కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లక్షలాదిమంది వెళ్తారు మరి మీరూ వెళ్తారా?

లక్షలాదిమంది వెళ్తారు మరి మీరూ వెళ్తారా?

లక్షలాదిమంది వెళ్తారు మరి మీరూ వెళ్తారా?

◼ ఎక్కడికి? విడుదల సమీపించింది! అనే యెహోవాసాక్షుల జిల్లా సమావేశానికి! మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాలు, మే నెల చివరి వారాంతంలో అమెరికాలో ప్రారంభమై, రాబోయే నెలల్లో వందల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో నిర్వహించబడతాయి. ఇటీవలి సంవత్సరంలో నిర్వహించబడిన 2,891 జిల్లా సమావేశాలకు దాదాపు కోటీ పదిలక్షలమంది హాజరయ్యారు!

అనేక ప్రాంతాల్లో కార్యక్రమం ఉదయం 9:⁠00 గంటలకు సంగీతంతో ప్రారంభమవుతుంది. శుక్రవారం, “విడుదలకు సంబంధించిన యెహోవా వాగ్దానాలను శ్రద్ధగా వినండి,” “సహాయం కోసం మొరపెడుతున్న బీదలను యెహోవా ఎలా విడిపిస్తాడు?” వంటి అంశాలపై ప్రసంగాలుంటాయి. “‘మన నిత్యమైన విమోచన’ కోసం యెహోవా చేసిన ఏర్పాట్లు” అనే ముఖ్యాంశ ప్రసంగంతో ఉదయకాల కార్యక్రమం ముగుస్తుంది.

శుక్రవారం మధ్యాహ్న కార్యక్రమంలో “యెహోవా వృద్ధులపట్ల వాత్సల్యపూరిత శ్రద్ధ కనబరుస్తాడు,” “బాధాకరమైన వేదననుండి విడుదల,” “‘పరిచారము’ చేయడంలో దేవదూతల పాత్ర” అనే ప్రసంగాలుంటాయి. “‘రక్షణకర్తగా’ యెహోవా” అనే నాలుగు భాగాల గోష్ఠి తర్వాత ఇవ్వబడే చివరి ప్రసంగం “విరోధించే ఏ ఆయుధం లేదా దోషారోపణ వర్ధిల్లదు.”

శనివారం ఉదయకాల కార్యక్రమంలో, “‘మానక’ పరిచర్యలో కొనసాగండి” అనే మూడు భాగాల గోష్ఠి, ఆ తర్వాత “వేటగాని ఉరిలోనుండి విడిపించబడ్డాం,” “‘దేవుని మర్మములను’ పరిశోధించడం” వంటి ప్రసంగాలుంటాయి. బాప్తిస్మం గురించిన ప్రసంగంతో ఉదయకాల కార్యక్రమం ముగుస్తుంది, ఆ తర్వాత అర్హులైన వారికి నీటి బాప్తిస్మం ఇవ్వబడుతుంది.

శనివారం మధ్యాహ్నం ఇవ్వబడే ప్రసంగాల్లో, “ఆరోగ్య సంరక్షణ విషయంలో లేఖనాధారిత దృక్కోణాన్ని కాపాడుకోండి,” “మీ జీవితాన్ని ఏది ప్రభావితం చేస్తోంది​—⁠లౌకికాత్మా లేక పరిశుద్ధాత్మా?,” “వివాహంలో ‘మూడు పేటల త్రాడును’ కాపాడుకోండి,” “యౌవనులారా, ఇప్పుడే ‘మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి’” అనేవి ఉంటాయి. “యెహోవా దినం కోసం కనిపెడుతూ జీవిస్తున్నారా?” అనే ముగింపు ప్రసంగం మన కాలాలకు ఆచరణసాధ్యమైన సలహాలు ఇస్తుంది.

ఆదివారం ఉదయకాల కార్యక్రమంలో “పరలోక రాజ్యము . . . పోలియున్నది” అనే గోష్ఠిలోని నాలుగు ప్రసంగాలు, యేసు ఉపమానాల్లోని కొన్నింటిని సంక్షిప్తంగా చర్చిస్తాయి.

ఉదయకాల కార్యక్రమంలో సమావేశ ప్రధానాకర్షణను పరిచయంచేసే ప్రసంగం తర్వాత, బైబిలు పుస్తకమైన మొదటి రాజులు 13వ అధ్యాయంపై ఆధారపడిన నాటకం ఉంటుంది. సమావేశపు చివరి భాగమైన ఆదివారం మధ్యాహ్న కార్యక్రమంలో “దేవుని రాజ్యం ద్వారా విడుదల సమీపించింది!” అనే బహిరంగ ప్రసంగం ఉంటుంది.

హాజరవడానికి మీరిప్పుడే ప్రణాళికలు వేసుకోండి. మీకు దగ్గరలో ఉన్న సమావేశ స్థలాన్ని కనుక్కోవడానికి స్థానిక యెహోవాసాక్షుల రాజ్యమందిరాన్ని సంప్రదించండి లేదా ఈ పత్రిక ప్రచురణకర్తలకు వ్రాయండి. ఈ పత్రిక సహ పత్రికయైన కావలికోట మార్చి 1 సంచికలో ఇండియాలో జరిగే సమావేశ ప్రాంతాల పట్టిక ఉంది. (g 6/06)