కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“కలిసి భోజనం చేయడం మా సాన్నిహిత్యాన్ని పెంచుతోంది”

“కలిసి భోజనం చేయడం మా సాన్నిహిత్యాన్ని పెంచుతోంది”

“కలిసి భోజనం చేయడం మా సాన్నిహిత్యాన్ని పెంచుతోంది”

మీకుటుంబమంతా రోజుకు ఒకసారైనా కలిసి భోజనం చేస్తారా? విచారకరంగా, పరుగులు తీసే నేటి లోకంలోని అనేక కుటుంబాల్లో ఎప్పుడుపడితే అప్పుడు, ఎవరికివారే విడివిడిగా భోజనం చేయడం జరుగుతోంది. అయితే, కుటుంబమంతా కలిసి భోజనం చేయడం శారీరక అవసరాలను తీర్చడమేకాక, మరింత ప్రాముఖ్యమైన అవసరాలను తీర్చడానికి అంటే అందరూ హృదయపూర్వకంగా మాట్లాడుకోవడానికి, కుటుంబ బాంధవ్యాలు బలపడడానికి తోడ్పడుతుంది.

ఆల్గిర్డాస్‌ తన భార్య రీమా, ముగ్గురు కూతుళ్ళతో కలిసి ఉత్తర యూరప్‌లోని లిథువేనియా దేశంలో నివసిస్తున్నాడు. “నేను ఉద్యోగానికి, పిల్లలు స్కూలుకు వెళ్ళినా, సాయంత్రం మేమందరం కలిసి భోజనం చేసేలా పట్టిక వేసుకున్నాం. భోజనం చేస్తున్నప్పుడు మేమందరం ఆ రోజు జరిగినవాటి గురించి, మా సమస్యలను, అభిప్రాయాలను పంచుకుంటూ, మేము చేయాలనుకున్న పనుల గురించి, ఇష్టాయిష్టాల గురించి మనసువిప్పి మాట్లాడుకుంటాం. మేము ఆ సమయాన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుకోవడానికి కూడా ఉపయోగిస్తాం. నిస్సందేహంగా, కలిసి భోజనం చేయడం మా సాన్నిహిత్యాన్ని పెంచుతోంది” అని ఆల్గిర్డాస్‌ అంటున్నాడు.

రీమా మాట్లాడుతూ, “పిల్లలతో కలిసి వంట చేస్తున్నప్పుడు వారితో సన్నిహితంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. వంటగదిలో పిల్లలు ఆనందంగా కలిసి పని చేయడమేకాక, విలువైన నైపుణ్యాలను కూడా నేర్చుకుంటున్నారు. అలా మేము ఒకవైపు పని పూర్తి చేస్తూనే, మరోవైపునుండి ఆనందాన్ని కూడా పొందుతున్నాం” అని చెబుతోంది.

ఆల్గిర్డాస్‌, రీమా వారి పిల్లలు కలిసి భోజనం చేయడానికి సమయం తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను చవిచూస్తున్నారు. మీరు కలిసి భోజనం చేసే ఏర్పాట్లు ఇప్పటివరకు చేయకపోతే, కుటుంబమంతా కలిసి కనీసం ఒక్క పూటైనా భోజనం చేయడానికి ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు. మీరు ఒంటరి తల్లి లేదా తండ్రి అయినా కూడా అలా ఏర్పాటుచేసుకోవచ్చు. దానివల్ల వచ్చే ప్రయోజనాల ముందు మీరు చేసే ఏ త్యాగమైనా చిన్నదిగానే ఉంటుంది. (g 11/06)