కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇంట్లో ప్రేమగల వాతావరణం కల్పించండి

ఇంట్లో ప్రేమగల వాతావరణం కల్పించండి

చర్య 2

ఇంట్లో ప్రేమగల వాతావరణం కల్పించండి

ఈ చర్య ఎందుకు తీసుకోవాలి? పిల్లలకు ప్రేమ అవసరం, అదే లేకపోతే వారు వాడిపోతారు. మానవ భౌతిక, సామాజిక, సాంస్కృతిక శాస్త్రవేత్తయిన ఎం. ఎఫ్‌. ఆష్లీ మాంటెగ్యూ 1950లలో ఇలా రాశాడు: “ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఎదగడానికి ప్రేమ అనే పోషక పదార్థం అత్యంత అవసరం; ప్రత్యేకంగా జీవితపు తొలి ఆరు సంవత్సరాల్లో చవిచూసిన ప్రేమే పరిపూర్ణ ఆరోగ్యానికి మూలాధారం.” “పిల్లలకు చాలినంత ప్రేమ లభించనప్పుడు వారు తీవ్ర హానికర ప్రభావాలకు లోనవుతారు” అని మాంటెగ్యూ నిర్ధారించిన మాటలతోనే ఆధునిక పరిశోధకులు ఏకీభవిస్తున్నారు.

అది ఎందుకు కష్టం? ప్రేమలేని, స్వార్థపూరిత లోకంలో జీవిస్తుండడంవల్ల కుటుంబ బాంధవ్యాలు ఒత్తిడికి గురవుతున్నాయి. (2 తిమోతి 3:1-5) పిల్లలను పెంచేందుకు అవసరమయ్యే ఖర్చులు, వారి భావోద్రేక అవసరతల్ని తీర్చడం, వివాహంలో అప్పటికే ఉన్న సమస్యలను ఇంకా ఎక్కువ చేస్తున్నట్లు వివాహ దంపతులు కనుగొనవచ్చు. ఉదాహరణకు, పరస్పరం అంతగా సంభాషించుకోని వివాహ దంపతుల మధ్య, పిల్లలకు ఎలాంటి క్రమశిక్షణను ఇవ్వాలనే విషయంలో, వారి మంచి ప్రవర్తననుబట్టి వారికి బహుమానమిచ్చే విషయంలో తలెత్తే భిన్నాభిప్రాయాలు ఒత్తిడిని మరింత పెంచవచ్చు.

పరిష్కారం: కుటుంబంగా కలిసి గడిపేందుకు క్రమంగా సమయాన్ని కేటాయించండి. దంపతులిద్దరు ఏకాంతంగా గడపాల్సిన సమయం గురించి కూడా ఆలోచించండి. (ఆమోసు 3:3) పిల్లలు పడుకున్న తర్వాతి సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోండి. ఇలాంటి విలువైన సమయాన్ని దోచుకునేందుకు టీవీని అనుమతించకండి. పరస్పరం ప్రేమను వ్యక్తపర్చుకుంటూ ఉండడం ద్వారా మీ దాంపత్య జీవితాన్ని ఆనందించండి. (సామెతలు 25:11; పరమగీతము 4:7-10) ఎప్పుడూ ‘విమర్శిస్తూ’ ఉండే బదులు ప్రతీరోజు మీ జతను మెచ్చుకునే మార్గాల గురించి ఆలోచించండి.—కీర్తన 103:9, 10, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌; సామెతలు 31:28.

మీరు మీ పిల్లలను ప్రేమిస్తున్నారని వారికి చెప్పండి. యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుపట్ల తనకున్న ప్రేమను బహిరంగంగా వ్యక్తపరచడం ద్వారా తల్లిదండ్రులకు మాదిరినుంచాడు. (మత్తయి 3:17; 17:5) ఆస్ట్రియాలో నివసిస్తున్న ఫ్లెక్‌ అనే తండ్రి ఇలా చెబుతున్నాడు: “పిల్లలు కొంతమేరకు పువ్వుల్లా ఉంటారని నేను గమనించాను. పూలమొక్కలు వెలుగు, సూర్యరశ్మి కోసం సూర్యునివైపు తిరిగినట్టే, పిల్లలు కూడా ప్రేమ కోసం, కుటుంబ సభ్యుల్లో తాము విలువైనవారమనే హామీ కోసం తమ తల్లిదండ్రులవైపు తిరుగుతారు.”

మీరు వివాహితులైనా లేదా ఒంటరి తల్లి లేదా తండ్రి అయినా, మీరు ఒకరిపట్ల ఒకరు, దేవునిపట్ల ప్రేమను పెంపొందించుకునేలా మీ కుటుంబానికి సహాయపడితే మీ కుటుంబ జీవితం మెరుగవుతుంది.

తల్లిదండ్రులు తమ అధికారాన్ని ఉపయోగించే విషయంలో దేవుని వాక్యం ఏమి చెబుతోంది? (g 8/07)

[4వ పేజీలోని బ్లర్బ్‌]

‘ప్రేమ పరిపూర్ణతకు అనుబంధమైనది.’—కొలొస్సయులు 3:14