సృష్టిని గురించిన నా నమ్మకాన్ని నేనెలా సమర్థించగలను?
యువత ఇలా అడుగుతోంది . . .
సృష్టిని గురించిన నా నమ్మకాన్ని నేనెలా సమర్థించగలను?
“తరగతిలో పరిణామ సిద్ధాంతం చర్చించబడుతునప్పుడు, అది నేను నేర్చుకున్న విషయాలకు పూర్తి భిన్నంగా ఉన్నట్లు అనిపించింది. అది ఒక వాస్తవమని బోధించేవారు కాబట్టి, నాకు చాలా భయమేసేది.” —రైయన్, 18.
“నాకు 12 ఏళ్ళు ఉన్నప్పుడు, పరిణామ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మే ఒక టీచర్ మాకుండేది. ఆమె తన కారుపై డార్విన్ గుర్తున్న స్టిక్కరును కూడా అతికించుకుంది! అందుకే, సృష్టి విషయంలో నాకున్న నమ్మకం గురించి ధైర్యంగా మాట్లాడడానికి నేను సంకోచించేవాణ్ణి.”—టైలర్, 19.
“మేము చదవబోయే తర్వాతి పాఠం పరిణామ సిద్ధాంతాన్ని గురించినదని మా సోషల్ టీచర్ చెప్పినప్పుడు నేనెంతో హడలిపోయాను. ఈ వివాదాంశం విషయంలో నా వైఖరిని తరగతిలో వివరించాల్సి వస్తుందని నాకు తెలుసు.”—రాకేల్, 14.
త రగతిలో పరిణామ సిద్ధాంతం చర్చకు వచ్చినప్పుడు రైయన్, టైలర్, రాకేల్‌లాగే మీరు కూడా ఇబ్బందిపడి ఉండవచ్చు. దేవుడే ‘సమస్తమును సృష్టించాడని’ మీరు నమ్ముతున్నారు. (ప్రకటన 4:10) మీ చుట్టూ ఉన్న ప్రకృతి జ్ఞానవంతంగా రూపొందించబడిందని నిరూపించే ఆధారాలను మీరు చూస్తారు. కానీ, మీ పాఠ్య పుస్తకాలు మనం పరిణామ క్రమం ద్వారా ఉనికిలోకి వచ్చామని చెబుతున్నాయి, మీ టీచరు కూడా అలాగే అంటోంది. “నిపుణలతో” వాదించడానికి మీకున్న అర్హతలేమిటి? మీరు దేవుని . . . గురించి మాట్లాడడం ప్రారంభిస్తే మీ తోటి విద్యార్థులు ఎలా స్పందిస్తారు?
అలాంటి ప్రశ్నలు మిమ్మల్ని ఇబ్బందిపెడుతుంటే, మీరు నిశ్చింతగా ఉండండి! సృష్టి గురించిన బోధను నమ్మేవారు మీరు ఒక్కరే కాదు. నిజానికి, అనేకమంది శాస్త్రజ్ఞులు కూడా పరిణామ సిద్ధాంతాన్ని అంగీకరించడం లేదు. అనేకమంది టీచర్లు కూడా దానితో ఏకీభవించడం లేదు. అమెరికాలో, పాఠ్య పుస్తకాలు ఏమి బోధిస్తున్నా, దాదాపు ఐదుగురు విద్యార్థుల్లో నలుగురు సృష్టికర్త ఉన్నాడని నమ్ముతున్నారు!
అయినా, మీరిలా అడగవచ్చు, ‘ఒకవేళ సృష్టి గురించిన నా నమ్మకాన్ని నేను సమర్థించాలంటే నేను ఏమి మాట్లాడాలి?’ మీరు బిడియస్థులైనా, మీ నమ్మకం గురించి మీరు ధైర్యంగా మాట్లాడవచ్చు. అయితే, దానికి కొంత సిద్ధపడాల్సి ఉంటుంది.
మీ నమ్మకాల్ని పరీక్షించుకోండి!
మిమ్మల్ని క్రైస్తవ తల్లిదండ్రులు పెంచుతున్నట్లయితే, వారు మీకు సృష్టి గురించి నేర్పించారు కాబట్టే మీరు దాన్ని నమ్ముతుండవచ్చు. ఇప్పుడు మీరు పెద్దవారవుతున్నారు రోమీయులు 12:1, NW) ‘సమస్తమును పరీక్షించమని’ పౌలు మొదటి శతాబ్ద క్రైస్తవులను ప్రోత్సహించాడు. (1 థెస్సలొనీకయులు 5:21) సృష్టి విషయంలో మీ నమ్మకాన్ని మీరు ఎలా పరీక్షించుకోవచ్చు?
