ప్రసిద్ధి కావాలనే బలమైన కోరిక ఉండడం తప్పా?
బైబిలు ఉద్దేశము
ప్రసిద్ధి కావాలనే బలమైన కోరిక ఉండడం తప్పా?
“కీర్తి, ఐశ్వర్యం, అధికారం కలిగివుండడంలో తప్పేముంది?” అనే ఈ ప్రశ్న ఒక మత వ్యవస్థ ఇచ్చిన ఒక నివేదికలో “నైతిక విలువల సందిగ్ధత” అనే శీర్షిక కింద కనబడింది. ఆ నివేదిక దేవుడు అబ్రాహాముతో అన్న మాటలను సూచించింది: “నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.”—ఆదికాండము 12:2.
ఆ నివేదిక “ప్రసిద్ధి కావాలనే బలమైన కోరిక ఇతరులకు హాని కలిగించేంత అతిగా ఉండకూడదు” అని చెబుతూనే మొదటి శతాబ్దంలోని ఒక ప్రఖ్యాత రబ్బీ మాటలను ఉటంకించింది. ఆ రబ్బీ ఇలా అన్నాడు: “నా కోసం నేను ప్రయాసపడకపోతే, ఇంకెవరు ప్రయాసపడతారు? జీవితంలో మనం విజయం సాధించడానికి కృషి చేయకపోతే మరెవరూ మనకు సహాయం చేయలేరు.” దేవుణ్ణి సేవించాలని కోరుకునేవారికి, ప్రసిద్ధి కావాలనే బలమైన కోరికతో ఉండడం తప్పా ఒప్పా అనే సందిగ్ధత ఉందా? జీవితంలో విజయం సాధించడానికి కృషి చేయడంలో ఏమి ఇమిడివుంది? ప్రసిద్ధి కావాలనే బలమైన కోరిక ఉండడం తప్పా? ఈ విషయంలో బైబిలు దృక్కోణం ఏమిటి?
అబ్రాహాము ప్రసిద్ధి కావాలనే బలమైన కోరికతో ఉండేవాడా?
బైబిల్లో, అబ్రాహాము విశ్వాసం విషయంలో అత్యంత విశేషమైన వ్యక్తిగా పేర్కొనబడ్డాడు. (హెబ్రీయులు 11:8, 17) దేవుడు అబ్రాహామును గొప్ప జనముగా చేస్తాను ఆయన నామమును గొప్ప చేస్తాను అని వాగ్దానం చేయడం ద్వారా, ప్రసిద్ధి కావాలనే బలమైన కోరికతో ఉండమని ఆయనను ప్రోత్సహించడం లేదు. ఆయన ద్వారా మానవాళిని ఆశీర్వదిస్తానని దేవుడు తన సంకల్పాన్ని చెబుతున్నాడు, ఆ సంకల్పం మామూలు మానవుల అభిలాషల కన్నా ఎంతో ప్రాముఖ్యమైనది.—గలతీయులు 3:13, 14.
అబ్రాహాము దేవుణ్ణి ఆరాధించడానికి ఊరు పట్టణంలోని భోగభాగ్యాల జీవన విధానాన్ని విడిచిపెట్టాడు. (ఆదికాండము 11:31) ఆ తర్వాత, స్థిర నివాసం ఏర్పరచుకోబోయే ప్రాంతంలోని ఎంతో అభిలషణీయమైన భూభాగాన్ని తన సహోదరుని కుమారుడైన లోతుకు ఇవ్వజూపినప్పుడు కూడా శాంతిగా ఉండాలన్న ఉద్దేశంతో, ఆయన తన బలాన్నీ అధికారాన్నీ ఇష్టపూర్వకంగా వదులుకున్నాడు. (ఆదికాండము 13:8, 9) అబ్రాహాము ప్రసిద్ధి కావాలనే బలమైన కోరిక గల వ్యక్తి అని బైబిల్లో ఎక్కడా లేదు. ఆయనలోని విశ్వాసం, విధేయత, వినయం ఆయనను దేవుడు ఇష్టపడే నిజమైన ‘స్నేహితునిగా’ చేశాయి.—యెషయా 41:8.
