మా పాఠకుల నుండి
మా పాఠకుల నుండి
తల్లులు “విద్య నేర్పించేవారిగా తల్లుల పాత్ర” అనే చక్కని ఆర్టికల్‌ల పరంపరను అందజేసినందుకు మీకు మా కృతజ్ఞతలు. (ఏప్రిల్-జూన్, 2005) అవి నిజంగా నా హృదయాన్ని స్పృశించాయి, చదవడం పూర్తి చేసిన వెంటనే మా అమ్మకు ఫోన్ చేసేలా అవి నన్ను ప్రోత్సహించాయి. మా అమ్మ ఒంటరిగా నన్ను, మా అన్ననూ పెంచింది. ఆమె మమ్మల్ని పోషించేందుకు అదనపు విద్యార్హతను సంపాదించుకుంది. మేము క్రైస్తవ కూటాలకు, పరిచర్యకు క్రమంగా వెళ్ళేలా చూసింది. ఆమె శ్రమ మంచి ఫలితాలనిచ్చింది. ఆమె అద్భుతమైన ఉదాహరణను నాకు గుర్తుచేసినందుకు మీకు కృతజ్ఞతలు.
ఎమ్. ఎస్., అమెరికా
నాకు ఆధ్యాత్మికంగా, నైతికంగా ఉపదేశించడానికి మా అమ్మ చేసిన స్వయంత్యాగపూరిత కృషి నాకు గుర్తుచేయబడింది. ఆమెకు మా నాన్న నుండి భావోద్రేక, ఆర్థిక మద్దతు లభించకపోయినా యెహోవాను ప్రేమించడాన్ని ఆమె నాకు నేర్పించింది. పూర్తికాల పరిచారకురాలిగా తయారవమని కూడా ఆమె నన్ను ప్రోత్సహించింది. మా అమ్మ చేసిన కృషికి నేను అంత విలువ ఇవ్వలేదని నాకు అనిపిస్తుంది, అయితే ఆ ఆర్టికల్‌ల పరంపర సూచించినట్లుగా ఆమె ప్రశంసించబడడానికి అర్హురాలు. ఆమెకు నా కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఉన్న దూరప్రాంతం నుండి ఫోన్ చేశాను!
సి. హెచ్. కె., రిపబ్లిక్ ఆఫ్ కొరియా
మా నాన్న యెహోవాసాక్షి కాదు. మా అమ్మే నన్ను ‘ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను పెంచింది.’ (ఎఫెసీయులు 6:4) నేను కొన్నిసార్లు కనుపరచిన వైఖరినిబట్టి, అలా పెంచడం ఆమెకు సులభం కాలేదు. నాకు ఇప్పుడు 24 సంవత్సరాలు, ఆమె ఆశలువదులుకోకుండా నా హృదయంలో బైబిలు సత్యాలను నాటడానికి పట్టుదల చూపించినందుకు నేను కృతజ్ఞురాలిని.
డి. ఎమ్., ఇటలీ (g05 12/8)
టమాటాలు నాకు 12 సంవత్సరాలు, ‘టమాటా—ఎంతో వైవిధ్యమైన “కూరగాయ”’ అనే ఆర్టికల్ నాకు నచ్చింది. (ఏప్రిల్-మార్చి, 2005) వివిధ రకాల రుచిగల కూరగాయలను సృష్టించినందుకు నేను యెహోవాకు ఎంతో కృతజ్ఞురాలిని. చారలు ఉన్న టమాటాలు కూడా ఉన్నాయనే విషయాన్ని చదివి ఆశ్చర్యపోయాను! అలాంటి ఉత్తేజకరమైన ఆర్టికల్‌లు వ్రాస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు.