కాబట్టి, మీ ‘ఆలోచనా శక్తిని’ ఉపయోగించి దేవుణ్ణి సేవించాలని, మీ నమ్మకాలకు బలమైన పునాది ఉండాలని మీరు కోరుకుంటారు. (ముందుగా, దేవుని గురించి పౌలు వ్రాసినదాన్ని గమనించండి: “ఆయన అదృశ్యలక్షణములు . . . జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి.” (రోమీయులు 1:20) ఆ మాటల్ని గుర్తుంచుకొని, మానవ శరీరం, భూమి, విశాలమైన విశ్వం, అగాధమైన మహాసముద్రాలను జాగ్రత్తగా పరిశీలించండి. కీటకాలు, మొక్కలు, జంతువుల అద్భుతమైన లోకాన్ని గురించి, లేదా మీకు ఆసక్తికరంగా అనిపించే ఏ అంశం గురించైనా ఆలోచించండి. ఆ తర్వాత మీ ‘ఆలోచనా శక్తిని’ ఉపయోగించి మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ‘సృష్టికర్త ఉన్నాడని నేనెందుకు నమ్ముతున్నాను?’
ఆ ప్రశ్నకు జవాబివ్వడానికి, 14 ఏళ్ళ సామ్ మానవ శరీరాన్ని ఉదాహరణగా తీసుకున్నాడు. “మానవ శరీరంలో సంక్లిష్టమైన రూపకల్పన ఉన్న అవయవాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ ఎంతో చక్కగా కలిసి పని చేస్తాయి. మానవ శరీరం ఖచ్చితంగా పరిణామ క్రమం ద్వారా ఉనికిలోకి వచ్చి ఉండదు!” అని సామ్ అంటున్నాడు. 16 ఏళ్ళ హాలీ కూడా ఆయనతో ఏకీభవిస్తోంది. ఆమె ఇలా అంటోంది, “నాకు మధుమేహ వ్యాధి ఉండడంవల్ల, శరీరం పని చేసే విధానం గురించి నేను ఎంతో తెలుసుకున్నాను. ఉదాహరణకు, క్లోమాన్నే తీసుకోండి, కడుపు వెనుక భాగంలో ఉండే ఆ చిన్న అవయవం రక్తాన్ని నియంత్రించడంలో, ఇతర అవయవాలు సరిగా పనిచేసేందుకు తోడ్పడంలో గొప్ప పాత్ర పోషిస్తుంది.”
ఇతర యౌవనులు ఆ విషయాన్ని మరో కోణం నుండి చూస్తారు. 19 ఏళ్ళ జారెడ్ ఇలా అంటున్నాడు: “మనకు ఆరాధించగలిగే సామర్థ్యం, సౌందర్యాన్ని చూసి ఆనందించే సామర్థ్యం, నేర్చుకోవాలనే అభిలాష ఉన్నాయన్న వాస్తవంలోనే నాకు గొప్ప ఆధారం కనిపిస్తుంది. పరిణామ సిద్ధాంతం బోధిస్తున్నట్లుగా మనం కేవలం జీవించడానికి అలాంటి గుణాలు అవసరం లేదు. నాకు సబబుగా అనిపించే ఒకే ఒక వివరణ ఏమిటంటే, మనం జీవితాన్ని ఆనందించాలని కోరుకునే వ్యక్తే మనల్ని ఇక్కడ పెట్టాడు.” పైన పేర్కొనబడిన టైలర్ అలాంటి నిర్ధారణకే వచ్చాడు. ఆయనిలా అంటున్నాడు, “జీవాన్ని పరిరక్షించడంలో చెట్ల పాత్రను, చెట్ల రూపకల్పనలో ఉన్న అసాధారణ సంక్లిష్టతను గమనించినప్పుడు, నాకు సృష్టికర్త ఉన్నాడనే నమ్మకం కలుగుతుంది.”
