కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దైవిక శిక్షణ సత్ఫలితాలనిస్తుంది

దైవిక శిక్షణ సత్ఫలితాలనిస్తుంది

దైవిక శిక్షణ సత్ఫలితాలనిస్తుంది

తమ పిల్లలకు చిన్నతనం నుండే బోధించడం ప్రారంభించిన తల్లిదండ్రులు సత్ఫలితాలు సాధిస్తారు. దక్షిణ అమెరికాలోని పెరూలో నివసించే డొరియాన్‌ అనే అబ్బాయి నాలుగేళ్ల వయసున్నప్పుడే యెహోవాసాక్షుల రాజ్యమందిరంలో జరిగే దైవపరిపాలనా పాఠశాలలో మొదటిసారి విద్యార్థి ప్రసంగాన్ని ఇచ్చాడు. అతను స్కూలుకు వెళ్లడం ప్రారంభించే సమయానికి, తాను క్రిస్మస్‌ ఎందుకు జరుపుకోడో తన టీచరుకు, తోటి విద్యార్థులకు బైబిలు నుండి వివరించగలిగాడు.

ఇటీవలి డొరియాన్‌కు సుమారు ఐదేళ్లున్నప్పుడు, అతను తన స్కూలు పిల్లలందరిముందు అంటే దాదాపు 500 మంది విద్యార్థుల ముందు ఫాదర్స్‌ డే గురించి తన అభిప్రాయమేమిటో తెలియజేయాలని అడగబడ్డాడు. అతను, బైబిల్లోని ఎఫెసీయులు 6:4 వచనం ఆధారంగా “తండ్రి బాధ్యతలు” అనే అంశంపై 10 నిమిషాల ప్రసంగాన్ని సిద్ధం చేసుకున్నాడు. ప్రసంగం ముగింపులో అతనిలా అన్నాడు: “పిల్లలు సంవత్సరానికొకసారి ఫాదర్స్‌ డేని జరుపుకునే బదులు ప్రతీరోజు తమ తల్లిదండ్రులను గౌరవిస్తూ, వారికి లోబడాలి.”

ఇటు యౌవనులు, అటు వయోజనులు ప్రసాంగాలిచ్చే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు రూపొందించబడిన దైవపరిపాలనా పాఠశాల 1943లో యెహోవాసాక్షులు వారంలో జరుపుకునే కూటంగా మారింది. అప్పటినుండి అది బైబిలు ఆధారిత శిక్షణనిస్తూ, తల్లిదండ్రులు తమ పిల్లలకివ్వాలని నొక్కిచెప్పబడిన శిక్షణకు అనుబంధంగా ఉంది.—సామెతలు 22:6.

స్విట్జర్లాండ్‌కు చెందిన సైమన్‌ 2005 నవంబరులో అంటే తనకు ఆరేళ్లున్నప్పుడు మొదటిసారి దైవపరిపాలనా పాఠశాలలో బైబిలు పఠనం చేశాడు. దాదాపు ఒక ఏడాది తర్వాత అతను యెహోవాసాక్షుల సమావేశంలో ఇంటర్వ్యూ చేయబడ్డాడు. అతను ఆధ్యాత్మిక విషయాలపట్ల ఎలాంటి స్వభావాన్ని వృద్ధిచేసుకున్నాడు?

సైమన్‌కు క్రైస్తవ కూటాలు హాజరవ్వడమంటే ఎంతో ఇష్టం, ఎంతో అలసిపోయినా అతను ఒక్క కూటమైనా మానడనే విషయాన్నిబట్టి అది తెలుస్తుంది. అంతేకాక, అతను తన కుటుంబ సభ్యులతోపాటు పరిచర్యలో పాల్గొంటాడు. ప్రతీ నెల దాదాపు 30 నుండి 50 కావలికోట, తేజరిల్లు! పత్రికలను అన్ని వయసుల వారికి అందిస్తాడు. అంతేకాదు అతను తరచూ సాక్షికాని తన తండ్రితో బైబిలు గురించి మాట్లాడి, ఆయనను తమతోపాటు కూటాలకు రమ్మని ప్రోత్సహిస్తూ ఉంటాడు.

తమ పిల్లలను “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను” పెంచిన తల్లిదండ్రులు, పిల్లలు తమ శిక్షణకు స్పందిస్తూ నీతి ఫలాలను ఫలించినప్పుడు ఎంతగానో సంతోషిస్తారనడంలో సందేహం లేదు.—ఎఫెసీయులు 6:4; యాకోబు 3:17, 18. (g 8/07)

[26వ పేజీలోని చిత్రం]

పాఠశాలలో డొరియాన్‌

[26వ పేజీలోని చిత్రం]

రాజ్యమందిరంలో సైమన్‌