కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

“అగాధ సముద్రం, భూగ్రహంపై ఉన్న అతిపెద్ద నివాసస్థలం. అది జీవించడానికి కష్టభరితమైన స్థలాల్లో ఒకటి . . . అయినా అందులో ఎక్కడచూసినా జలచరాల్ని, కొన్నిసార్లు చాలా విస్తారమైన సంఖ్యలో జీవరాశులను మనం చూస్తాం.”​—⁠న్యూ సైంటిస్ట్‌, బ్రిటన్‌.

ఇటీవలి ఒక కేసులో, అమెరికాలోని, పెన్సిల్వేనియాలో ఉన్న, హారిస్‌బర్గ్‌ ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి “ప్రభుత్వ పాఠశాలలో విజ్ఞానశాస్త్ర తరగతుల్లో పరిణామ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా [తెలివైన రూపకల్పన]ను బోధించడం చట్టవిరుద్ధమని” తీర్పుచెప్పాడు.​—⁠న్యూయార్క్‌ టైమ్స్‌, అమెరికా.

ఒక వార్తాపత్రిక 2005లో నిర్వహించిన వార్తా సేకరణ ఫలితాల ప్రకారం “అమెరికన్లలో 51 శాతం మంది పరిణామ సిద్ధాంతాన్ని నిరాకరించారు.”​—⁠న్యూయార్క్‌ టైమ్స్‌, అమెరికా.

గాలాపాగోస్‌ ద్వీపానికి చెందిన దాదాపు 150 కేజీల బరువుండే హారియెట్‌ అనే తాబేలు జూన్‌ 2006లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ జంతు ప్రదర్శనశాలలో మరణించింది. 175 సంవత్సరాల వయసున్న ఆ తాబేలు “ప్రపంచంలో బ్రతికివున్న ప్రాణుల్లోకెల్లా అత్యధిక వయసున్న జంతువు.”​—⁠ఆస్ట్రేలియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌.

స్విట్జర్లాండ్‌ పరిశోధకులు వెస్టర్న్‌ కార్న్‌ వేరుపురుగుల పీడను తట్టుకునే జొన్నరకాలను కనుగొన్నారు. అవి నేలలో ఒక విధమైన వాసనను వ్యాప్తిచేస్తాయి. ఈ వాసనలు వేరుపురుగుల లార్వాను నాశనంచేసే సూక్ష్మమైన నూలు పురుగులను ఆకర్షిస్తాయి.​—⁠డై వెల్ట్‌, జర్మనీ. (g 9/06)

రాకసి స్క్విడ్‌ను ఫోటో తీశారు

దక్షిణ జపాన్‌లోని బోనిన్‌ దీవుల దగ్గర, శాస్త్రజ్ఞులు మొదటిసారిగా సముద్ర గర్భంలో రాకసి స్క్విడ్‌ను ఫోటో తీశారు. చిన్న ఎర్రల్ని, రొయ్య మాంసాన్ని గాలానికి తగిలించి, దానిపై కెమెరాలు బిగించి, ఆ గాలాన్ని నీటిలోకి దింపారు. దాదాపు 3,000 అడుగుల లోతులో ఆ రాకసి స్క్విడ్‌ కనిపించింది, అది దాదాపు 25 మీటర్ల పొడవున్నట్లు అంచనా వేయబడింది.

“డైనోసార్లు గడ్డి మేశాయి”

“డైనోసార్లు గడ్డి మేశాయి” అనే విషయాన్ని కనిపెట్టడం “శాస్త్రజ్ఞులకే ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది” అని అసోసియేటెడ్‌ ప్రెస్‌ రిపోర్టు చెబుతోంది. ఇండియాలో లభించిన సారోపాడ్‌ డైనోసార్‌ పేడ అవశేషాన్ని విశ్లేషించినప్పుడు ఆ విషయం వెల్లడైంది. దాంట్లో ఆశ్చర్యమేముంది? “డైనోసార్లు అంతరించిపోయిన అనేక సంవత్సరాల తర్వాతే గడ్డి మొలిచింది” అని అనుకొనేవారని ఆ నివేదిక వివరిస్తోంది. సారోపాడ్‌లకు “గరుకైన గడ్డిపరకలను నమిలేందుకు అవసరమైన ప్రత్యేక దంతాలేమీ లేవు” అని కూడా నమ్మేవారు. ఆ విషయాన్ని కనిపెట్టిన బృందానికి సారథ్యం వహించిన వృక్ష అవశేషాల పరిశోధకురాలైన కారొలైన్‌ స్ట్రామ్‌బర్గ్‌, ఇలా చెబుతోంది: “[సారోపాడ్‌లు] గడ్డి మేసేవనే విషయాన్ని చాలామంది ఊహించివుండకపోవచ్చు.”

తేనెటీగలు ఎలా ఎగురుతాయి?

తేనెటీగలు ఎగరలేవని ఇంజనీర్లు నిరూపించారని హాస్యోక్తిగా చెప్పబడుతోంది. అంత “బరువుగా ఉండే” కీటకాలకు ఉండే చిన్న రెక్కలు అవి ఎగరడానికి సహాయం చేయలేవన్నట్లు అనిపించేది. కీటకాలు ఎగరడం వెనకున్న రహస్యాన్ని కనిపెట్టడానికి, ఇంజనీర్లు “ఎగురుతున్న తేనెటీగల చిత్రాలను సెకనుకు ఆరువేల చొప్పున తీశారు” అని న్యూ సైంటిస్ట్‌ పత్రిక చెబుతోంది. తేనెటీగల ఎగిరే నైపుణ్యం “అసాధారణమైనదిగా” వర్ణించబడింది. “ప్రొపెల్లర్‌లో రెక్కలు ఎలా తిరుగుతాయో . . . అలాగే తేనెటీగ రెక్కలు 90 డిగ్రీల కోణంలో తిరుగుతూ, సెకనుకు 230 సార్లు కొట్టుకుంటాయి” అని ఆ పరిశోధనా బృంద సభ్యుడు వివరిస్తున్నాడు. వారి పరిశోధనలు, మరింత మెరుగైన ప్రొపెల్లర్లను, మరింత తేలికగా నడిపించగల విమానాలను నిర్మించడానికి ఇంజనీర్లకు సహాయం చేయగలవు.

పాడే చిట్టెలుకలు

“చిట్టెలుకలు పాడగలవు . . . జతను ఆకర్షించడానికి అవి పాడే పాటలు పక్షులు పాడే పాటలంత సంక్లిష్టంగా ఉంటాయని” న్యూ సైంటిస్ట్‌ పత్రిక నివేదిస్తోంది. చిట్టెలుక పాటలు అల్ట్రాసోనిక్‌ శబ్దతరంగాలుగా ఉంటాయి కాబట్టి, అవి మానవులకు వినిపించవు, అందుకే అంతకముందు వాటిని ఎవరూ గమనించలేదు. అమెరికాలోని సెయింట్‌ లూయిస్‌లో ఉన్న, మిస్సోరిలోని, పరిశోధకులు మగ చిట్టెలుకలు చేసే శబ్దాలు “ఒక ‘పాటలోని’ పాదాలుగా, సంగీత ధ్వనులుగా, కూర్చబడినట్లు” కనుగొన్నారు. ఇది చిట్టెలుకను ప్రత్యేకమైన గుంపులో చేరుస్తోంది. పాడతాయని గుర్తింపు పొందిన ఇతర క్షీరదాల్లో మానవులే కాక, తిమింగలాలు, డాల్ఫిన్లు, కొన్నిరకాల గబ్బిలాలు కూడా ఉన్నాయి. (g 9/06)