కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

ప్రపంచ పరిశీలన

“నేడు మహాసముద్రాల ఉపరితలంపై ప్రతీ చదరపు కిలోమీటరుకు దాదాపు 18,000 ప్లాస్టిక్‌ ముక్కలు చెల్లాచెదురుగా తేలియాడుతున్నాయి.”—ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. (g 7/07)

దక్షిణాఫ్రికాలోని న్యాయస్థానాల్లో ప్రతీరోజు దాదాపు 82 మంది పిల్లలు “ఇతర పిల్లలపై అత్యాచారం చేస్తున్నట్లు లేదా అనుచితంగా దాడి చేస్తున్నట్లు” ఆరోపించబడుతున్నారు. కొంతమంది పరిశోధకుల ప్రకారం, హింసకు పాల్పడేలా “టీవీ కార్యక్రమాలే తమను పురికొల్పినట్లు” ఆ నిందితుల్లో చాలామంది చెబుతున్నారు.—ద స్టార్‌, దక్షిణాఫ్రికా. (g 8/07)

హోటల్‌ గది తలుపు పిడులను, దీపాలను, ఫోన్లను, టీవీ రిమోట్‌ కంట్రోళ్ళను ముట్టుకునే హోటల్‌ అతిథులకు ‘జలుబు చేసే అవకాశం 50 శాతంవరకు ఉంటుంది.’—మాక్‌లేన్స్‌, కెనడా. (g 9/07)

మంచి స్నేహితులు, దీర్ఘాయుష్షుకు మూలం!

మంచి స్నేహితుల బృందం ఉంటే ఒక వ్యక్తి ఆయుష్షు పెరుగుతుందని జర్నల్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ అండ్‌ కమ్యూనిటీ హెల్త్‌ నివేదిస్తోంది. వయస్సు 70 ఏళ్లు లేదా అంతకన్నా పైబడిన దాదాపు 1,500 మంది ఆస్ట్రేలియన్లమీద జరిపిన ఒక అధ్యయనం, పదేళ్ల కాలంలో మానవ సంబంధాలు ధీర్ఘాయుష్షును ఎలా ప్రభావితం చేశాయో పరిశోధించింది. పటిష్ఠమైన స్నేహితుల బృందంవున్నవారి మరణాల రేటు కొద్దిమంది స్నేహితులే ఉన్నవారి మరణాల రేటుకన్నా 22 శాతం తక్కువగా ఉంది. “మానసిక కృంగుదల, స్వీయ కార్యసాధకత, స్వాభిమానం, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం, ఆత్మవిశ్వాసం, సొంత జీవితంమీద నియంత్రణ” వంటి అంశాల విషయంలో కూడా క్రియాశీలక స్నేహబంధాలు వృద్ధులమీద చక్కని ప్రభావం చూపిస్తున్నాయి” అని ఆ నివేదిక చెబుతోంది. (g 7/07)

ఇంధనంగా గోధుమలా?

గది ఉష్ణోగ్రతను పెంచేందుకు గోధుమలను కాల్చడం సరైనదేనా? ఒకప్రక్క గోధుమల ధర పడిపోతుంటే, మరోప్రక్క ఇంధనం ధర ఆకాశాన్నంటుకుంటోంది కాబట్టి, గది ఉష్ణోగ్రతను పెంచేందుకు గోధుమలను అమ్మి ఇంధనం కొనే బదులు, గోధుమలనే కాల్చడంవల్ల ఒక వ్యవసాయదారునికి ఎంతో డబ్బు ఆదా అవుతుందని ఫ్రాంక్‌ఫర్టర్‌ అల్జిమీనా సొన్టాగ్సిటుంగ్‌ అనే జర్మన్‌ వార్తాపత్రిక వివరిస్తోంది. రెండున్నర కిలోల గోధుమలను పండించడానికి వ్యవసాయదారునికి 20 సెంట్లు ఖర్చవుతుంది, అన్నే కిలోల ధాన్యాన్ని కాల్చడంవల్ల ఉత్పత్తయ్యే వేడిని ఉత్పత్తి చేయడానికి 60 సెంట్లు ఖరీదుచేసే ఒక లీటరు ఇంధనం అవసరమౌతుంది. ఆ వార్తాపత్రిక నివేదిక ప్రకారం, “ఓ ప్రక్క ఇతరులు ఆకలితో అలమటిస్తుంటే మరోప్రక్క ధాన్యాన్ని కాల్చడం” సబబేనా? అనే నైతిక సందిగ్ధావస్థ ఎదురౌతుంది. (g 8/07)

అమెజాన్‌ అడవుల్లో కీటకాలను లెక్కించడం

కీటక శాస్త్రజ్ఞులు అమెజాన్‌ వర్షారణ్యాల్లో ఇప్పటివరకు దాదాపు 60,000 కీటక జాతులను గుర్తించారు. ఫోల్యా ఆన్‌లైన్‌ పత్రిక ప్రకారం, ఇంకా సుమారు 1,80,000 కీటక జాతులను గుర్తించాల్సి ఉంది. ప్రస్తుతం 20 మంది కీటకశాస్త్రజ్ఞులు ఆ ప్రాంతంలో పనిచేస్తున్నారు. ఆ నిపుణులు, సగటున ఏడాదికి 2.7 కీటకజాతుల చొప్పున గుర్తించి, వాటి గుణాలను వివరిస్తున్నారని ఇటీవలి గణాంకాలు వెల్లడిచేస్తున్నాయి. ఈ లెక్కన పరిశోధనలు కొనసాగితే, ఆ అరణ్యంలోని కీటకాలన్నిటినీ గుర్తించడానికి 90 తరాల కీటకశాస్త్రజ్ఞులు 35 సంవత్సరాల చొప్పున పనిచేయాల్సివుంటుంది లేదా మొత్తం కలిసి దాదాపు 3,300 సంవత్సరాలు పనిచేయాల్సివుంటుంది! (g 9/07)

ఇంధనం, పేదరికం

“దాదాపు 160 కోట్ల మందికి అంటే మానవుల్లో దాదాపు 25 శాతం మందికి కరెంటు అందుబాటులోలేదు, 240 కోట్లమంది వంటలకు, గది ఉష్ణోగ్రత పెంచుకునేందుకు బొగ్గు, పేడ లేదా వంటచెరకులను ప్రధానంగా ఉపయోగిస్తున్నారు” అని ఐక్యరాజ్య సమితి పర్యావరణ పథకం ప్రచురించిన అవర్‌ ప్లానెట్‌ అనే పత్రిక తెలియజేస్తోంది. ఈ సాంప్రదాయ ఇంధనాల నుండి వెలువడే పొగ ప్రతీ ఏడాది దాదాపు ఐదు లక్షలమంది మహిళలను, పిల్లలను పొట్టనబెట్టుకుంటోంది.” (g 9/07)