ఎమ్. ఎఫ్., లాట్వియా
మొసళ్ళు “మొసలిని చూసి మీరు చిరునవ్వు చిందించగలరా?” (ఏప్రిల్-జూన్, 2005) అనే ఆర్టికల్ నన్ను ఎంతో ప్రభావితం చేసింది. నేను మొసలిని ఎల్లప్పుడూ అద్భుతమైన ప్రాణిగా పరిగణించేదాన్ని. మొసళ్ళను నేను ఇష్టపడేంతగా, ఇతరులు కూడా ఇష్టపడేలా చేసే ఎన్నో ఆసక్తికరమైన వాస్తవాలను చదివి సంతోషించాను. మనం మొసళ్ళ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకునేందుకు వీలయ్యే యెహోవా వాగ్దానం చేసిన నూతనలోకం కోసం ఎదురుచూస్తున్నాను!
ఎల్. ఐ., అమెరికా
మా పాఠకుల నుండి నేను ఎముకలకు సంబంధించిన వ్యాధితో పుట్టాను. “మైలీన్‌కు ఒక కొత్త ముఖం” (జూలై-సెప్టెంబరు, 2004) అనే ఆర్టికల్ గురించి “మా పాఠకుల నుండి” (ఏప్రిల్-జూన్ 2005) శీర్షికలో వచ్చిన జాలికలిగించే, ప్రోత్సాహకరమైన ఉత్తరాలు నన్ను కంటతడి పెట్టించాయి. ప్రతీ ఉత్తరంలో నాకు ప్రత్యేకంగా ప్రాముఖ్యమైన, నేను వ్యక్తిగతంగా ప్రయోజనం పొందగల ఏదో ఒక నిర్దిష్ట అంశం ఉంది.
ఎమ్. జె., బ్రిటన్ (g05 12/22)
పిల్లలు నేను ఇటీవల “పిల్లల పసితనంలో—తల్లిదండ్రులు ఏమి చేయాలి?” (జనవరి-మార్చి, 2005) అనే ఆర్టికల్‌ల పరంపరను చదివాను. ఈ ఆర్టికల్‌లు నన్ను ఎంతగా ప్రభావితం చేశాయంటే నేను దాని గురించి వ్రాయాలని నిర్ణయించుకున్నాను. నాకు ఒక కూతురు ఉంది, ఆమెకు త్వరలో ఐదు సంవత్సరాలు నిండనున్నాయి. ఆమె మెలకువగా ఉన్న సమయమంతటికీ పట్టిక వేయాలని నేను అనుకునేదాన్ని. అయితే పిల్లలు సహజంగా ఆడుకునే ఆటలు వారిలోని సృజనాత్మకతను ప్రేరేపించి, వారిలోని సామాజిక, మానసిక, భావోద్వేగ సామర్థ్యాలను వృద్ధిచేస్తాయి కాబట్టి, అవి వాస్తవానికి అవసరమని కొందరు బోధకులు భావిస్తున్నారని ఈ పత్రిక చెప్పింది. మీకు ఎన్నో కృతజ్ఞతలు! దయచేసి అలాంటి అంశాల మీద ఆర్టికల్‌లు ఎల్లప్పుడూ ప్రచురిస్తూ ఉండండి!
ఐ. కె., రష్యా
నేను ఈ పరంపరను చదువుతున్నప్పుడు కన్నీళ్ళు ఆపుకోలేకపోయాను. నాకు 29 సంవత్సరాల క్రితం పాప పుట్టిన సమయం గుర్తు వచ్చింది, అప్పుడు నేను యెహోవాను సేవించని ఒక యౌవన తల్లిని. నేను ఎన్నో పొరపాట్లు చేశాను. అయితే దుఃఖంతో కూడిన నా కన్నీళ్ళు ఆనంద భాష్పాలుగా మారాయి. నా కూతురు ఒక వారం క్రితమే తన మొదటి పాపకు జన్మనిచ్చింది. నా మనవరాలికి యెహోవాను ప్రేమించే, అలాంటి ఆర్టికల్‌ల నుండి ప్రయోజనం పొందే తల్లిదండ్రులు ఉన్నందుకు నేను యెహోవాకు ఎంతో కృతజ్ఞురాలిని.
ఈ. హెచ్., అమెరికా (g05 8/8)