కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విపత్తులన్నీ త్వరలో అంతం కానున్నాయి

విపత్తులన్నీ త్వరలో అంతం కానున్నాయి

విపత్తులన్నీ త్వరలో అంతం కానున్నాయి

“పిల్లలు, పిల్లల పిల్లలు. వినండి! . . . ఎప్పుడో ఒకప్పుడు ఈ పర్వతంలో మంటలు రాజుకుంటాయి. అయితే అది సంభవించే ముందు భయంకర శబ్దాలు, గర్జనలు వినిపిస్తాయి, భూకంపాలు సంభవిస్తాయి. ప్రచండమైన వేగంతో పొగ, మంటలు, మెరుపులు సంభవిస్తాయి, గాలి రివ్వున వీస్తూ, భీకరమైన శబ్దాన్ని, హోరును పుట్టిస్తుంది. మీరు పరుగెత్తగలిగేంత దూరం పరుగెత్తండి . . . మీరు ఆ పర్వతం ఇస్తున్న హెచ్చరికలను లెక్కచేయనట్లయితే, జీవితంకన్నా ఆస్తులు, చరాస్తులు మీకు ప్రియమైనవైతే మీ నిర్లక్ష్యాన్నిబట్టి, దురాశనుబట్టి ఆ పర్వతం మిమ్మల్ని శిక్షిస్తుంది. మీ ఇంట్లో ఉన్న నిప్పు గూడు గురించి, మీ ఇంటి గురించి చింతించకుండా నిస్సంకోచంగా పారిపోండి.”

ఆండ్రూ రాబిన్‌సన్‌ రచించిన ఎర్త్‌ షాక్‌ అనే పుస్తకం నుండి తీసుకోబడిన ఆ హెచ్చరిక, ఇటలీలోని వెసూవియస్‌ పర్వత పాదం దగ్గర్లో ఉన్న పోర్టీచీ పట్టణంలో, 1631లో అగ్నిపర్వతం విస్ఫోటం చెందిన తర్వాత ఒక స్మారక ఫలకం మీద చెక్కబడింది. ఆ విస్ఫోటం 4,000 మందిని పొట్టనబెట్టుకుంది. “1631లో అనూహ్య రీతిలో సంభవించిన ఆ విస్ఫోటమే . . . వెసూవియస్‌ను సామాన్య పేరుగా మార్చింది.” అదెలా? పోర్టీచీ పట్టణాన్ని పునర్నిర్మిస్తున్నప్పుడు పాంపేయీ, హర్కులేనియమ్‌ పట్టణాలు బయటపడ్డాయి. సా.శ. 79లో వేసూవియస్‌ పర్వతం విస్ఫోటం చెందినప్పుడు ఆ రెండు పట్టణాలు నాశనానికి గురై, మట్టిలో కలిసిపోయాయి.

ఆ విపత్తును తప్పించుకొని ఆ తర్వాత అధిపతిగా మారిన ప్లైనీ ద యంగర్‌ అనే రోమన్‌ పౌరుడు అసాధారణమైన భూకంప హెచ్చరికల గురించి వ్రాశాడు. అతను, అతని తల్లి, మరితరులు ఆ హెచ్చరికను లక్ష్యపెట్టి చర్యతీసుకుని, ప్రాణాలను కాపాడుకున్నారు.

మన కాలానికి ఒక హెచ్చరిక సూచన

నేడు మనం ఈ లోక ఆర్థిక, సామాజిక, రాజకీయ విధానాల అంతం త్వరగా సమీపిస్తున్న కాలంలో జీవిస్తున్నాం. అలాంటి సమయంలో జీవిస్తున్నామని మనకెలా తెలుసు? దేవుని తీర్పుదినం సమీపంలో ఉందని సూచించే ఒక సూచనను అందించే లోక పరిణామాల పరంపర గురించి యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు కాబట్టి మనకు తెలుసు. ఒక అగ్నిపర్వతం ఎలాగైతే భీకరమైన శబ్దాన్ని చేస్తుందో, పొగను, బొగ్గును బయటకు కక్కుతుందో అలాగే ఆ సంయుక్త సూచనలో గొప్ప యుద్ధాలు, భూకంపాలు, కరవులు, తెగుళ్ళు వంటివి ఉన్నాయి, అవన్నీ 1914 నుండి లోకాన్ని ఇంతకుముందెన్నడూ లేని విధంగా నాశనం చేశాయి.​—మత్తయి 24:3-8; లూకా 21:10, 11; ప్రకటన 6:​1-8.

