కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ వ్యక్తి నాకు తగిన వ్యక్తేనా?

ఈ వ్యక్తి నాకు తగిన వ్యక్తేనా?

యువత ఇలా అడుగుతోంది . . .

ఈ వ్యక్తి నాకు తగిన వ్యక్తేనా?

వీటికి సమాధానమివ్వడానికి కాస్త సమయం తీసుకోండి:

మీరు వివాహం చేసుకోబోయే వ్యక్తిలో ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు ఉండడం ప్రాముఖ్యమని మీరు అనుకుంటున్నారు? క్రింద ఇవ్వబడిన వాటిలో మీరు ముఖ్యమైనవని భావించే నాలుగింటి పక్కన ✔ గుర్తు పెట్టండి.

․․․․․․․․ అందం ․․․․․․․․ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి

․․․․․․․․ స్నేహశీలత ․․․․․․․․నమ్మదగినవారిగా ఉండడం

․․․․․․․․ కలివిడిగా ఉండడం ․․․․․․․․సరైన నైతిక ప్రవర్తన

․․․․․․․․ హాస్య చతురత ․․․․․․․․నిర్దిష్ట లక్ష్యాలుండడం

మీరు చిన్నవయసులో ఎవరిపట్లైనా ఆకర్షితులయ్యారా? అయితే, పైన ఇవ్వబడిన వాటిలో ఏ లక్షణం అప్పుడు ఆ వ్యక్తిలో మీకు బాగా నచ్చిందో దాని పక్కన ✘ గుర్తు పెట్టండి.

పైన ప్రస్తావించబడినవాటిలో ఏ ఒక్కటీ తప్పు కాదు. దేనికదే ప్రత్యేకమైనది. కానీ, మీరు చిన్నవయసులోనే ఎవరిపట్లైనా ఆకర్షితులైతే, ఆవతలి వ్యక్తిలోని పైపై లక్షణాలమీదనే అంటే ఎడమవైపు చూపించబడినవాటిపైనే ఎక్కువగా దృష్టి నిలుపుతారనే విషయాన్ని మీరు అంగీకరించరా?

అయితే, మీరు పరిణతి చెందుతుండగా, మరింత ప్రాముఖ్యమైనవాటిని అంటే కుడివైపు ఇవ్వబడినవాటిని పరిశీలించడానికి మీ ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకు, పొరుగింట్లో ఉన్న అందమైన అమ్మాయి అంత నమ్మదగినదిగా ఉండకపోవచ్చని లేదా తరగతిలో పేరుపొందిన అబ్బాయి నైతిక ప్రవర్తన సరిగా ఉండకపోవచ్చని మీరు గ్రహించడం మొదలుపెడతారు. మీరు జీవితంలో లైంగిక కోరికలు బలంగా ఉండే వయసు, అంటే ‘ఈడు మించిన’ వారైతే, ‘ఈ వ్యక్తి నాకు తగిన వ్యక్తేనా’ అని నిర్ధారించుకోవడానికి మీరు ఆ వ్యక్తిలో పైకి కనబడే లక్షణాలను మాత్రమే చూడరు.​—1 కొరింథీయులు 7:36.

ఎవరైనా ఫర్వాలేదా?

కాలం గడుస్తుండగా, మీరు ఎంతోమందివైపు ఆకర్షితులు కావచ్చు. అయితే ఎవరైనా ఫర్వాలేదు అనుకుంటే సరిపోదు. నిజానికి, జీవితాంతం మీతో కలిసివుండి, మీలోని సుగుణాలకు పదును పెట్టే వ్యక్తి కావాలనే కదా మీరు కోరుకునేది. మీరు కూడా ఆయన విషయంలో అలాగే చేయాలనుకుంటారు. (మత్తయి 19:​4-6) ఆ వ్యక్తి ఎవరై ఉండవచ్చు? ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చే ముందు, మీరు ఒకసారి “అద్దములో” చూసుకుని మిమ్మల్ని మీరు నిజాయితీగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది.​—యాకోబు 1:​23-25.

మిమ్మల్ని మీరు మరింతగా తెలుసుకోవడానికి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి:

నాలోని మంచి లక్షణాలేమిటి?

