కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

మెక్సికోలోని సింధుశాఖలో, 2004 సెప్టెంబరులో సంభవించిన ఇవాన్‌ తుఫాను, 15 మీటర్లకన్నా ఎత్తైన, దాదాపు 24 అలల్ని సృష్టించింది. అతి పెద్దదైన అల 27.7 మీటర్ల ఎత్తుకు ఎగసిపడినట్లు కొలిచారు.​​—⁠సైన్స్‌ పత్రిక, అమెరికా.

వాహనం నడుపుతున్నప్పుడు సెల్‌ఫోన్ల ఉపయోగం ఆస్పత్రికి వెళ్లాల్సినంత తీవ్ర దుర్ఘటనలు సంభవించే అవకాశాల్ని నాలుగురెట్లు పెంచుతుంది. నడిపేవారు హ్యాండ్‌ ఫ్రీ పరికరాన్ని ఉపయోగించినా, ఉపయోగించకపోయినా అలా జరిగే అవకాశాలు అంతే ఎక్కువగా ఉంటాయి.​​—⁠బిఎమ్‌జె, బ్రిటన్‌. (g 4/06)

రాబోయే దశాబ్దంలో ఆసియాలోని 127 కోట్లమంది పిల్లల్లో దాదాపు సగం మందికి, సురక్షిత నీరు, ఆహారం, ఆరోగ్య సంరక్షణ, విద్య, వసతిలాంటి కనీస అవసరాలు కూడా కరువవుతాయి.​​—⁠ప్లాన్‌ ఏసియా రీజనల్‌ ఆఫీస్‌, థాయ్‌లాండ్‌. (g 5/06)

ఉద్యోగస్థలంలో అతిగా చికాకు కలిగించే అలవాట్లు

“మన తోటి ఉద్యోగుల్లో అత్యంత చికాకు కలిగించే అలవాట్ల గురించి వేసిన పట్టికలో ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడడం, స్పీకర్‌ ఫోన్ల [ఉపయోగం], పని ఎక్కువయ్యిందని తరచూ ఫిర్యాదులు చేయడమనేవి ప్రప్రథమంగా కనిపిస్తాయి” అని వాషింగ్‌టన్‌ పోస్ట్‌ నివేదించింది. తోటి ఉద్యోగస్థుల్లో కోపాన్ని తెప్పించే ఇతర అలవాట్లలో కొన్ని “తోటి ఉద్యోగస్థులు జట్లుగా ఏర్పడడం, పనికి ఆలస్యంగా రావడం, తమలోతామే మాట్లాడుకోవడం, తమ వర్క్‌ స్టేషన్‌ల నుండి ప్రక్క వర్క్‌ స్టేషన్‌లో ఉన్నవారితో మాట్లాడడం, శారీరక అపరిశుభ్రత, తింటున్నప్పుడు పెద్దగా చప్పుడు చేయడం” వంటివి ఉన్నాయి. అటువంటి దురలవాట్లవల్ల వారి ఉత్పత్తి కుంటుపడుతుంది. పరిశోధకుల ప్రశ్నలకు సమాధానాలిచ్చిన వారిలో చాలామంది తమను చికాకు పెట్టినవారితో సూటిగా ఎప్పుడూ మాట్లాడలేదని ఒప్పుకున్నారు. దాని విషయంలో ఆ వార్తాపత్రిక ఇలా అంటోంది: “వారు తమ ఉద్యోగస్థులతో సూటిగా మాట్లాడకపోవడానికి సరైన కారణం ఉంది, అలా ఫిర్యాదు చేసేవారికి కూడా ఏదో ఒక దురలవాటు ఉండి ఉండవచ్చు.”

