కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఏమి నమ్ముతున్నారనేది అంత ప్రాముఖ్యమా?

మీరు ఏమి నమ్ముతున్నారనేది అంత ప్రాముఖ్యమా?

మీరు ఏమి నమ్ముతున్నారనేది అంత ప్రాముఖ్యమా?

జీ వితానికి ఒక సంకల్పం ఉందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ పరిణామ సిద్ధాంతమే నిజమైతే, సైంటిఫిక్‌ అమెరికన్‌ పత్రికలో ఉల్లేఖించబడిన ఈ వ్యాఖ్యను నమ్మవచ్చు: “పరిణామ సిద్ధాంతం గురించిన మన ఆధునిక గ్రహింపు సూచిస్తున్న ప్రకారం . . . మన జీవితానికి అసలు అర్థమే లేదు.”

ఆ మాటల భావమేమిటో గమనించండి. మన జీవితానికి అసలు అర్థమే లేకపోతే, మీరు జీవితంలో కొన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నించడం లేదా బహుశా మీ తర్వాతి తరానికి మీ జన్యులక్షణాలను ప్రాప్తింపజేయడం తప్ప మీ జీవితానికి వేరే సంకల్పమే ఉండదు. మరణించాక, మీరిక ఉనికిలోనే ఉండరు. ఆలోచించే, తర్కించే, జీవితంలోని సంకల్పాన్ని గురించి ధ్యానించే సామర్థ్యాలున్న మీ మెదడు ప్రకృతిలో యాదృచ్ఛికంగా వచ్చినట్లే అవుతుంది.

అంతేకాదు. పరిణామ సిద్ధాంతాన్ని నమ్మే అనేకులు దేవుడు ఉనికిలో లేడని లేదా ఆయన మానవ వ్యవహారాల్లో జోక్యం చేసుకోడని వాదిస్తారు. ఆ రెండు విషయాలనుబట్టి చూస్తే, మన భవిష్యత్తు రాజకీయవేత్తల, విద్యావేత్తల, మతనాయకుల చేతుల్లో ఉంటుంది. గత చరిత్రనుబట్టి చూస్తే, మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్న గందరగోళం, పోరాటాలు, భ్రష్టత్వం ఇలాగే కొనసాగుతాయి. పరిణామ సిద్ధాంతమే నిజమైతే, “రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము” అనే ప్రమాదకరమైన తత్వాన్ని అనుసరిస్తూ జీవించడమే మంచిదన్నట్లు అనిపిస్తుంది.​—1 కొరింథీయులు 15:32.

అయితే, మీరొక విషయాన్ని ఖచ్చితంగా నమ్మవచ్చు. యెహోవాసాక్షులు పైన పేర్కొనబడిన వ్యాఖ్యల్ని అంగీకరించరు. అంతేకాదు, పరిణామ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని చేయబడిన ఆ వ్యాఖ్యలతో వారు ఏకీభవించరు. బదులుగా, బైబిలు సత్యమని సాక్షులు నమ్ముతారు. (యోహాను 17:17) కాబట్టి, మనం ఇక్కడికి ఎలా వచ్చామనేదాని గురించి బైబిలు ఇలా చెప్పడాన్ని వారు నమ్ముతారు: “నీ [దేవుని] యొద్ద జీవపు ఊట కలదు.” (కీర్తన 36:9) ఆ మాటలకు చాలా ప్రాముఖ్యమైన అర్థం ఉంది.

జీవితానికి అర్థం ఉంది. సృష్టికర్త చిత్తానికి అనుగుణంగా జీవించే ప్రతీ ఒక్కరి విషయంలో ఆయనకు ఒక ప్రేమపూర్వక సంకల్పం ఉంది. (ప్రసంగి 12:13) గందరగోళం, తగాదాలు, భ్రష్టత్వం, చివరకు మరణం సహితం లేని లోకంలో జీవితం గురించిన వాగ్దానం ఆ సంకల్పంలో ఉంది. (యెషయా 2:4; 25:6-8) దేవుని గురించి నేర్చుకోవడం, ఆయన చిత్తాన్ని చేయడం తప్ప మరేదీ జీవితానికి అర్థాన్ని ఇవ్వలేదనే విషయానికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది యెహోవాసాక్షులు సాక్ష్యమివ్వగలరు!​—యోహాను 17:3.

మీరు ఏమి నమ్ముతారనేది చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే అది మీ ప్రస్తుత సంతోషాన్నేకాక, మీ భవిష్యత్తు జీవితాన్ని కూడా ప్రభావితం చేయగలదు. నిర్ణయం మీదే. ప్రకృతి చక్కగా రూపొందించబడిందని నిరూపించే అనేక ఆధారాలను ఎందుకు కొట్టిపారేయాలో వివరించలేని సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారా? లేక భూమి, దానిలోని జీవం “సమస్తమును సృష్టించిన” అద్భుతమైన రూపకర్తైన దేవుడగు యెహోవాచేత సృష్టించబడ్డాయని బైబిలు చెప్పేదాన్ని మీరు నమ్ముతారా?​—ప్రకటన 4:10, 11. (g 9/06)