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

నా బలహీనతలేమిటి?

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

నాకు ఎలాంటి భావోద్రేక, ఆధ్యాత్మిక అవసరాలున్నాయి?

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․․

మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం అంత సులభమేమీ కాదు, కానీ పైన ఇవ్వబడినటువంటి ప్రశ్నల ద్వారా మీరలా చేయడం మొదలుపెట్టవచ్చు. * మీ గురించి మీకు ఎంత అవగాహన ఉంటే, మీలోని బలహీనతలను కాదుగానీ మంచి లక్షణాలను మెరుగుపర్చే వ్యక్తిని ఎన్నుకొనేందుకు మీరంత సిద్ధంగా ఉంటారు. మీకు తగిన వ్యక్తిని మీరు కనుగొన్నారని మీకు అనిపిస్తే, అప్పుడేమిటి?

ఈ బంధం నిలుస్తుందా?

ఆ ప్రశ్నకు సమాధానమివ్వడానికి, అవతలి వ్యక్తిని నిజాయితీగా పరిశీలించండి. కానీ ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు చూడాలి అనుకునే వాటినే చూడడానికి మీరు ప్రయత్నించవచ్చు. కాబట్టి తొందరపడకండి. నిజంగా ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

ఒకరినొకరు ఇష్టపడుతున్నవారిలో చాలామంది కేవలం పైకి కనిపించేవాటినే చూస్తారు. వారు ముందు తామిద్దరిలోనూ ఉన్న ఒకేలాంటి అభిరుచులనే గమనిస్తారు: ‘మా ఇద్దరికీ ఒకేరకం సంగీతమంటే ఇష్టం.’ ‘మా ఇద్దరికీ ఒకే పనులు చేయడమంటే ఇష్టం.’ ‘అన్ని విషయాల్లోనూ మా అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి!’ అయితే, ముందే చెప్పినట్లుగా, మీరు నిజంగా ఈడు మించిన వారైతే, మీరు పైకి కనిపించేవాటిని మాత్రమే చూడరు. మీరు ‘హృదయపు అంతరంగ స్వభావాన్ని’ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.​—1 పేతురు 3:4; ఎఫెసీయులు 3:​15, 16.

ఉదాహరణకు, మీరిద్దరూ ఎన్ని విషయాల్లో ఏకాభిప్రాయాన్ని కలిగివున్నారనే దానిపై దృష్టి నిలిపేకన్నా, మీరు ఏకీభవించనప్పుడు ఏమి జరుగుతుందో గమనించడం ద్వారా ఆ వ్యక్తి గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు. మరోవిధంగా చెప్పాలంటే, మీతో ఏకీభవించనప్పుడు ఆ వ్యక్తి స్పందన ఎలా ఉంది, తాను చెప్పిన విధంగానే పనులు జరగాలని పట్టుబడుతూ, బహుశా ‘క్రోధం’ లేక కోపం తెచ్చుకుంటున్నారా, ‘దూషిస్తున్నారా’? (గలతీయులు 5:​19, 20; కొలొస్సయులు 3:8) ఆమె లేక ఆయన సహేతుకంగా ఉంటున్నారా, అంటే తప్పొప్పుల ప్రసక్తి లేనప్పుడు సమాధానం కోసం తనలో మార్పు చేసుకునేందుకు సంసిద్ధత చూపిస్తున్నారా?​—యాకోబు 3:17.

పరిశీలించాల్సిన మరో విషయం: ఆయన లేక ఆమె ఇతరులపై అధికారం చెలాయిస్తారా లేదా ఈర్ష్యపడతారా? మీ ప్రతీ కదలికను తెలుసుకోవాలనుకుంటారా? నికోల్‌ అనే యౌవనస్థురాలు ఇలా అంటోంది: “ఒక వ్యక్తి నాకే చెందాలని అనుకోవడం, అసూయపడడం ప్రమాదానికి సూచికలు. ఒకరినొకరు ఇష్టపడుతున్న జంటలు, తమలో ఒకరు మరొకరికి ఫోన్‌ చేసి, తానెక్కడున్నదీ తెలియజేయలేదనే విషయాన్నే సహించలేకపోవడం వల్ల ఒకరితో ఒకరు గొడవపడడాన్ని గురించి నేను విన్నాను. అది ప్రమాదానికి సూచన అని నాకనిపిస్తుంది.”