అయితే యేసు హెచ్చరికా సూచనలో నిరీక్షణా సందేశం కూడా ఉంది. “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును” అని ఆయన అన్నాడు. (మత్తయి 24:​14) యేసు రాజ్య సందేశాన్ని “సువార్త” అని పిలిచాడని గమనించండి. అది నిజంగా ఒక సువార్తే. ఎందుకంటే, క్రీస్తు యేసు ఆధ్వర్యంలోని పరలోక ప్రభుత్వమైన దేవుని రాజ్యం మానవులు చేసిన హాని అంతటినీ తీసివేస్తుంది. అంతేకాక, అది ప్రకృతి విపత్తులు లేకుండా చేస్తుంది.​—⁠లూకా 4:43; ప్రకటన 21:​3, 4.

యేసు భూమ్మీద మానవునిగా ఉన్నప్పుడు అత్యంత ప్రమాదకరమైన తుఫానును నిమ్మళింపజేయడం ద్వారా వాతావరణ పరిస్థితుల మీద తనకున్న శక్తిని ప్రదర్శించాడు. భయపడిన ఆయన శిష్యులు సంభ్రమాశ్చర్యంతో ఇలా అన్నారు: “ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే; ఈయన యెవరో?” (లూకా 8:​22-25) నేడు యేసు సామాన్య మానవుడు కాడు కానీ ఆయన ఒక శక్తిమంతమైన ఆత్మ ప్రాణి. కాబట్టి ప్రకృతి శక్తులు తన ప్రజలకు ఎలాంటి హానిని వాటిల్లజేయకుండా వాటిని నియంత్రించడం ఆయనకు కష్టం కాదు!​—⁠కీర్తన 2:6-9; ప్రకటన 11:​15.

కొంతమంది దీన్నంతటినీ అవాస్తవికమైన విషయంగా దృష్టించవచ్చు. కానీ మానవ వాగ్దానాలు, అంచనాల్లా కాక, బైబిలు ప్రవచనాలన్నీ నెరవేరాయనీ, ఆ ప్రవచనాల్లో 1914 నుండి మనం నెరవేరడం చూసిన ప్రవచనాలు కూడా ఉన్నాయనీ గుర్తుంచుకోండి. (యెషయా 46:10; 55:​10, 11) అవును, భూమికి సమాధానకరమైన భవిష్యత్తు ఉంటుందని హామీ ఇవ్వబడింది. మనం దేవుని వాక్యాన్ని హృదయంలోకి తీసుకొని త్వరలో సంభవించనున్న అతి ప్రాముఖ్యమైన ఘటనల గురించి దానిలో ఉన్న ప్రేమపూర్వక హెచ్చరికను లక్ష్యపెడితే మన భవిష్యత్తు కూడా సమాధానకరంగా ఉంటుందనే హామీ ఇవ్వబడుతుంది.​—⁠మత్తయి 24:42, 44; యోహాను 17:⁠3. (g05 7/22)

[11వ పేజీలోని బాక్సు/చిత్రం]

మరణించిన మన ప్రియమైనవారికి ఎలాంటి నిరీక్షణ ఉంది?

ప్రియమైన వారినెవరినైనా పోగొట్టుకున్నప్పుడు, మనం దుఃఖంలో మునిగిపోవచ్చు. యేసు తన ప్రియ స్నేహితుడైన లాజరు మరణించినప్పుడు కన్నీళ్లు విడిచాడని బైబిలు మనకు చెబుతోంది. అయినా కొద్ది నిమిషాల తర్వాత, యేసు లాజరును తిరిగి బ్రతికించడం ద్వారా ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమే చేశాడు! (యోహాను 11:​32-44) అలా చేయడం ద్వారా, తన పరిచర్యలో కొంతకాలం క్రితం తాను చేసిన ఆశ్చర్యకరమైన వాగ్దానం మీద యావత్‌ మానవజాతి విశ్వాసముంచడానికి బలమైన ఆధారాన్నిచ్చాడు, అప్పుడు ఆయన ఇలా చెప్పాడు: “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు [యేసు] శబ్దము విని . . . బయటికి వచ్చెదరు.” (యోహాను 5:​28, 29) పరదైసు భూమ్మీదకు పునరుత్థానం అనే అమూల్యమైన నిరీక్షణ తమ ప్రియమైనవారిని కోల్పోయినవారందరినీ ఓదార్చును గాక.​—⁠అపొస్తలుల కార్యములు 24:​14.

[10వ పేజీలోని చిత్రాలు]

ప్రస్తుత లోకం దాని అంత్యదినాల్లో ఉందనే హెచ్చరికను మీరు లక్ష్యపెడుతున్నారా?

[10వ పేజీలోని చిత్రసౌజన్యం]

USGS, David A. Johnston, Cascades Volcano Observatory