరెలా పరిష్కరిస్తారు?” అనే ప్రశ్నపై వ్యాసం వ్రాయమని ఆమెకు, ఆమె తరగతిలోని వారికి ఒక నియామకం ఇవ్వబడింది. హోలీ భవిష్యత్తు గురించిన తన బైబిలు ఆధారిత నిరీక్షణ గురించి వ్రాయడానికి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. చరిత్రంతటిలోనూ ‘ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకోవడం’ జరిగిందని ఆమె వివరించింది. (ప్రసంగి 8:9) ఆ తర్వాత ఆమె, మానవజాతి ఏకైక నిరీక్షణయైన దేవుని రాజ్యం గురించి తెలియజేసింది. “యేసు ఆ రాజ్యానికి నియమిత రాజు కాబట్టి, తీవ్రవాదంతో సహా సమస్యలన్నీ నిర్మూలించబడతాయి” అని ఆమె వ్రాసింది. ఏ మానవ పరిపాలకుడూ సాధించలేనిదాన్ని యేసు ఎలా సాధిస్తాడో ఆమె విశదీకరించింది. “యేసు భూమిపై ఉన్నప్పుడు తాను ఎలాంటి పరిపాలకుడిగా ఉంటాడో చూపించాడు. ఆయన ప్రేమ చూపించాడు, ప్రజలపై శ్రద్ధ చూపించాడు. ఆయన రోగాలను నయం చేయడం ద్వారా, చనిపోయినవారిని తిరిగి లేపడం ద్వారా తనకున్న శక్తిని చూపించాడు. ఏ మానవ ప్రభుత్వమూ చనిపోయినవారిని తిరిగి జీవానికి తీసుకురాలేదు. కానీ దేవుని రాజ్యం అలా చేస్తుంది” అని ఆమె వ్రాసింది. “సమస్యను దేవుడే పరిష్కరించగలడు, కానీ మానవులు కాదు” అని వ్యాఖ్యానిస్తూ హోలీ తన వ్యాసాన్ని ముగించింది.

ఆ వ్యాసం చివర్లో వాళ్ళ టీచర్‌ ఇలా వ్రాసింది: “అద్భుతం! చాలా చక్కగా వ్రాశావు హోలీ. ఎంతో ఆలోచించి వ్రాశావు.” హోలీ ఇచ్చిన లేఖనాల రెఫరెన్సులను కూడా చూసి టీచర్‌ ఎంతో ప్రభావితురాలయ్యింది. దానితో హోలీకి తన టీచర్‌తో దైవపరిపాలనా పరిచర్య పాఠశాల గురించి మాట్లాడే అవకాశం లభించింది, ఈ పాఠశాల మాట్లాడడానికి, బోధించడానికి సంబంధించి యెహోవాసాక్షులు ప్రతి వారం జరుపుకునే కార్యక్రమం. పరిచర్య పాఠశాలలో ఉపయోగించే పాఠ్య పుస్తకాన్ని ఆ టీచర్‌ సంతోషంగా స్వీకరించింది.

జెస్సికా కూడా స్కూలు వ్యాసాలు వ్రాసేటప్పుడు తన విశ్వాసం గురించి మాట్లాడగలిగింది. “నేను నా నమ్మకాల గురించి మూడు వ్యాసాలు వ్రాయగలిగాను. వాటిలో ఒకటి యెహోవాసాక్షులు, మతసంబంధమైన హక్కులు అనే దాని గురించి. ఆసక్తి ఉన్నవాళ్ళు చదవడానికి వీలుగా టీచర్‌ దాన్ని లైబ్రరీలో పెట్టింది. ఇటీవల నేను నా బాప్తిస్మం గురించి, అది నాకు ఎంత ప్రాముఖ్యమైన రోజు అనేదాని గురించి ఒక వ్యాసం వ్రాశాను. విద్యార్థులు తమ వ్యాసాల చిత్తుప్రతులను ఒకరికొకరు ఇచ్చుకుంటారు, కాబట్టి నా తోటి విద్యార్థులకు నా వ్యాసం చదివే అవకాశం లభించింది. ఒక అమ్మాయి ఇలా అంది: ‘చక్కగా వ్రాశావు. యెహోవాసాక్షులకు ఇన్ని బాధ్యతలు ఉంటాయని తెలుసుకోవడం నాకు సహాయకరంగా అనిపించింది. నువ్వు బాప్తిస్మం తీసుకున్నందుకు నా శుభాకాంక్షలు!’ మరో అమ్మాయి ఇలా అంది: ‘నీ కథ అద్భుతంగా ఉంది! నీకు బలమైన విశ్వాసం ఉన్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది!’ ఒక అబ్బాయి ఇలా వ్రాశాడు: ‘నువ్వు తెలివైనదానివి. నీకు నా అభినందనలు.’”

