కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మా పాఠకుల నుండి

మా పాఠకుల నుండి

మా పాఠకుల నుండి

పిల్లలు “పిల్లలు​—⁠వారికి తల్లిదండ్రుల నుండి అవసరమైనదేమిటి?” వరుస ఆర్టికల్‌లు ఉన్న పత్రిక నా చేతికి అందగానే వాటిని గబగబా చదివేశాను. (ఏప్రిల్‌-జూన్‌ 2004) నేను అయిదుగురు పిల్లల తల్లిని, ఆ ఆర్టికల్‌లు నా హృదయాన్ని కదిలించాయి. వాటిని లోకంలోని తల్లులందరూ చదవాలని ఆశిస్తున్నాను.

సి. ఎమ్‌., ఫ్రాన్స్‌ (g04 10/22)

మీరు ప్రచురించిన ఆర్టికల్‌లు సరిగ్గా నాకు అవసరమైన సమయంలో వస్తున్నట్లు ఉన్నాయి. నేను, నా భర్త తల్లిదండ్రులం కాబోతున్నామని తెలిసిన సందర్భంలో, గర్భిణి స్త్రీలకు ఉపయోగపడే సమాచారాన్ని మీరు ప్రచురించారు. (ఏప్రిల్‌-జూన్‌ 2003) మాకు ఇప్పుడు మూడు నెలల అబ్బాయి ఉన్నాడు, పసిపిల్లలను పెంచడంపై మీరు అద్భుతమైన సలహాలను ప్రచురించారు. ఈ ఆర్టికల్‌లు తల్లి అయిన యువతికి చాలా సహాయకరంగా ఉన్నాయి.

డి. కె., పోలండ్‌ (g04 10/22)

ఓషధి చికిత్సలు “ఓషధి చికిత్సలు​—⁠మీకు సహాయం చేయగలవా?” అనే ఆర్టికల్‌ చదివి నేను ఎంతో ఆనందించాను. (జనవరి-మార్చి 2004) నేను ప్రభుత్వ గుర్తింపు పొందిన నర్సును, నేను నా కీళ్ళ చికిత్స కోసం రకరకాల ప్రకృతిసిద్ధ చికిత్సలను ఉపయోగిస్తాను. అవి నాకు చాలా ప్రయోజనకరంగా ఉన్నట్లు గమనించాను. అయితే, కొన్ని ఓషధులు సర్జరీ సమయంలో అధిక రక్తస్రావానికి దారితీయగలవని మీరు పేర్కొనలేదు. నిజానికి సర్జరీకి ముందు కొన్ని ఓషధులను మానివేయడం అనేది యెహోవాసాక్షులు పరిగణలోకి తీసుకోవలసిన చాలా ముఖ్యమైన విషయం.

జె. హెచ్‌., అమెరికా (g04 10/22)

“తేజరిల్లు!” ప్రతిస్పందన: చాలా ముఖ్యమైన ఈ విషయాన్ని జ్ఞాపకం చేసినందుకు మేము అభినందిస్తున్నాం. సర్జరీకి ముందు, రోగి అప్పటి వరకు తను తీసుకున్న మందుల గురించి, ఓషధుల గురించి కూడా తన డాక్టరుకు తెలపాలి. ప్రత్యేకించి, ‘రక్తమును విసర్జింపవలెను’ అనే బైబిలు బోధను పాటించే వారికి ఇది ప్రాముఖ్యం.​—అపొస్తలుల కార్యములు 15:28,29.

తోబుట్టువుల పోటీ “యువత ఇలా అడుగుతోంది . . . తోబుట్టువుల అడుగుజాడలను అనుసరించమని చేయబడే ఒత్తిడిని నేనెలా అధిగమించవచ్చు?” ఆర్టికల్‌ ప్రచురించినందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. (జనవరి-మార్చి 2004) నాకు 16 ఏండ్లు, మా అక్కకే ఎప్పుడూ ఎక్కువ శ్రద్ధ చూపించబడుతున్నట్లు నాకు అనిపిస్తుంది. యెహోవా నన్ను గమనిస్తాడని నాకు తెలుసనుకోండి, అయినా ఎందుకో కానీ నాకు ఇప్పటికీ ఒంటరితనపు భావాలు కలుగుతున్నాయి. ఈ ఆర్టికల్‌ నాకు కలిగే భావాల గురించి ప్రస్తావించింది. అది ఎంతో సున్నితమైన మాటల్లో చెప్పడం మూలంగా నేను చదివేటప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆచరణాత్మకమైన సలహా ఇచ్చినందుకు మీకు నా ధన్యవాదాలు. అది నా హృదయాన్ని కుదుటపరచింది.

ఎమ్‌. ఒ., జపాన్‌ (g04 9/22)

ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అందరు యౌవనుల్లాగే నేనూ అప్పుడప్పుడు తలంచేవాడిని. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు, మా అక్క ఎప్పుడూ ఒక చక్కని ఉదాహరణగా దృష్టించబడేది. కాబట్టి, కుటుంబంలోని మరో సభ్యునితో ఎప్పుడూ పోల్చితే కలిగే భావాలు ఎలాంటివో నాకు తెలుసు. మనం బాగా చేయగలిగే దాన్ని కనుగొనడం గురించి మీరు చెప్పిన మాటలు “చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవ[లె]” అంటే సరైన సమయంలో చెప్పిన మాటల్లాగ అనిపించాయి.​—సామెతలు 25:11.

ఎస్‌. టి., అమెరికా (g04 9/22)

నాకు ఒక అక్కా, ఒక తమ్ముడూ ఉన్నారు. వాళ్ళిద్దరూ చాలా విషయాల్లో నా కన్నా మెరుగు. అందుకే నేను మీ సలహాను పాటిస్తున్నాను, నేనిప్పుడు స్పానిష్‌ భాష నేర్చుకుంటున్నాను, పరిచర్యలో ఎక్కువగా పాల్గొంటున్నాను. నేను నేర్చుకోవడంలో ఎంతో సంతోషిస్తున్నాను, ప్రజలు నన్ను కూడా గుర్తిస్తున్నారు.

హెచ్‌. బి., అమెరికా (g04 9/22)

హోమ్‌వర్క్‌ నేను మిడిల్‌ స్కూల్లో మొదటి సంవత్సరం విద్యార్థిని. నాకు నా సమయాన్ని వినియోగించుకోవడం ఎప్పుడూ కష్టంగా ఉండేది. “యువత ఇలా అడుగుతోంది . . . హోమ్‌వర్క్‌ చేసుకోవడానికి సమయం ఎక్కడినుండి వస్తుంది?” ఆర్టికల్‌ చదవడం నాకు సహాయపడింది. (ఏప్రిల్‌-జూన్‌ 2004) నేను టీవీ అంతగా చూడను. అయితే చూడడం మొదలెడితే ఒక కార్యక్రమం తర్వాత మరొకటి చూస్తూనే ఉంటాను. కానీ ఇప్పుడు నేను అసలు చూడడమే లేదు.

ఆర్‌ .ఓ., జపాన్‌ (g04 11/8)