కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అందరూ ఇష్టపడే ఉల్లి

అందరూ ఇష్టపడే ఉల్లి

అందరూ ఇష్టపడే ఉల్లి

మెక్సికోలోని తేజరిల్లు! రచయిత

ఉల్లిపాయ లేని వంటగది ఉంటుందా? బహుళ ప్రయోజనకారి అయిన ఈ కూరమొక్కను సూపుల్లో, సలాడ్లలో, ముఖ్య వంటకాల్లో, ఔషధాల్లో ఇలా ఒకటేంటి దాదాపు ప్రతిదాంట్లో ఉపయోగించవచ్చు. అది మనల్ని కాస్త ఏడిపిస్తుంది కూడా.

గోల్డెన్‌ ఆనియన్‌ (ఏలియమ్‌ మోలీ), బ్రైడ్స్‌ ఆనియన్‌ (ఏలియమ్‌ నియెపొలైటనమ్‌), ఓర్నమెంటల్‌ గార్లిక్‌ (ఏలియమ్‌ అఫ్లటునెన్స్‌) వంటి అందమైన పూలు పూచే మొక్కల కుటుంబానికి చెందిన ఉల్లి (ఏలియమ్‌ సిపా) కూడా అందమైన పూలు పూస్తుంది. అయితే ప్రపంచంలోని ప్రతీ వంటగదిలో ఎక్కువగా కనబడేది ముఖ్యంగా ఉబ్బినట్లుండే ఆకుపొరలతో భూగర్భంలో పెరిగే దుంప.

మానవుడు సాగుచేసిన పురాతనమైన పంటల్లో ఉల్లి ఒకటి. దీని వాడకం ఎంత విస్తృతమైనదో బైబిలు వృత్తాంతం ద్వారా తెలుసుకోవచ్చు. దాదాపు సా.శ.పూ. 1513వ సంవత్సరంలో ఇశ్రాయేలు ప్రజలు తాము ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు తిన్న ఉల్లిపాయల కోసం పరితపించినట్లు ఆ వృత్తాంతం చెబుతోంది.​—సంఖ్యాకాండము 11:5.

ఎంతో భిన్నమైన రుచులను ఆస్వాదించే వారందరికీ ఉల్లిపాయ రుచిని అంత ప్రియమైనదిగా చేసినదేమిటి? ఖచ్చితంగా దానిలో ఉన్న గంధక సమ్మేళనాలే, ఇవే దానికి ఒక రకమైన వాసన, ఘాటైన రుచి కలిగేలా చేస్తాయి. దానిలో ఉండే గంధకామ్లం, అందరికీ కన్నీళ్ళను తెప్పిస్తుంది.

రుచికరమైన ఆహారపదార్థం మాత్రమే కాదు

ఉల్లిపాయలు ప్రపంచ ఆరోగ్యానికి ఒక సంపద వంటివి. వాటిలో కాల్షియమ్‌, ఫాస్పరస్‌, విటమిన్‌ సి అనబడే ఆస్కొర్బిక్‌ ఆమ్లాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఉల్లిపాయల్లో ఉన్న ఔషధ గుణాల కారణంగా అవి ఎంతో విలువైనవిగా చరిత్రలో ప్రసిద్ధికెక్కాయి. ఇప్పుడు కూడా అవి జలుబుతో పాటు గొంతు వాపు, రక్తనాళపు గోడలు గట్టిపడడం, గుండె కండరాల వ్యాధి, మధుమేహం, ఉబ్బసం వంటి అనేక అవస్థలతో పోరాడేందుకు ఉపయోగించబడుతున్నాయి. పుండును సూక్ష్మజీవుల నుండి కాపాడే మందుగా, కొలెస్ట్రాల్‌కు, శోథకు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడానికి, క్యాన్సర్‌కు నిరోధకంగా ఉల్లిపాయ పనిచేస్తుందని అంటారు.

ఉల్లిపాయలు తెలుపు, పసుపు, గోధుమవన్నె, ఆకుపచ్చ, ఎరుపు, ఊదా మొదలైన రంగుల్లో ఉంటాయి. మీరు వాటిని పచ్చివి, ఉడకబెట్టినవి, డబ్బాల్లో ప్యాక్‌ చేసినవి, ఎండబెట్టినవి, పచ్చడిలో, చూర్ణ రూపంలో, పలుచని ముక్కలుగా, లేదా ఘన రూపంలో, క్యూబులుగా ఎలాగైనా తినవచ్చు. ఉల్లిపాయ మీ కంట తడి పెట్టించినప్పటికీ, అది నిజంగా ఒక అద్భుతమైన కూరమొక్కే కదా? (g04 11/8)