చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన తేదీ
చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన తేదీ
అది యేసుక్రీస్తు మరణించిన తేదీ. యేసు మరణం ఎందుకంత ప్రాముఖ్యమైనది? దానికి చాలా కారణాలున్నాయి.
యేసు మరణపర్యంతం చూపిన విశ్వాసం, మానవుడు దేవునిపట్ల తన యథార్థతను కాపాడుకోగలడని నిరూపించింది.
క్రీస్తు మరణం మానవజాతిలోని కొందరికి ఆయనతోపాటు పరలోకంలో సహపరిపాలకులుగా మారేందుకు కూడా అవకాశాన్నిచ్చింది. అంతేగాక, అనేకులు పరదైసు భూమిపై నిత్యజీవాన్ని అనుభవించేందుకు మార్గాన్ని సుగమం చేసింది.
యేసు తాను మరణించడానికి ముందురోజు సాయంకాలం, ఆయన ప్రేమపూర్వకంగా అర్పించిన మానవ జీవితానికి చిహ్నాలుగా పులియని రొట్టెను, ద్రాక్షారసాన్ని ఉపయోగించాడు. “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి” అని ఆయన తన శిష్యులకు చెప్పాడు. (లూకా 22:19) మీరు ఈ ప్రాముఖ్యమైన సంఘటనను గుర్తుచేసుకుంటారా?
యేసు మరణ జ్ఞాపకార్థాన్ని ఆచరించడంలో మీరు కూడా వారితో కలవాలని యెహోవాసాక్షులు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అది ఈ సంవత్సరం బుధవారం, ఏప్రిల్ 12వ తేదీన సూర్యాస్తమయం తరువాత ఆచరించబడుతుంది. మీరు మీ ఇంటికి దగ్గర్లో ఉన్న రాజ్యమందిరంలో హాజరుకావచ్చు. ఖచ్చితమైన సమయం, స్థలం తెలుసుకోవడానికి దయచేసి స్థానిక యెహోవాసాక్షులను సంప్రదించండి. (g 3/06)