కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు సత్యంతో పిగ్మీలను చేరుకోవడం

బైబిలు సత్యంతో పిగ్మీలను చేరుకోవడం

బైబిలు సత్యంతో పిగ్మీలను చేరుకోవడం

కామెరూన్‌లోని తేజరిల్లు! రచయిత

ప్రపంచవ్యాప్తంగా 230 కంటే ఎక్కువ దేశాల్లో యెహోవాసాక్షులు దేవుని రాజ్య సందేశాన్ని ‘మనుష్యులందరికీ’ ప్రకటించడానికి ప్రయత్నిస్తున్నారు. (1 తిమోతి 2:4; మత్తయి 24:14) వారిలో ఆఫ్రికాకు చెందిన పిగ్మీలు కూడా ఉన్నారు, వారు పొట్టిగా, సగటున 1.2 నుండి 1.4 మీటర్ల ఎత్తు మాత్రమే ఉంటారు. వీరు ముఖ్యంగా మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌లోని కాంగో ప్రాంతానికి చెందిన, దక్షిణ కామెరూన్‌లోని దట్టమైన అడవుల్లో నివసిస్తున్నారు.

ఐగుప్తు ఫరో నెఫెరికరే, నైలు నది పుట్టిన చోటు కనుక్కోవడానికి పంపిన పరిశోధక బృందానికి పిగ్మీలు మొదటిసారిగా తారసపడినట్లు వ్రాయబడింది. ఆఫ్రికాలోని మారుమూల అడవులలో పొట్టిగావున్న ప్రజలు తమకు తారసపడ్డారని ఆ పరిశోధక బృందం నివేదించింది. ఆ తర్వాత గ్రీకు రచయిత హోమర్‌, తత్త్వవేత్త అరిస్టాటిల్‌ వీరిరువురు పిగ్మీల గురించి ప్రస్తావించారు. 16, 17 శతాబ్దాలలో ఈ ప్రజలు యూరోపియన్లకు పరిచయమయ్యారు.

ఆధునిక కాలాల్లో యెహోవాసాక్షులు ఆఫ్రికాలోని అడవుల్లో ప్రకటిస్తున్నారు. రాజ్య సందేశానికి పిగ్మీలు ప్రతిస్పందించినా, వాళ్ళలో ఆసక్తిని పెంపొందించడానికి చేసిన ప్రయత్నాలు అంతగా విజయవంతం కాలేదు. దానికి పిగ్మీల వలస జీవన విధానమే అంటే ప్రతీ రెండు లేదా అంతకంటే ఎక్కువ నెలలకు ఒకసారి ఒక ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి తరలివెళ్లడమే కారణం.

శాంతియుతులు, బిడియస్థులు అని చెప్పబడే పిగ్మీల జన సంఖ్య ఆఫ్రికాలో 1,50,000 నుండి 3,00,000 వరకు ఉన్నట్లు అంచనా వేయబడింది. ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, చర్చీలు, ప్రత్యేకంగా వారి కోసం పాఠశాలలు, వారి జీవన శైలికి సరిపోయే చిన్న ఇళ్ళు కట్టించారు. అయినాసరే, వారిని ఒకచోట స్థిరపడేలా ఆకర్షించడానికి చేసిన ప్రయత్నాలు చాలావరకు విఫలమయ్యాయి.

కామెరూన్‌లోని పిగ్మీల్లో జావ్య మబాకే మొదటి సాక్షి కావడం విశేషం. చిత్రాలతోవున్న మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకంతోపాటు ఇతర సాహిత్యాలు చదివిన తర్వాత, ఆయన బైబిలు సందేశాన్ని అంగీకరించాడు. * జావ్య 2002వ సంవత్సరంలో బాప్తిస్మం తీసుకొని, ఇప్పుడు ఒక పయినీరుగా సేవ చేస్తున్నాడు. పూర్తికాల సువార్తికులను యెహోవాసాక్షులు పయినీర్లు అని పిలుస్తారు. ఆ దేశంలో ఆగ్నేయ దిశన ఉన్న చిన్న పట్టణమైన మబాన్‌లోని క్రైస్తవ సంఘంలో ఆయన పరిచర్య సేవకుడిగా కూడా సేవ చేస్తున్నాడు. ‘మనుష్యులందరినీ’ ప్రేమించే అద్వితీయ సత్య దేవుడైన యెహోవాను ఆరాధించడానికి కామెరూన్‌లోని ఇంకా ఎంతమంది పిగ్మీలు నిర్ణయించుకుంటారో భవిష్యత్తే చెబుతుంది. (g04 8/22)

[అధస్సూచి]

^ యెహోవాసాక్షులు ప్రచురించినది, కానీ ఇప్పుడు అది ముద్రించబడడం లేదు.

[28వ పేజీలోని చిత్రం]

కామెరూన్‌లోని పిగ్మీలలో మొదటి సాక్షియైన, జావ్య మబాకే పరిచర్యలో భాగం వహించడం