కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ అధికారాన్ని ఉపయోగించండి

మీ అధికారాన్ని ఉపయోగించండి

చర్య 3

మీ అధికారాన్ని ఉపయోగించండి

ఈ చర్య ఎందుకు తీసుకోవాలి? “మరీ మెత్తగా లేదా మరీ కఠినంగా పెంచిన తల్లిదండ్రుల పిల్లలకన్నా, పిల్లలను ప్రేమతోనే అయినా తల్లిదండ్రులుగా తమ అధికారం చూపించిన అంటే పిల్లలకు నైతిక, భావోద్రేక మద్దతునిస్తూ అదే సమయంలో స్థిరమైన హద్దులు విధించిన తల్లిదండ్రులు పెంచిన పిల్లలు చదువుల్లో ముందున్నారని, చక్కని సామాజిక నైపుణ్యాలు వృద్ధిచేసుకున్నారని, ఆత్మవిశ్వాసంతోను, సంతోషంగాను ఉన్నారని” అధ్యయనాలు చూపిస్తున్నాయని పేరెంట్స్‌ పత్రిక చెబుతోంది.

అది ఎందుకు కష్టం? పిల్లలు, తమ బాల్యం నుండి యుక్తవయసు వచ్చేవరకు వారిపై అధికారం చూపే మీ హక్కును సవాలు చేస్తారు. “తల్లిదండ్రులు తమ అధికారం ఉపయోగించడానికి భయపడడాన్ని లేదా వారు ఊరకనే లొంగిపోవడాన్ని పిల్లలు సులభంగా గ్రహిస్తారు” అని పేరెంట్స్‌ పవర్‌ పుస్తక రచయిత జాన్‌ రోజ్‌మోండ్‌ రాస్తున్నాడు. “‘అధికారం ఎవరు చూపించాలి?’ అనే ప్రశ్న తలెత్తినప్పుడు, తల్లిదండ్రులు తమ అధికారాన్ని ఉపయోగించకపోతే పిల్లలు దాన్ని ఉపయోగించడం మొదలుపెడతారు” అని ఆయన అంటున్నాడు.

పరిష్కారం: మీరు మీ అధికారాన్ని ఉపయోగిస్తే మీ పిల్లలను దూరంచేసుకుంటారేమోనని లేదా వారిని కృంగదీస్తారేమోనని బాధపడకండి. కుటుంబ జీవితాన్ని ప్రారంభించిన యెహోవా దేవుడు, కుటుంబాన్ని ఎలా నడపాలనే విషయంలో పిల్లలకు సమాన అధికారం ఉండాలని ఉద్దేశించలేదు. బదులుగా, పిల్లలపై అధికారం చూపేందుకు ఆయన తల్లిదండ్రులను నియమించాడు, ఆయన పిల్లలకు ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు: “మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి.”—ఎఫెసీయులు 3:14, 15; 6:1-4.

కఠినంగా ఉండకుండానే మీరు మీ అధికారాన్ని ఉపయోగించవచ్చు. ఎలా? యెహోవా మాదిరిని అనుకరించడం ద్వారా. తన మానవ పిల్లలను తాను చెప్పినట్లు నడుచుకోమని బలవంతపెట్టే అధికారం ఆయనకుంది, అయినా ఆయన మనలో గమనించిన మెచ్చుకోదగిన లక్షణాలనుబట్టి తాను చెప్పినట్లు నడుచుకోమని మనల్ని కోరుతున్నాడు. “నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును” అని ఆయన వాక్యం చెబుతోంది. (యెషయా 48:18) యెహోవా అంటే మనకు అనుచిత భయమున్నందువల్ల కాదుకానీ, మనమాయనను ప్రేమిస్తున్నాం కాబట్టే తనకు విధేయులవ్వమని ఆయన కోరుతున్నాడు. (1 యోహాను 5:3) ఆయన సహేతుకమైనవాటినే మన నుండి కోరతాడు, తన నైతిక ప్రమాణాలను పాటిస్తే మనం ప్రయోజనం పొందుతామని ఆయనకు తెలుసు.—కీర్తన 19:7-11.

తల్లిదండ్రులుగా మీరు మీ అధికారాన్ని సరిగా ఉపయోగించేందుకు మీరెలా ధైర్యాన్ని కూడగొట్టుకోవచ్చు? మొదటిగా, దేవుడు దీనిని మీ నుండి కోరుతున్నాడని మీరు ఒప్పించబడాలి. రెండవదిగా, దేవుని నైతిక ప్రమాణాల ప్రకారంగా జీవించడం మీకు, మీ పిల్లలకు సర్వశ్రేష్ఠమని మీరు ఒప్పించబడాలి.—రోమీయులు 12:2.

మీరు మీ అధికారాన్ని ఉపయోగించాలంటే ప్రత్యేకంగా ఏమిచేయాలి? (g 8/07)

[5వ పేజీలోని బ్లర్బ్‌]

“నీ కుమారుని శిక్షించినయెడల అతడు . . . నీ మనస్సుకు ఆనందము కలుగజేయును.” —సామెతలు 29:17