కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“క్రీస్తును అనుసరించండి!”

“క్రీస్తును అనుసరించండి!”

“క్రీస్తును అనుసరించండి!”

యెహోవాసాక్షుల జిల్లా సమావేశం

మూడు రోజులు జరిగే ఈ సమావేశాల పరంపర ఇండియాలో ఆగస్టు చివర్లో ప్రారంభమౌతుంది, అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది నగరాల్లో 2008వ సంవత్సరం వరకు కొనసాగుతుంది. అనేక ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 9:20కి కార్యక్రమం సంగీతంతో ప్రారంభమౌతుంది. సమావేశంలోని అన్నిరోజుల కార్యక్రమం యేసును గురించి వివరిస్తుంది.

శుక్రవారం కార్యక్రమ ముఖ్యాంశం ‘విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూడండి.’ (హెబ్రీయులు 12:1) ఆహ్వాన ప్రసంగపు శీర్షిక ‘“క్రీస్తును” ఎందుకు అనుసరించాలి?’ ఆ రోజు ఉదయం, “యేసు పాత్రను నిర్వర్తించే అర్థంచేసుకోవడం—గొప్ప మోషేగా, గొప్ప దావీదుగా, గొప్ప సొలొమోనుగా” అనే మూడు భాగాల గోష్ఠి కూడా ఉంటుంది. ఉదయకాల కార్యక్రమం “యెహోవా సంకల్పంలో యేసు విశిష్టమైన పాత్ర” అనే ముఖ్యాంశ ప్రసంగంతో ముగుస్తుంది.

శుక్రవారం మధ్యాహ్నం మొదట “మేము మెస్సీయను కనుగొంటిమి”! అనే ప్రసంగం ఇవ్వబడుతుంది. ఆ తర్వాత “‘ఆయనయందు గుప్తమైయున్న’ సంపదను కనుగొనడం” అనే ప్రసంగం ఇవ్వబడుతుంది. “క్రీస్తు మనసును కలిగివుండండి” అనే గంటపాటుండే ఐదు భాగాల గోష్ఠిలో “ఆయన దయాపూర్వకంగా ‘వారిని చేర్చుకున్నాడు,’” “ఆయన ‘మరణము పొందునంతగా విధేయత చూపించాడు,’” “ఆయన ‘వారిని అంతము వరకు ప్రేమించాడు’” అనే ప్రసంగాలు ఉన్నాయి. ఆ రోజు కార్యక్రమం “వారు ‘గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు’” అనే ప్రసంగంతో ముగుస్తుంది.

శనివారం కార్యక్రమ ముఖ్యాంశం “నా గొఱ్ఱెలు నా స్వరము వినును, . . . అవి నన్ను వెంబడించును.” (యోహాను 10:27) “పరిచర్యలో యేసు మాదిరిని అనుసరించండి” అనే గంటపాటుండే గోష్ఠిలో మన పరిచర్యను మెరుగుపరచుకోవడానికి తోడ్పడే ఆచరణాత్మక సలహాలు ఉంటాయి. “ఆయన ‘నీతిని ప్రేమించి, దుర్నీతిని ద్వేషించాడు’​—మీరూ అలాగే చేస్తారా?” “యేసులాగే ‘అపవాదిని ఎదిరించుడి’” అనే ప్రసంగాల తర్వాత ఉదయకాల కార్యక్రమం బాప్తిస్మం గురించిన చర్చతో ముగుస్తుంది, దాని తర్వాత అర్హులైనవారికి బాప్తిస్మం ఇవ్వబడుతుంది.

శనివారపు మధ్యాహ్న కార్యక్రమం, “మీరు అనుసరించకూడదు” అనే గోష్ఠితో ప్రారంభమౌతుంది. దానిలో “సమూహమును,” ‘కోరినవాటిని, చూచినవాటిని,’ ‘మాయా స్వరూపములను,’ ‘అబద్ధబోధకులను,’ “కల్పనాకథలను,” ‘సాతానును’ అనే ఆరు భాగాలు ఉన్నాయి. ఆ గోష్ఠి తర్వాత “‘యెహోవాచేత ఉపదేశించబడే’ అత్యుత్తమ అవకాశం,” “మందకు తిరిగి వచ్చేందుకు వారికి సహాయం చేయండి” అనే ప్రసంగాలు ఉన్నాయి. సమావేశ ముఖ్యాంశమైన “నీవు వచ్చి నన్ను వెంబడించుము” అనే ప్రసంగంతో ఆ రోజు ముగుస్తుంది.

ఆదివారం కార్యక్రమ ముఖ్యాంశం, ‘నన్ను వెంబడిస్తూ ఉండండి.’ (యోహాను 21:​19) “క్రీస్తును అనుసరించేందుకు ‘నెపములు చెప్పకండి’” అనే ప్రసంగం తర్వాత, “కొండమీది ప్రసంగంలోని విలువైన రత్నాలు” అనే ఆరు భాగాల గోష్ఠి ఉంటుంది. ‘తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు సంతోషంగా ఉంటారు,’ ‘మొదట నీ సహోదరునితో సమాధానపడుము,’ “ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును” అనే యేసు మాటలను ఆ గోష్ఠి వివరిస్తుంది. ఉదయకాల కార్యక్రమం “క్రీస్తు నిజ అనుచరులు ఎవరు?” అనే బహిరంగ ప్రసంగంతో ముగుస్తుంది. మధ్యాహ్నం, దేవుని ప్రవక్తయైన ఎలీషా సహాయకుడైన దురాశాపరుడైన గేహజీ గురించిన బైబిలు వృత్తాంతం ఆధారంగా ఆనాటి వస్త్రాలంకరణతో ప్రదర్శించబడే నాటకం ప్రధానాకర్షణగా ఉంటుంది. “మన అజేయ నాయకుడైన క్రీస్తును అనుసరిస్తూ ఉండండి” అనే ప్రసంగంతో సమావేశం ముగుస్తుంది.

ఈ సమావేశానికి హాజరుకావడానికి ఇప్పటినుండే ప్రణాళికలు వేసుకోండి. మీకు దగ్గర్లోని ఏ ప్రాంతంలో సమావేశం జరుగుతుందో తెలుసుకోవడానికి యెహోవాసాక్షుల స్థానిక రాజ్యమందిరానికి వెళ్లండి లేక ఈ పత్రిక ప్రచురణకర్తలకు రాయండి. యెహోవాసాక్షులు ప్రచురించే కావలికోట మార్చి 1వ సంచికలో, ఇండియాలో సమావేశాలు జరిగే ప్రాంతాల చిరునామాలు ఇవ్వబడ్డాయి. (g 6/07)