కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రండి, “మనం ఎవరికి విధేయత చూపించాలి?” అనే బహిరంగ ప్రసంగాన్ని వినండి

రండి, “మనం ఎవరికి విధేయత చూపించాలి?” అనే బహిరంగ ప్రసంగాన్ని వినండి

రండి, “మనం ఎవరికి విధేయత చూపించాలి?” అనే బహిరంగ ప్రసంగాన్ని వినండి

విధేయత అనే తలంపే చాలామందికి రుచించదు. ‘నా ఇష్టం వచ్చినట్లు చేయడానికి నాకు స్వేచ్ఛ కావాలి’ అనే ధోరణి సాధారణంగా కనబడుతుంది. అయితే మన దైనందిన జీవితంలో మనమందరం విధేయతను విలువైనదిగా ఎంచుతాం అన్నది వాస్తవం. మీరు ఒక హెచ్చరికా సంకేతాన్నో సూచనలనో పాటించిన ప్రతిసారీ ఒకింత విధేయత చూపిస్తున్నట్లే. అయినా మానవ సమాజంలో క్రమబద్ధతనూ శాంతినీ కాపాడేందుకు ప్రభుత్వ నియమాలకు విధేయత చూపించాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా ఎవరనగలరు? ఉదాహరణకు, ప్రజలందరూ ట్రాఫిక్‌ నియమాలను పాటించడానికి నిరాకరిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఊహించండి!

కానీ మనుషులు ఇతర మనుషుల మీద అధికారం చెలాయించినప్పుడు, ఫలితాలు ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండవు. “ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు” అని చాలాకాలం క్రితమే బైబిలు పేర్కొంది. (ప్రసంగి 8:9) మన నమ్మకానికీ విధేయతకూ అర్హుడైన పాలకుడు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉన్నట్లయితే మనం ఆయనను ఎలా గుర్తించవచ్చు? మనం ఆయన పాలనలో దేన్ని ఆశించవచ్చు? ఈ ప్రశ్నలకు జవాబులు, “మనం ఎవరికి విధేయత చూపించాలి?” అనే ప్రేరణాత్మక బహిరంగ ప్రసంగంలో లభిస్తాయి. ఈ ప్రసంగం ఈ నెలలో ఆరంభమయ్యే యెహోవాసాక్షుల జిల్లా సమావేశాల్లో ఇవ్వబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమావేశాలు వందలాదిగా జరుగుతాయి. మీకు సమీపంలో జరిగే సమావేశ స్థలాన్ని తెలుసుకునేందుకు, మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులను సంప్రదించండి లేదా 5వ పేజీలో ఇవ్వబడిన అడ్రసు ద్వారా ఈ పత్రిక ప్రచురణకర్తలకు వ్రాయండి. (g05 5/22)