మీరు సృష్టికి సంబంధించిన విషయాన్ని శ్రద్ధగా పరిశీలించి, మీరు నేర్చుకున్నదాన్ని నమ్మినప్పుడు దాని గురించి మాట్లడడం మీకు సుళువౌతుంది. కాబట్టి, సామ్, హాలీ, జారెడ్, టైలర్‌లలాగే దేవుని సృష్టిలోని అద్భుతాలను పరిశీలించడానికి కాస్త సమయం తీసుకోండి. అవి మీకు “చెప్పే” విషయాలను “వినండి.” అలా చేసినప్పుడు మీరు కూడా పౌలు వచ్చిన నిర్ధారణకే అంటే దేవుని ఉనికితోపాటు ఆయన లక్షణాలు కూడా “సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి” అనే నిర్ధారణకే చేరుకుంటారు. *
బైబిలు నిజంగా ఏమి బోధిస్తుందో తెలుసుకోండి
దేవుని సృష్టిని జాగ్రత్తగా పరిశీలించడంతోపాటు, సృష్టి విషయంలో మీ నమ్మకాన్ని సమర్థించడానికి, సృష్టి గురించి బైబిలు నిజంగా ఏమి బోధిస్తుందో కూడా మీరు తెలుసుకోవాలి. బైబిలు నేరుగా వివరించని విషయాల గురించి మీరు వాదించాల్సిన అవసరం లేదు. కొన్ని ఉదాహరణలను పరిశీలించండి.
◼ భూమి, సౌరవ్యవస్థ వందలకోట్ల సంవత్సరాలుగా ఉనికిలో ఉన్నాయని మా సైన్స్ పాఠ్య పుస్తకం చెబుతోంది. భూమి లేదా సౌరవ్యవస్థ ఎంతకాలం నుండి ఉనికిలో ఉన్నాయో బైబిలు చెప్పడం లేదు. మన గ్రహంతోపాటు ఈ విశ్వం మొదటి సృష్టి “దినము” ప్రారంభం కాకముందే, ఎన్నో వందలకోట్ల సంవత్సరాలుగా ఉనికిలో ఉన్నాయనే అభిప్రాయంతో బైబిలు చెప్పేది పొందికగా ఉంది.—◼ భూమి కేవలం ఆరు దినాల్లో సృష్టించబడడం సాధ్యం కాదని మా టీచర్ అంటోంది. ఆరు సృష్టి “దినములు” అక్షరార్థంగా 24 గంటలున్న రోజులని బైబిలు చెప్పడం లేదు. మరింత సమాచారం కోసం ఈ పత్రికలోని 18-20 పేజీలను చూడండి.
◼ కాలగమనంలో జంతువుల్లో, మానవుల్లో ఎలా మార్పులు సంభవించాయో చూపించే ఉదాహరణలను మా తరగతిలో చర్చించాం. దేవుడు ప్రాణులన్నింటినీ “వాటి వాటి జాతుల ప్రకారము” సృష్టించాడని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 1:20, 21) జీవం నిర్జీవ పదార్థాలనుండి వచ్చిందనే సిద్ధాంతాన్ని లేక దేవుడు ఏకకణ జీవి నుండి పరిణామ క్రమాన్ని ప్రవేశపెట్టాడనే సిద్ధాంతాన్ని అది సమర్థించట్లేదు. అయినా, ప్రతీ “జాతి”లో ఎన్నో రకాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి, ప్రతీ “జాతి”లో మార్పులు జరిగే అవకాశమే లేదని బైబిలు చెప్పట్లేదు.
మీ నమ్మకాలు సరైనవనే విశ్వాసంతో ఉండండి!
సృష్టి విషయంలో మీ నమ్మకాన్ని బట్టి మీరు ఇబ్బందిపడాల్సిన లేదా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆధారాలు చూపిస్తున్నట్లుగా, మనం జ్ఞానవంతుడైన వ్యక్తి చేత రూపొందించబడ్డామని నమ్మడం తర్కబద్ధమైనదేకాక, విజ్ఞానశాస్త్ర ప్రకారంగా సరైనది కూడా. నిజానికి, సృష్టి జరిగిందని నమ్మడంకన్నా అద్భుతాలు చేసేవాడు లేకుండా అద్భుతాలను జరిగాయని సహేతుకమైన ఆధారాలు లేకుండా బోధించే పరిణామ సిద్ధాంతాన్ని నమ్మేందుకే నిజానికి ఎంతో విశ్వాసం అవసరం. ఈ తేజరిల్లు! పత్రికలోని వేరే ఆర్టికల్స్‌ని మీరు పరిశీలించినప్పుడు, సృష్టి జరిగిందన్న విషయాన్నే ఆధారాలు సమర్థిస్తున్నాయని మీకు తప్పకుండా నమ్మకం ఏర్పడుతుంది. మీ ఆలోచనా శక్తిని ఉపయోగించి ఈ విషయం గురించి శ్రద్ధగా ఆలోచించిన తర్వాత తరగతిలో మీ నమ్మకాన్ని సమర్థించడానికి మీరు మరింత ధైర్యంగా ఉంటారు.