అధికశాతం ప్రజలు నగరాల్లో జీవిస్తున్నారు

“రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రపంచ జనాభాలో సగంమంది నగరాల్లో జీవిస్తారు” అని సిబిసి న్యూస్‌ వ్యాఖ్యానించింది. యునైటెడ్‌ నేషన్స్‌ నివేదిక ప్రకారం, అమెరికాలో అత్యధికశాతం నగరవాసులున్నారు. అక్కడ ప్రతీ పదిమందిలో 9 మంది నగరాల్లో జీవిస్తున్నారు. కేవలం 55 సంవత్సరాల క్రితం, న్యూయార్క్‌, టోక్యో నగరాల్లో మాత్రమే ఒక కోటి లేదా అంతకన్నా ఎక్కువ జనాభా ఉండేది. నేడు, కోటికన్నా ఎక్కువ జనాభా ఉన్న నగరాల సంఖ్య 20కు పెరిగింది, వాటిలో జకార్తా, మెక్సికో సిటీ, ముంబయి, సావోపాలో కొన్ని. ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్‌, కోఫీ అన్నన్‌ ఇలా అన్నారు: “ఇలా వేగంగా జనాభా పెరుగుతున్న కారణంగా చాలా దేశాల్లో ప్రభావవంతమైన ఆర్థిక, సామాజిక మార్పులు తీసుకురావల్సిన అవసరం ఉంది.” (g 6/06)

మతగురువులపై దౌర్జన్యం అధికమౌతోందా?

“మతగురువుగా ఉండడం [బ్రిటన్‌]లోని అత్యంత ప్రమాదకరమైన వృత్తుల్లో ఒకటి” అని లండన్‌లోని డైలీ టెలిగ్రాఫ్‌ వార్తాపత్రిక 2005లో నివేదించింది. ఇంటర్వ్యూ చేయబడిన మతగురువుల్లో దాదాపు 75 శాతం మంది గడిచిన రెండు సంవత్సరాల్లో దాడికి, లేదా దూషణకు గురయ్యారని 2001లో ప్రభుత్వం నిర్వహించిన సర్వే వెల్లడిచేసింది. 1996వ సంవత్సరంనుండి కనీసం ఏడుగురు మతగురువులు హతమార్చబడ్డారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో “చర్చీకి వెళ్లే సభ్యులపై దౌర్జన్యం చేయడం, భయాందోళనకు గురిచేయడం అధికమౌతుంది” అని ఆ వార్తాపత్రిక అన్నది. మేర్సీసైడ్‌ అనే నగరంలో, “అక్కడున్న 1,400 ఆరాధనా స్థలాల్లో రోజుకు సగటున ఒకటైనా దాడికి, దోపిడీకి గురవడమో లేదా తగలబెట్టడమో జరుగుతోంది.” (g 1/06)

రెండురకాల ఇంధనాలు వాడే కార్లు

బ్రెజిల్‌లోని షోరూమ్‌లనుండి కొనుగోలు చేయబడే కార్లలో మూడింట ఒకటో వంతు కార్లు రెండురకాల ఇంధనాలు వాడే కార్లు అని వెజా పత్రిక నివేదించింది. ఈ వాహనాలు పెట్రోలు, లేదా చెరుకుగడలనుండి తీయబడిన సారా, లేదా ఏదో ఒక మోతాదులో రెండింటినీ కలిపిన మిశ్రమంతో నడుస్తున్నాయి. సారాకు సంబంధించిన ఇంధన అమ్మకాలు 2003-2004 సంవత్సరాల మధ్య 34 శాతం పెరిగిపోయాయి. దానివల్ల వాతావరణానికి ప్రయోజనాలు చేకూరుతాయి, అయితే దాన్ని వాడే ప్రజలకు దానితో పట్టింపు లేదు. సారాను ఇంధనంగా ఉపయోగించి వాహనాలు నడపడంవల్ల ఖర్చు తక్కువవుతుందనే ఉద్దేశంతోనే వారు దాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ రెండురకాల ఇంధనాలు వాడే కార్లు, “ఇంధనాల విషయంలో ఎదురయ్యే సమస్యల నుండి, వాటి ధరల్లో హెచ్చుతగ్గులవల్ల వచ్చే ఇబ్బందుల నుండి వినియోగదారుల్ని” రక్షించేందుకు సహాయం చేస్తాయి అని బ్రెజీలియన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి డైరెక్టర్‌గా పని చేస్తున్న రాఫెల్‌ షైడమాన్‌ వివరించాడు. “సారా ధర పెరిగితే, మీరు పెట్రోలు ఉపయోగించవచ్చు, పెట్రోలు ధర పెరిగితే సారాను ఉపయోగించవచ్చు” అని ఆయన వ్యాఖ్యానించారు. (g 6/06)