మీరు ఇష్టపడుతున్న వ్యక్తి గురించి ఇతరుల అభిప్రాయమేమిటి? ఆ వ్యక్తితో చాలాకాలంగా పరిచయమున్నవారితో అంటే ఆమె లేదా ఆయన హాజరౌతున్న సంఘంలోని పరిణతి చెందినవారితో మీరు మాట్లాడడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఆ వ్యక్తికి “మంచిపేరు” ఉందో లేదో వారే మీకు చెబుతారు.​—అపొస్తలుల కార్యములు 16:​1, 2. *

మీరు విడిపోవాలా?

మీరు ఇష్టపడుతున్న వ్యక్తి మీకు తగినవారు కాదని మీరు గ్రహిస్తే ఏమి చేయాలి? అలా గ్రహించినప్పుడు, మీరిక అంతటితో విడిపోవడం జ్ఞానయుక్తం. “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు” అని బైబిలు చెబుతోంది.​—సామెతలు 22:3. *

కొంతకాలానికి మీకు మరో వ్యక్తి పరిచయం కావచ్చు. అప్పుడు, మీరు అనుభవం ద్వారా అలవర్చుకున్న మరింత సమతూక దృష్టి మీకు ఉంటుంది. బహుశా అప్పుడు “ఈ వ్యక్తి నాకు తగిన వ్యక్తేనా” అనే ప్రశ్నకు జవాబుగా మీరు అవును అని చెప్పవచ్చు! (g 5/07)

“యువత ఇలా అడుగుతోంది . . . ” శీర్షికల పరంపరలోని మరిన్ని ఆర్టికల్స్‌ www.watchtower.org/ype అనే వెబ్‌సైట్‌లో చూడవచ్చు

ఆలోచించాల్సినవి

◼ మిమ్మల్ని ఒక మంచి భార్యగా లేదా భర్తగా చేసే ఎలాంటి మంచి లక్షణాలు మీలో ఉన్నాయి?

◼ మీరు వివాహం చేసుకోబోయేవారిలో ఎలాంటి కొన్ని లక్షణాలు ఉండాలని మీరు కోరుకుంటారు?

◼ మీరు ఇష్టపడుతున్న వ్యక్తి ప్రవర్తన గురించి, వ్యక్తిత్వం గురించి, వారికి ఎలాంటి పేరు ఉందనే విషయం గురించి ఎలా తెలుసుకోవచ్చు?

[అధస్సూచీలు]

^ మరిన్ని ప్రశ్నల కోసం తేజరిల్లు! (ఆంగ్లం) జనవరి 2007 సంచికలోని 30వ పేజీ చూడండి.

^ 17, 18 పేజీల్లో ఉన్న బాక్సుల్లోని ప్రశ్నలను కూడా పరిశీలించండి.

^ విడిపోవడాన్ని గురించిన మరింత సమాచారం కోసం తేజరిల్లు! ఏప్రిల్‌-జూన్‌ 2001, 18-20 పేజీలను చూడండి.

[17వ పేజీలోని బాక్సు]

ఆయన మంచి భర్తగా ఉండగలడా?

ప్రాథమికంగా చూడాల్సినవి

❑ తనకున్న ఏ అధికారాన్నైనా ఎలా ఉపయోగిస్తాడు? —మత్తయి 20:​25, 26.

❑ ఆయన లక్ష్యాలేమిటి?​—1 తిమోతి 4:​15.

❑ ఇప్పుడు ఆ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తున్నాడా?​—1 కొరింథీయులు 9:​26, 27.

❑ ఆయన స్నేహితులెవరు?​—సామెతలు 13:​20.

❑ డబ్బుపట్ల ఆయన వైఖరి ఏమిటి?​—హెబ్రీయులు 13:​5, 6.

❑ ఎలాంటి వినోదాన్ని ఇష్టపడతాడు?​—కీర్తన 97:10.

