కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునికి మనపట్ల శ్రద్ధ ఉంది!

దేవునికి మనపట్ల శ్రద్ధ ఉంది!

దేవునికి మనపట్ల శ్రద్ధ ఉంది!

ఏదెను తోటలో ప్రారంభమైన తిరుగుబాటు విషయంలో దేవుడు వ్యవహరించిన విధానం, ఆయనకు మనలో ప్రతీఒక్కరిపట్ల ప్రగాఢమైన ప్రేమ, మన భవిష్యత్తుపట్ల శ్రద్ధ ఉన్నాయని చూపిస్తోంది. దేవునికి మనపట్ల నిజంగా శ్రద్ధ ఉందని చూపించే క్రింది రుజువులను పరిశీలించి, ఉదాహరించబడిన లేఖనాలను మీ బైబిల్లో నుండి చదవండి.

● ప్రకృతి సౌందర్యంతో, ఆకర్షణీయమైన జంతువులతో, ఫలవంతమైన నేలతో నిండివున్న భూమిని ఆయన మనకు ఇచ్చాడు.​—అపొస్తలుల కార్యములు 14:​17; రోమీయులు 1:​20.

● రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించడం, సూర్యాస్తమయాన్ని వీక్షించడం, పిల్లల కేరింతలు వినడం, ప్రియమైనవారి వాత్సల్యపూరిత స్పర్శానుభూతిని పొందడం వంటి ప్రతిదిన అనుభవాలను ఆనందించేలా ఆయన మనకు అద్భుతమైన శరీరాన్నిచ్చాడు.​—కీర్తన 139:​14.

● సమస్యలను, ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు సహాయం చేసే జ్ఞానయుక్తమైన మార్గనిర్దేశాన్ని ఆయన మనకు ఇస్తున్నాడు.​—కీర్తన 19:​7, 8; 119:​105; యెషయా 48:​17, 18.

● పరదైసు భూమ్మీద జీవిస్తూ మరణించిన మన ప్రియమైనవారి పునరుత్థానాన్ని చూసే అవకాశంతోపాటు ఆయన మనకు అద్భుతమైన నిరీక్షణనిస్తున్నాడు.​—లూకా 23:​43; యోహాను 5:​28, 29.

● మనకు నిరంతరం జీవించే నిరీక్షణ ఉండేలా మన కోసం మరణించేందుకు ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి పంపించాడు.​—యోహాను 3:​16.

● ఆయన పరలోకంలో మెస్సీయ రాజ్యాన్ని స్థాపించి, ఆ రాజ్యం త్వరలో భూమి అంతటినీ తన అధీనంలోకి తీసుకుంటుందనేందుకు రుజువులను మనకు సమృద్ధిగా ఇచ్చాడు.​—యెషయా 9:​6, 7; మత్తయి 24:​3, 4, 7; ప్రకటన 11:​15; 12:​10.

● తనకు ప్రార్థించమని, తన ముందు మన హృదయాన్ని కుమ్మరించమని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు, మనమలా చేస్తే ఆయన నిజంగా మన ప్రార్థనలను వింటాడు.​—కీర్తన 62:8; 1 యోహాను 5:​14, 15.

● మానవులపట్ల తనకు ప్రగాఢమైన ప్రేమ, శ్రద్ధ ఉన్నాయని ఆయన వారికి పదేపదే హామీ ఇస్తున్నాడు.​—1 యోహాను 4:​9, 10, 19. (g 11/06)