కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారి వివాహబంధం కాపాడబడింది

వారి వివాహబంధం కాపాడబడింది

వారి వివాహబంధం కాపాడబడింది

దక్షిణాఫ్రికాలోని ఒక యజమానురాలు తన దగ్గర పనిచేస్తున్న బెల్లా, కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతోందనే విషయాన్ని గమనించింది. అందుకే ఆమె యెహోవాసాక్షుల్లో ఒకరైన టాండీని బెల్లాతో మాట్లాడమని చెప్పింది. బెల్లా తన భర్తకు విడాకులు ఇవ్వాలని నిశ్చయించుకుందని టాండీకి తెలిసింది.

టాండీ, కుటుంబ సంతోషానికిగల రహస్యము పుస్తకపు రెండు ప్రతులను బెల్లాకు ఇచ్చి, అందులో ఒకటి తన భర్తకు ఇవ్వమని ప్రోత్సహించింది. బెల్లా అలాగే చేసింది. బెల్లా భర్త ఆ పుస్తకం చదువుతున్నాడని, వాళ్ల కుటుంబ జీవితం మెరుగవుతుందని టాండీకి ఒక వారం తర్వాత తెలిసింది. ప్రార్థన ద్వారా, కుటుంబ సంతోషం పుస్తకం ద్వారా దేవుడే తన వివాహ బంధాన్ని కాపాడాడని మూడు నెలల తర్వాత బెల్లా టాండీతో చెప్పింది. అయితే, ఆ అనుభవం అంతటితో ముగిసిపోలేదు.

బెల్లా యజమానురాలికి ఆ విషయం తెలిసినప్పుడు, తన సిబ్బంది అంతా ఆ పుస్తకం తీసుకోవాలని సిఫారసు చేసింది. అలా కుటుంబ సంతోషం అనే 192 పేజీల పుస్తకపు వందకన్నా ఎక్కువ ప్రతులు ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు అందించబడ్డాయి. ఆ పుస్తకంలో, “ఒకవేళ వివాహం విచ్ఛిన్నం కాబోయే స్థితిలో ఉంటే,” “మీ కుటుంబాన్ని వినాశకర ప్రభావాలనుండి కాపాడండి,” “మీ గృహంలో శాంతిని కాపాడుకోండి” లాంటి ఉపదేశాత్మక అధ్యాయాలు ఉన్నాయి.

మీరు ఈ క్రిందున్న కూపన్‌ను నింపి, ఈ పత్రికలోని 5వ పేజీలో ఇవ్వబడిన చిరునామాల్లో తగినదానికి పంపించడం ద్వారా మీరు కుటుంబ సంతోషానికిగల రహస్యము పుస్తకం గురించి మరింత సమాచారాన్ని కోరవచ్చు. (g 2/07)

□ ఎలాంటి షరతులు విధించకుండా, కుటుంబ సంతోషానికిగల రహస్యము పుస్తకం గురించి మరింత సమాచారం పంపించాలని కోరుతున్నాను.

□ ఉచిత గృహ బైబిలు అధ్యయనం గురించి దయచేసి నన్ను సంప్రదించండి.