భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంటుందా?
భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంటుందా?
భవిష్యత్తు అనేది ప్రజలకు అత్యంత ఆసక్తికరమైన అంశం. వచ్చే నెలలో, వచ్చే సంవత్సరంలో లేదా మరో పదేళ్ళలో మనమేమి చేస్తుంటామో తెలుసుకోవాలని మనలో ఎవరం మాత్రం కోరుకోము? మరింత విస్తృత పరిధిలో ఆలోచిస్తే, మరో 10, 20 లేక 30 సంవత్సరాల్లో ఈ ప్రపంచం ఎలా ఉంటుంది?
మీకు భవిష్యత్తుపై ఆశావహ దృక్పథం ఉందా? కోట్లాదిమందికి అలాంటి దృక్పథం ఉంది, వీరిని రెండు గుంపులుగా విభజించవచ్చు: పరిస్థితులు మెరుగుపడతాయని నమ్మడానికి తమకు గట్టి కారణాలు ఉన్నాయని చెప్పేవారు ఒక గుంపైతే, ఇతర ప్రత్యామ్నాయాలు పరిగణనకే పనికిరానంత దుర్భరంగా ఉన్నాయి కాబట్టి ఆశావహ దృక్పథం కాపాడుకోవడం తప్ప మరో దారిలేని గుంపు మరొకటి.
కానీ కొంతమందికైతే పరిస్థితులు మెరుగవుతాయనే నమ్మకమే లేదు. అలాంటి వారిలో నాశనమొస్తుందని ముందుగానే ప్రకటించేవారున్నారు, వారికి ఈ భూగ్రహం సర్వనాశనమవుతుందని ప్రకటించడమే సంతోషం కలిగిస్తుంది. ఆ నాశనాన్ని ఎవరూ తప్పించుకోరు, ఒకవేళ తప్పించుకున్నా వారు చాలా కొద్దిమందే అయ్యుంటారన్నది వారి ఉద్దేశం.
భవిష్యత్తు ఎలావుంటుందని మీరు అనుకుంటున్నారు? అంతా సర్వనాశనమవుతుందనే అనుకుంటున్నారా లేక శాంతిభద్రతలు నెలకొంటాయని అనుకుంటున్నారా? శాంతిభద్రతలు నెలకొంటాయని మీరు నిరీక్షిస్తున్నట్లయితే, మీ నిరీక్షణకు ఆధారమేమిటి—ఆశావహ దృక్పథమా లేక విశ్వసనీయ సాక్ష్యాధారమా?
నాశనాన్ని ప్రకటించేవారిలా, తేజరిల్లు! ప్రచురణకర్తలు మానవజాతి అంతరిస్తుందని నమ్మడంలేదు. దానికి భిన్నంగా, మంచి రోజులు రానున్నాయని నమ్మడానికి బైబిలు గట్టి కారణాన్నిస్తోంది. (g 1/06)
[5వ పేజీలోని చిత్రసౌజన్యం]
U.S. Department of Energy photograph