కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనుకోకుండా ఎదురైన పక్షి

అనుకోకుండా ఎదురైన పక్షి

అనుకోకుండా ఎదురైన పక్షి

నేను నా స్నేహితులు హవాయ్‌లోని మావుయి ద్వీపానికి వెళ్లే రోజు కోసం ఎదురుచూస్తున్నాం. మేము ప్రత్యేకంగా, దాదాపు 3,055 మీటర్ల ఎత్తుండే హలియాకాలా అగ్నిపర్వతం పైనుండి సూర్యోదయాన్ని చూడాలని ఎంతో కోరుకున్నాం. అదెంతో విశేషమైన అనుభవమని మాకు చెప్పబడింది. అయితే ఒకే ఒక అసౌకర్యం ఏమిటంటే, మేముంటున్న కపాలువా ద్వీపం నుండి అక్కడికి చేరుకోవాలంటే మేము ఉదయం రెండింటికే నిద్రలేవాలి. అంతేకాదు, మేము కారులో ఎత్తైన పర్వతంపైకి చేరుకోవాలి. అంత ఉదయాన్నే బయలుదేరాలి కాబట్టి దారి పొడుగునా మరెవరూ ఉండరేమో అనుకున్నాం. కానీ అలా జరగలేదు. మాతోపాటు ఇంకా చాలా వాహనాలు మలుపులు తిరిగిన రహదారిపై నెమ్మదిగా ప్రయాణిస్తూ శిఖరంపైకి చేరుకున్నాయి. మేము పైకి చేరుకునేసరికి అక్కడ చాలా చలిగా ఉంది. కానీ మేము కప్పుకోవడానికి మాతోపాటు రగ్గులు తీసుకెళ్ళాం.

దాదాపు ఆరు గంటలకు ఉదయించే సూర్యుని కోసం వందలాది మంది ఓపిగ్గా ఎదురుచూస్తూ ఉన్నారు. అందరూ ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్నారు, అద్భుతమైన ఆ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ ఊహించనిది జరిగింది. సరిగ్గా సూర్యోదయమయ్యే సమయానికి, మేము అద్భుతమైన ఆ దృశ్యాన్ని ఫోటో తీయడానికి వీలులేకుండా అగ్నిపర్వతంపై మబ్బులు కమ్ముకోవడం చూసి ఎంతో నిరాశపడ్డాం. కానీ పసిఫిక్‌ మహాసముద్రం సమీపంలోని పర్వతాల మీద అలా జరగడం మామూలే. అందుకే మేము నిరుత్సాహాన్ని విడిచి, ఉదయిస్తున్న సూర్యకిరణాల వేడికి మబ్బులు మెల్లగా తొలగిపోవడం కోసం ఆగాం. అయితే అనుకోకుండా మాకు మరో దృశ్యం కనిపించింది! ఆ మబ్బులు తొలగిపోయి రమణీయంగా కనిపిస్తున్న శిఖరబిలమంతటా ఏదో అటూఇటూ నడిచినట్లుగా పాదాల గుర్తులు కనిపించాయి. మా ప్రయాస వ్యర్థం కాలేదు.

అకస్మాత్తుగా మాకు “చకార్‌, చకార్‌” అంటూ కోడిపెట్ట అరుపుల్లాంటి పక్షి అరుపులు వినిపించాయి. ఆ తర్వాత ఆ అరుపులు ఎక్కడి నుండి వస్తున్నాయో మేము చూశాం. అది అందమైన చకార్‌ పక్షి, అది ఆసియా, ఐరోపాల్లో ఉండే కౌజు జాతి పక్షి. లాటిన్‌లో దానిపేరు ఆలెక్టారిస్‌ చకార్‌. గుడ్లు పొదిగే కాలంలో చకార్‌ పక్షి ఎక్కువగా నేలమీదే గూళ్లు కట్టుకుంటుంది. అది మమ్మల్ని చూసి ఎగిరిపోయే బదులు పరిగెత్తింది.

ఈ రకమైన పక్షి, అందమైన మావుయి ద్వీపంలోకి ఎలా వచ్చింది? చకార్‌ పక్షులను ఎవరో అక్కడికి తెచ్చారని స్పష్టమౌతోంది. ఉత్తర అమెరికా ఖండంలో అవి తరచూ వేటాడబడడం కోసం విడువబడేవి. మనుషుల్ని చూసి బెదిరిపోయే అలాంటి పక్షిని దగ్గరగా చూడగల్గినందుకు మేమెంతో సంతోషించాం.​—⁠సమర్పిత వ్యాసం. (g 2/07)