మెలిస్సాకు 11 సంవత్సరాలున్నప్పుడు తన విశ్వాసం గురించి మాట్లాడే విశేషమైన అవకాశం లభించింది. “స్కూలు నర్సు రోగనిరోధక వ్యవస్థ గురించి మాట్లాడడానికి మా సైన్స్‌ క్లాసుకు వచ్చింది. అప్పుడు రక్త మార్పిడుల గురించిన ప్రస్తావన వచ్చింది. క్లాసు ముగిసిన తర్వాత నేను రక్తం గురించిన మన వీడియోల్లో ఒకదాని గురించి మా సైన్స్‌ టీచర్‌కు చెప్పాను. మరుసటి రోజు నేను దాన్ని స్కూలుకు తీసుకువెళ్ళాను, మా టీచర్‌ దాన్ని తన ఇంటికి తీసుకువెళ్ళి తన కుటుంబంతోపాటు చూశాడు. తర్వాతి రోజు ఆయన దాన్ని స్కూలుకు తీసుకువచ్చి మా తరగతితో సహా రెండు తరగతులకు చూపించాడు. తర్వాత ఆయన యెహోవాసాక్షుల గురించి అనుకూలంగా వ్యాఖ్యానిస్తూ యెహోవాసాక్షులు కృషి చేయకపోతే రక్తమార్పిడులకు ప్రత్యామ్నాయాలు వెంటనే అందుబాటులోకి వచ్చి ఉండేవి కాదు అన్నాడు. వీడియోను నాకు తిరిగి ఇచ్చేటప్పుడు, ‘స్కూలు లైబ్రరీకోసం ఒక కాపీ కావాలంటే ఎలా లభిస్తుంది?’ అని నన్ను అడిగాడు. నేను ఆయనకు ఒక కాపీ ఇచ్చాను. ఆయనెంతో సంతోషించాడు, నేనూ ఎంతో సంతోషించాను!”

సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని బైబిలు ఇస్తున్న ఉపదేశాన్ని అనుసరించే అనేకమంది యౌవన యెహోవాసాక్షుల్లో హోలీ, జెస్సికా, మెలిస్సా కూడా ఉన్నారు. (ప్రసంగి 12:2) మీరు కూడా అలాగే చేస్తున్నారా? అలాగైతే, మీరు యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తున్నారనే నిశ్చయత కలిగివుండవచ్చు.​—సామెతలు 27:11; హెబ్రీయులు 6:10.

యౌవనస్థులైన మీరు మీ విశ్వాసం గురించి మీ తోటి విద్యార్థులతో, టీచర్లతో మాట్లాడినప్పుడు అది యెహోవా దేవుని గురించి, ఆయన సంకల్పాల గురించి శక్తివంతమైన సాక్ష్యం ఇస్తుంది. అది మీ విశ్వాసాన్ని కూడా బలపరుస్తుంది, దేవుని సేవకుల్లో భాగంగా ఉండే ఆధిక్యత లభించినందుకు మంచి దృక్పథంతో గర్వపడేలా చేస్తుంది. (యిర్మీయా 9:24) స్కూల్లో సాక్ష్యం ఇవ్వడం రక్షణగా కూడా పనిచేస్తుంది. జెస్సికా దాన్నిలా వర్ణించింది: “నా నమ్మకాల గురించి ధైర్యంగా మాట్లాడడంవల్ల కలిగిన ఒక ప్రయోజనం ఏమిటంటే, బైబిలు చెబుతున్న దానితో పొందికలేని వాటిని చేయమని విద్యార్థులు నన్ను బలవంతం చేయడంలేదు.” (g04 9/8)

[14వ పేజీలోని చిత్రాలు]

హోలీ

[14, 15వ పేజీలోని చిత్రాలు]

జెస్సికా

[15వ పేజీలోని చిత్రాలు]

మెలిస్సా