పైన పేర్కొనబడిన రాకేల్ ఆ విషయాన్నే గ్రహించింది. ఆమె ఇలా అంటోంది: “నా నమ్మకాల గురించి మౌనంగా ఉండకూడదని గ్రహించేందుకు నాకు కొన్ని రోజులు పట్టింది. జీవం—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం) పుస్తకంలో, నేను మా టీచర్ దృష్టికి తీసుకురావాలనుకున్న భాగాలను టిక్కుపెట్టి ఆమెకు ఇచ్చాను. తనకు నేనిచ్చిన పుస్తకం పరిణామ సిద్ధాంతం విషయంలో తనకున్న అభిప్రాయాన్ని మార్చిందనీ, భవిష్యత్తులో తాను ఆ విషయాన్ని బోధిస్తున్నప్పుడు ఈ పుస్తకంలోని సమాచారాన్ని గుర్తుంచుకుంటాననీ ఆమె ఆ తర్వాత నాతో చెప్పింది!” (g 9/06)
“యువత ఇలా అడుగుతోంది . . . ” శీర్షికల పరంపరంలోని మరిన్ని ఆర్టికల్స్‌ను www.watchtower.org/ype వెబ్‌సైట్‌లో చూడవచ్చు
ఆలోచించాల్సిన విషయాలు
◼ సృష్టి విషయంలో మీకున్న నమ్మకం గురించి మీరు పాఠశాలలో సుళువుగా ఎలా మాట్లాడవచ్చు?
◼ సమస్తాన్ని సృష్టించిన దేవునిపట్ల మీరు మీ కృతజ్ఞతను ఎలా చూపించగలరు?—అపొస్తలుల కార్యములు 17:26.
[అధస్సూచి]
^ అనేకమంది యౌవనులు, జీవం—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం), మీపట్ల శ్రద్ధ చూపించే సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) వంటి ప్రచురణల్లోని సమాచారాన్ని సమీక్షించడం ద్వారా ప్రయోజనం పొందారు. ఈ రెండు పుస్తకాలను యెహోవాసాక్షులు ప్రచురించారు.
[27వ పేజీలోని బాక్సు]
“ఆధారాలు మెండుగా ఉన్నాయి”
“సృష్టికర్త ఉన్నాడని చిన్నప్పటినుండి బోధించబడి, ఇప్పుడు పాఠశాలలో పరిణామ సిద్ధాంతం బోధించబడుతున్న యౌవనులకు మీరు ఏమి చెబుతారు?” యెహోవాసాక్షిగా ఉన్న ఒక సూక్ష్మజీవుల శాస్త్రజ్ఞురాలిని ఆ ప్రశ్న అడిగారు. ఆమె ఏమి చెప్పింది? “దేవుడు ఉన్నాడని మీరే స్వయంగా రుజువు చేసుకొనేందుకు దాన్ని ఒక అవకాశంగా పరిగణించాలి, మీ తల్లిదండ్రులు దాని గురించి నేర్పించారని కాదు, మీరు ఆధారాలను పరిశీలించి ఒక నిర్ధారణకు వచ్చి, దాన్ని నమ్మాలి. కొన్నిసార్లు, పరిణామ సిద్ధాంతాన్ని రుజువు చేయమని టీచర్లను అడిగినప్పుడు, వారు దాన్ని రుజువుచేయలేమని గ్రహిస్తారు, వారికి దాని గురించి బోధించబడింది కాబట్టే వారు ఆ సిద్ధాంతాన్ని అంగీకరించారు. సృష్టికర్తపై మీకున్న నమ్మకం విషయంలో మీరు కూడా అదే ఉరిలో చిక్కుకోవచ్చు. అందుకే దేవుడు ఉన్నాడని మీరే స్వయంగా రుజువుచేసుకోవడం చాలా మంచిది. దానికి ఆధారాలు మెండుగా ఉన్నాయి. వాటిని కనుక్కోవడం కష్టం కాదు.”
[28వ పేజీలోని బాక్సు/చిత్రం]
మీకు ఏ విషయాలు నమ్మకం కలిగిస్తున్నాయి?
సృష్టికర్త ఉన్నాడని మీకు నమ్మకం కలిగించిన మూడు విషయాల్ని క్రింద వ్రాయండి:
1. ․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․
2. ․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․
3. ․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․