❑ ఆయన వస్త్రధారణ ఆయన గురించి ఏమి తెలియజేస్తోంది?​—2 కొరింథీయులు 6:3.

❑ యెహోవాపట్ల తనకున్న ప్రేమను ఎలా ప్రదర్శిస్తాడు?​—1 యోహాను 5:3.

మంచి లక్షణాలు

❑ కష్టపడి పని చేస్తాడా?​—సామెతలు 6:9-11.

❑ ఆర్థిక విషయాల్లో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాడా?—లూకా 14:​28.

❑ ఆయనకు మంచి పేరుందా?​—అపొస్తలుల కార్యములు 16:​1, 2.

❑ తన తల్లిదండ్రులను గౌరవిస్తాడా? —నిర్గమకాండము 20:​12.

❑ ఇతరులపట్ల శ్రద్ధ ఉందా?​—ఫిలిప్పీయులు 2:4.

ప్రమాద సూచికలు

❑ త్వరగా కోపం వస్తుందా?​—సామెతలు 22:​24.

❑ లైంగిక దుర్నీతిలో పాల్గొనమని మిమ్మల్ని బలవంతపెడతాడా?​—గలతీయులు 5:​19.

❑ ఇతరులపై దాడి చేస్తాడా, మాటలతో దూషిస్తాడా? —ఎఫెసీయులు 4:​31.

❑ ఆనందం కోసం మద్యంపై ఆధారపడతాడా?​ —సామెతలు 20:1.

❑ ఈర్ష్యపడతాడా, స్వార్థపరుడా?​—1 కొరింథీయులు 13:​4, 5.

[18వ పేజీలోని బాక్సు]

ఆమె మంచి భార్యగా ఉండగలదా?

ప్రాథమికంగా చూడాల్సినవి

❑ కుటుంబంలో, సంఘంలో ఎలా విధేయత చూపిస్తుంది?​—ఎఫెసీయులు 5:​21, 22.

❑ ఆమె వస్త్రధారణ ఆమె గురించి ఏమి తెలియజేస్తోంది?​—1 పేతురు 3:​3, 4.

❑ ఆమె స్నేహితులెవరు?​—సామెతలు 13:​20.

❑ డబ్బుపట్ల ఆమె వైఖరి ఏమిటి?​—1 యోహాను 2:​15-17.

❑ ఆమె లక్ష్యాలేమిటి?​—1 తిమోతి 4:​15.

❑ ఇప్పుడు ఆ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తోందా?​—1 కొరింథీయులు 9:​26, 27.

❑ ఎలాంటి వినోదాన్ని ఇష్టపడుతుంది?​—కీర్తన 97:​10.

❑ యెహోవాపట్ల తనకున్న ప్రేమను ఎలా ప్రదర్శిస్తుంది?​—1 యోహాను 5:3.

మంచి లక్షణాలు

❑ కష్టపడి పనిచేస్తుందా? —సామెతలు 31:​17, 19, 21, 22, 27.

❑ ఆర్థిక విషయాల్లో బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుందా?​—సామెతలు 31:​16, 18.

❑ ఆమెకు మంచి పేరుందా?​—రూతు 4:​11.

❑ తన తల్లిదండ్రులను గౌరవిస్తుందా? —నిర్గమకాండము 20:​12.

❑ ఇతరులపట్ల శ్రద్ధ ఉందా?​—సామెతలు 31:​20.

ప్రమాద సూచికలు

❑ వాదించే అలవాటుందా?​—సామెతలు 21:​19.

❑ లైంగిక దుర్నీతిలో పాల్గొనమని మిమ్మల్ని బలవంతపెడుతుందా?​—గలతీయులు 5:​19.

❑ ఇతరులపై దాడి చేస్తుందా, మాటలతో దూషిస్తుందా?​—ఎఫెసీయులు 4:31.

❑ ఆనందం కోసం మద్యంపై ఆధారపడుతుందా?​—సామెతలు 20:1.

❑ ఈర్ష్యపడుతుందా, స్వార్థపరురాలా? —1 కొరింథీయులు 13:​4, 5.