హోదా, కీర్తి, అధికారం విషయంలో భిన్నమైన దృక్కోణం
ప్రాచీన రాజైన సొలొమోనుకు, ప్రసిద్ధి కావాలనే బలమైన కోరికగల వ్యక్తి ఆశించే హోదా, కీర్తి, అధికారం ఉన్నాయి, ప్రసంగి 2:3-9) అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆయనకు వాటి మీద బలమైన కోరిక లేదు. సొలొమోను రాజరికాన్ని చేపట్టినప్పుడు, దేవుడు ఆయనను నీకిష్టమైనది కోరుకో అని అన్నాడు. అప్పుడు ఆయన దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజలను ఏలడానికి అవసరమైన విధేయతగల హృదయాన్నీ, వివేచననూ ఇమ్మని వినయంగా కోరాడు. (1 రాజులు 3:5-9) ఆ తర్వాత, ఆయన తాను సంపాదించిన సంపద గురించీ అధికారం గురించీ క్షుణ్ణంగా వివరించిన తర్వాత “అవన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను” అని అన్నాడు.—ప్రసంగి 2:11.
వాటితోపాటు ఆయనకు గొప్ప ఐశ్వర్యం కూడా ఉండేది. (మానవులు తమ జీవితంలో విజయం సాధించడం గురించి సొలొమోను ఏమైనా చెప్పాడా? ఒక విధంగా చెప్పాడనే అనవచ్చు. ఆయన తన జీవితంలోని అనేక అనుభవాలను పరిశీలించిన తర్వాత ముగింపులో ఇలా అన్నాడు: “దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.” (ప్రసంగి 12:13) మానవులు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ద్వారానే తమ జీవితంలో విజయం సాధించగలరు కానీ హోదా, ఐశ్వర్యం, కీర్తి, అధికారం వంటివాటిని సంపాదించుకోవడం ద్వారా కాదు.
వినయం ఘనతకు దారితీస్తుంది
నిజమే, ఒక వ్యక్తి తనను తాను కొంతవరకు ప్రేమించుకోవడంలో తప్పేమీ లేదు. మనల్ని మనం ప్రేమించుకునే విధంగానే మన పొరుగువారిని ప్రేమించాలని బైబిలు ఆదేశిస్తోంది. (మత్తయి 22:39) సుఖసంతోషాలను కోరుకోవడం సహజమే. కానీ కష్టపడి పనిచేయాలని, వినయంగా ఉండాలని, న్యాయంగా నడుచుకోవాలని కూడా లేఖనాలు ప్రోత్సహిస్తున్నాయి. (సామెతలు 15:33; ప్రసంగి 3:13; మీకా 6:8) నిజాయితీగా, విశ్వసనీయంగా ఉంటూ కష్టపడి పనిచేసేవారు తరచూ ఇతరుల దృష్టిలోకి వస్తారు, వారికి మంచి ఉద్యోగాలు దొరుకుతాయి, ఇతరుల గౌరవం సంపాదించుకుంటారు. అలాంటి జీవన విధానాన్ని పాటించడం స్వలాభం కోసం ఇతరులను ఉపయోగించుకోవడం కన్నా అంతస్తు కోసం ఇతరులతో పోటీపడడం కన్నా ఎంతో మంచిది.
వివాహ విందులో అగ్రస్థానాన్ని ఎంపిక చేసుకోకూడదని యేసు తన శ్రోతలను హెచ్చరించాడు. ఎవరైనా తమను ఆహ్వానించినప్పుడు వెళ్ళి చివరి స్థానంలో కూర్చొమ్మనీ ఆతిథేయుడే స్వయంగా వచ్చి అగ్రస్థానంలో కూర్చుండబెట్టేంత వరకు ఎదురుచూడమనీ సలహా ఇచ్చాడు. అందులోని సూత్రాన్ని స్పష్టంగా చెబుతూ యేసు ఇలా అన్నాడు: “తన్నుతాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.”—లూకా 14:7-11.
