మా పాఠకుల నుండి
మా పాఠకుల నుండి
యువత ఇలా అడుగుతోంది “యువత ఇలా అడుగుతోంది . . . నేను వైఫల్యాన్ని ఎలా తట్టుకోగలను?” (జనవరి-మార్చి, 2005) అనే అద్భుతమైన ఆర్టికల్ ప్రచురించినందుకు మీకు కృతజ్ఞతలు. నేను దేవునికి కోపం తెప్పించానని, ఆయన క్షమాపణ పొందలేనని ఆ ఆర్టికల్‌లోని ఆనలాగే నేను కూడా భావించాను. అయితే ఈ ఆర్టికల్ వివరించినట్లుగా, యెహోవా దావీదును క్షమించాడు, ఆయనకు బలహీనతలున్నప్పటికీ ఆయనను ఆదుకున్నాడు. కాబట్టి మనం విఫలమైనా మనం తిరిగి నిలదొక్కుకోవడానికి యెహోవా మనకు సహాయం చేస్తాడని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహకరమైన విషయమో కదా!
జీ. సీ., ఇటలీ
నాకు గలతీయులు 6:4 ఎంతో సహాయం చేసింది. నేను ఎప్పుడూ నా తరగతిలో ఉన్న మంచి విద్యార్థులతో నన్ను నేను పోల్చుకుంటున్నానని గుర్తించాను. అలా చేయడం ద్వారా నాకు నేను హాని చేసుకుంటున్నానని గ్రహించేందుకు ఈ ఆర్టికల్ నాకు సహాయం చేసింది.
సీ. పీ., ఫ్రాన్స్ (g05 9/8)
పాఠశాలలో సాక్ష్యమివ్వడం “తమ విశ్వాసం గురించి ధైర్యంగా మాట్లాడే యౌవనస్థులు” (అక్టోబరు-డిసెంబరు, 2004) అనే ఆర్టికల్ నన్ను నిజంగా ప్రభావితం చేసింది. పాఠశాలలో నా విశ్వాసం గురించి తోటి విద్యార్థులతోనైనా లేక టీచర్లతోనైనా మాట్లాడడానికి హోలీ, జెస్సికా, మెలిస్సాల అనుభవాలు సహాయం చేశాయి. మొదట్లో నేను సాక్ష్యమివ్వడానికి జంకేవాణ్ణి. కానీ ఇప్పుడు పాఠశాలలో నేను కలిసేవారితో మాట్లాడడానికి ప్రోత్సహించబడ్డాను.
జీ. వో., నైజీరియా (g05 9/8)
బొల్లి ఇటీవల నా హృదయాన్ని పులకరింపజేసిన ఆర్టికల్ “బొల్లి అంటే ఏమిటి?” (జనవరి-మార్చి, 2005) నా తొమ్మిదవ ఏట నుండే నాకు బొల్లి ఉంది. నేను ఇప్పుడు 30వ పడిలో ఉన్నాను. నేను ప్రయత్నించిన ఎన్నో చికిత్సలు విఫలమైన తర్వాత, నా వ్యాధి నయం కావడానికి నేను దేవుని నూతనలోకం వరకు ఆగాల్సిందేననే వాస్తవాన్ని అంగీకరించాను. అయినా నా జీవితం సంతృప్తికరంగానే ఉంది! ఈ చర్మవ్యాధి ఉన్నా సంతృప్తికరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపడం సాధ్యమే!
యమ్. ఎస్., మొజాంబిక్ (g05 9/8)
“బొల్లి అంటే ఏమిటి?” (జనవరి-మార్చి, 2005) అనే ఆర్టికల్‌ను ప్రచురించినందుకు కృతజ్ఞతలు. నేను ఐదు సంవత్సరాల నుండి ఈ వ్యాధితో బాధపడుతున్నాను. కానీ మీరు ఈ ఆర్టికల్ ప్రచురించినప్పటి నుండి నేను ఈ వ్యాధిని సరైన విధంగా తట్టుకోగలుగుతున్నాను. ప్రతీ ఒక్కరిపట్ల ఎంతో శ్రద్ధ చూపించే క్రైస్తవ సమాజంలో భాగంగా ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను!
సీ. హెచ్., జర్మనీ
నేను గత 25 సంవత్సరాల నుండి బొల్లితో బాధపడుతున్నాను. నేను అనుభవిస్తున్న మానసిక క్షోభనే ఇతరులు కూడా అనుభవిస్తున్నారని తెలుసుకోవడం నాకు ఎంతో ఓదార్పును ఇచ్చింది. చాలామందికి ఈ వ్యాధి గురించి తప్పుడు అభిప్రాయం ఉంది, కానీ వారు ఈ ఆర్టికల్ చదివితే వారికి ఖచ్చితమైన అవగాహన కలుగుతుంది. ఈ విషయం గురించి వ్రాసినందుకు మీకు ఎన్నో కృతజ్ఞతలు!
కె. ఎస్., జపాన్
నేను దాదాపు 30 సంవత్సరాల నుండి ఈ సమస్యతో బాధపడుతున్నాను. నా చిన్నప్పుడు, నా రూపాన్నిబట్టి నా సహవాసులు నన్ను హేళన చేసేవారు. ఈ వ్యాధితో జీవించడం నేను నేర్చుకున్నాను. సిబొంగీల్‌లాగే నేను, యెహోవా త్వరలో ఆరోగ్య సమస్యలన్నిటినీ, వాటితో పాటు వచ్చే ఎంతో బాధ కలిగించే మానసిక క్షోభను తీసివేస్తాడనే బైబిలు వాగ్దానంతో ఇతరులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాను.
జే. ఎమ్., ఛెక్ రిపబ్లిక్
19 ఏండ్ల నా కూతురికి ఈ వ్యాధి ఉంది. దాని గురించి ఆమె ఎంత కన్నీరు కార్చిందో, యెహోవాకు ఎన్నిసార్లు ప్రార్థించిందో ఎవరికీ తెలియదు. ఆమె యెహోవాను ప్రేమిస్తుంది, ఈ మధ్యే పూర్తికాల పరిచారకురాలు అయింది. మనపట్ల యెహోవాకున్న శ్రద్ధ గురించి తెలుసుకోవడానికి ఇలాంటి ఆర్టికల్స్ సహాయం చేస్తాయి కాబట్టి వాటిని ప్రచురిస్తున్నందుకు మీకు మా కృతజ్ఞతలు.
ఎస్. ఎస్., జపాన్
బొల్లితో జీవించడం మానసికంగా, భావోద్రేకంగా ఎంతో సవాలుతో కూడినదని వేరుగా చెప్పనక్కరలేదు. ఒకరితో ఒకరం సున్నితంగా వ్యవహరించాలని యెహోవా మనకు బోధిస్తున్నాడు. నా సహజ రంగు నాకు తిరిగివచ్చే సమయం కోసం నేను ఎదురుచూస్తున్నాను.
బి. డబ్యూ., అమెరికా (g05 7/8)