కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“దేవునితో నడవండి” జిల్లా సమావేశానికి ఆహ్వానం

“దేవునితో నడవండి” జిల్లా సమావేశానికి ఆహ్వానం

“దేవునితో నడవండి” జిల్లా సమావేశానికి ఆహ్వానం

◼ ప్రపంచవ్యాప్తంగా వందలాది స్థలాల్లో కోట్లాదిమంది హాజరవుతారు. ఈ సమావేశాలు, సాధారణంగా శుక్రవారం నుండి ఆదివారం వరకు మూడు రోజులపాటు నిర్వహించబడతాయి. ఇలాంటి సమావేశాల్లో ఒకటి బహుశా మీకు దగ్గరగా ఉన్న నగరంలోనే జరగవచ్చు.

చాలా ప్రాంతాల్లో ప్రతిరోజు ఉదయం 9:30కు సంగీతంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. శుక్రవారం దినాంశం “ఇదే త్రోవ దీనిలో నడువుడి.” “యెహోవా తన మార్గాలను మనకు బోధించాలని సమావేశమయ్యాం” అనే ఆహ్వాన ప్రసంగం తర్వాత, నమ్మకంగా దేవునితో నడుస్తున్న వ్యక్తులను ఇంటర్వ్యూ చేసే ఒక భాగం ఉంటుంది. “మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి,” “దేవుని వాక్యం ప్రతిదినం మీ అడుగులను నిర్దేశించనివ్వండి” అనే ప్రసంగాల తర్వాత, “సంక్షోభిత కాలాల్లో దేవునితో నడవండి” అనే ముఖ్యాంశ ప్రసంగంతో ఉదయకాల కార్యక్రమం ముగుస్తుంది.

శుక్రవారం మధ్యాహ్న కార్యక్రమంలో “దేవునితో నడిచేందుకు హోషేయ ప్రవచనం మనకు సహాయపడుతుంది” అనే మూడు భాగాల గోష్ఠి ఉంటుంది. దాని తర్వాత “‘దేవుడు జతపరచిన’ బంధాన్ని విడదీయకండి,” “పరిశుద్ధమైన మన సమావేశాల పట్ల గౌరవం చూపించడం” అనే ప్రసంగాలు ఉంటాయి. “అన్ని దేశాల ప్రజలకు సువార్త” అనే ఆ రోజు ఆఖరి ప్రసంగం, అన్ని భాషలకు చెందిన ప్రజలకు సువార్త ప్రకటించడానికి ప్రోత్సాహాన్నిస్తుంది.

“జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి” అనేది శనివారం దినాంశం. ఉదయం ఇవ్వబడే “పరిచారకులుగా ప్రగతి పథంలో ముందుకుసాగడం” అనే గోష్ఠి, ఇతర భాషలు మాట్లాడే వాళ్ళకు సువార్త ప్రకటించడానికి సంబంధించి మరిన్ని సలహాలు అందిస్తుంది. “సమ్మతించినవారిగా యెహోవాతో నడవడం” అనే ప్రాముఖ్యమైన ప్రసంగంతో ఉదయపు కార్యక్రమం ముగుస్తుంది, ఆ ప్రసంగం తర్వాత అర్హులైనవారు బాప్తిస్మం పొందడానికి అవకాశం ఉంటుంది.

శనివారం మధ్యాహ్నం “ఏ విషయంలోనూ అభ్యంతరానికి తావివ్వకండి,” “ఉత్తేజం కలిగించే ఆరోగ్యకరమైన కార్యకలాపాలు” అనే ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత ఇవ్వబడే “యెహోవా మన కాపరి,” “సమయమును పోనియ్యక సద్వినియోగము చేసుకోవడం,” “తేజరిల్లుతున్న వెలుగు మార్గంలో నడవడం” అనే ప్రసంగాల్లో ప్రోత్సాహకరమైన ఇంటర్వ్యూలు ఉంటాయి. “‘అప్రమత్తంగా ఉండండి’​—⁠తీర్పు తీర్చే గడియ వచ్చింది” అనే ఆలోచింపజేసే ప్రసంగంతో కార్యక్రమం ముగుస్తుంది.

‘సత్యమును అనుసరించి నడుచుకొనుడి’ అనే ఆదివారం దినాంశం, “యౌవనులారా​—⁠నీతి మార్గంలో నడవండి” అనే ప్రసంగంలో నొక్కి చెప్పబడుతుంది. ఆ తర్వాత అపొస్తలుడైన పౌలు పరిచర్యకు సంబంధించిన నాటకం ఉంటుంది. దాని తర్వాత నాటకంలోని పాఠాలను నొక్కి చెప్పే ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్న కార్యక్రమంలో “దేవునితో నడవడం ఇప్పుడూ ఎల్లప్పుడూ ఆశీర్వాదకరం” అనే బహిరంగ ప్రసంగం ఉంటుంది.

మీకు దగ్గర్లో సమావేశం జరిగే స్థలం ఎక్కడో తెలుసుకోవడానికి మీరు స్థానిక యెహోవాసాక్షుల రాజ్యమందిరంలో అడగవచ్చు లేదా ఈ పత్రిక ప్రకాశకులకు వ్రాయవచ్చు. (g04 6/8)