నిజ క్రైస్తవులు ప్రసిద్ధి కావాలనే బలమైన కోరికకు దూరంగా ఉంటారు
అహంకారపూరితంగా ప్రసిద్ధి కావాలనే బలమైన కోరికకు, మానవ అపరిపూర్ణతకు సంబంధం ఉందని బైబిలు సూచిస్తోంది. (యాకోబు 4:5, 6) అపొస్తలుడైన యోహానుకు ఒకప్పుడు అలాంటి కోరిక ఉండేది. ఆయనకు ఉన్నతస్థానంలో ఉండాలనే కోరిక ఎంత అధికంగా ఉండేదంటే, ఆయన తన సహోదరునితో కలిసి రాజ్యంలో తమకు ఉన్నతస్థానం ఇమ్మని యేసును ధైర్యంగా అడిగాడు. (మార్కు 10:37) ఆ తర్వాత యోహాను తన వైఖరిని మార్చుకున్నాడు. వాస్తవానికి ఆయన వ్రాసిన మూడవ పత్రికలో దియొత్రెఫేను తీవ్రంగా ఖండిస్తూ, వాడు ‘ప్రధానత్వము కోరుచున్నాడు’ అని కఠినమైన మాటలు ఉపయోగించాడు. (3 యోహాను 9, 10) నేడు క్రైస్తవులు యేసు మాటలను యథార్థంగా అనుసరిస్తూ తమను తాము తగ్గించుకుంటారు, అదే సమయంలో, ప్రసిద్ధి కావాలనే బలమైన కోరికతో కూడిన తలంపులకు దూరంగా ఉండడం నేర్చుకున్న వయోధికుడైన అపొస్తలుడైన యోహాను ఆదర్శాన్ని పాటిస్తారు.
వాస్తవానికి ఒక వ్యక్తిలోని నైపుణ్యాలు, సామర్థ్యాలు, మంచి పనులు, కృషి వాటికవే గుర్తింపును తీసుకురావు. కొన్నిసార్లు వాటివల్ల తోటి మానవుల ద్వారా ప్రయోజనం కలగవచ్చు, కొన్నిసార్లు కలగకపోవచ్చు. (సామెతలు 22:29; ప్రసంగి 10:7) కొన్నిసార్లు తక్కువ అర్హతలు ఉన్నవారు అధికారస్థానాన్ని పొందవచ్చు, ఎక్కువ సామర్థ్యం ఉన్నవారు గుర్తింపు పొందకపోవచ్చు. అపరిపూర్ణమైన ఈ లోకంలో అంతస్తూ అధికారాలను సంపాదించుకునేవారు మంచి అర్హతలు ఉన్నవారే కావాల్సిన అవసరం లేదు.
నిజ క్రైస్తవులకు, ప్రసిద్ధి కావాలనే బలమైన కోరికతో ఉండడం తప్పా ఒప్పా అనే నైతిక సందిగ్ధత తలెత్తదు. ప్రసిద్ధి కావాలనే బలమైన కోరికకు దూరంగా ఉండేందుకు వారి బైబిలు శిక్షిత మనస్సాక్షి వారికి తోడ్పడుతుంది. వారు అన్ని పరిస్థితుల్లోనూ దేవుని మహిమ కోసం శాయశక్తులా కృషి చేస్తూ ఫలితాన్ని దేవునికి వదిలేస్తారు. (1 కొరింథీయులు 10:31) క్రైస్తవులు దేవునికి భయపడుతూ ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా జీవితంలో విజయం సాధించడానికి కృషి చేస్తారు. (g05 6/8)
[16, 17వ పేజీలోని చిత్రం]
ప్రసిద్ధి కావాలనే బలమైన కోరికతో ఉండమని దేవుడు అబ్రాహామును ప్రోత్సహించాడా?