మీ పిల్లల భావాలను తెలుసుకోండి
చర్య 6
మీ పిల్లల భావాలను తెలుసుకోండి
ఈ చర్య ఎందుకు తీసుకోవాలి? పిల్లలు తామెలా భావిస్తున్నారో తెలుసుకునేందుకు వారు కావాలనుకునే ప్రాముఖ్యమైనవారు, వారికి అవసరమైనవాళ్ళు వారి తల్లిదండ్రులే. పిల్లలు అలాంటి భావాలను వ్యక్తపర్చినప్పుడు తల్లిదండ్రులు ప్రతీసారి వారిని చులకనచేసి మాట్లాడితే, వారు తమ భావాలను వ్యక్తపర్చకపోవడమేకాక, సొంతగా గ్రహించే, ఆలోచించే తమ సామర్థ్యాన్ని కూడా శంకించవచ్చు.
అది ఎందుకు కష్టం? పిల్లలు తమ భావాలను, భావోద్రేకాలను అతిశయోక్తిగా మాట్లాడే అవకాశముంది. నిజమే, పిల్లలు చెప్పేది కొన్నిసార్లు తల్లిదండ్రులకు ఆందోళన కలిగించవచ్చు. ఉదారహణకు, నిరుత్సాహపడిన పిల్లవాడు “నాకు బ్రతకాలనిపించడం లేదు” * అని అనవచ్చు. దానికి తల్లిదండ్రులు వెంటనే “అలా మాట్లాడొద్దు!” అనవచ్చు. పిల్లవాని ప్రతికూల భావాలకు లేదా ఆలోచనలకు తల్లిదండ్రులు సరే అనడం, వారి ప్రతికూల భావాలను ఆమోదించడంతో సమానమని వారు ఆందోళన చెందవచ్చు.
పరిష్కారం: ‘వినుటకు వేగిరపడువారిగా, మాటలాడుటకు, కోపించుటకు నిదానించువారిగా’ ఉండండి అన్న బైబిలు సలహాను అన్వయించుకోండి. (యాకోబు 1:19) యెహోవా దేవుడు తన నమ్మకమైన సేవకుల్లో అనేకమంది ప్రతికూల భావాలను బైబిలులో నమోదు చేయించడం ద్వారా గుర్తించాడని గమనించండి. (ఆదికాండము 27:46; కీర్తన 73:12, 13) ఉదాహరణకు, యోబు ఎన్నో బాధలను అనుభవిస్తున్నప్పుడు, తనకు చనిపోవాలనుందని ఆయన అన్నాడు.—యోబు 14:13.
స్పష్టంగా, యోబు యొక్క కొన్ని ఆలోచనలను, భావాలను సరిదిద్దాల్సి వచ్చింది. అయినా, యెహోవా యోబు భావాలను నిరాకరించే బదులు లేదా ఆయనను మాట్లాడనివ్వకుండా ఉండడానికి బదులు, ఓపికగా యోబు తన హృదయాన్ని కుమ్మరించేందుకు అనుమతించడం ద్వారా యెహోవా ఆయనను గౌరవించాడు. ఆ తర్వాతే యెహోవా దయతో ఆయనను సరిదిద్దాడు. ఆ విషయాన్నే ఒక క్రైస్తవ తండ్రి ఇలా వ్యక్తపర్చాడు: “ప్రార్థనలో నా హృదయాన్ని కుమ్మరించేలా యెహోవా నాకు అవకాశమిస్తున్నాడు కాబట్టి, నా పిల్లలు తమ అనుకూల, ప్రతికూల భావాలను నాతో మనస్ఫూర్తిగా చెప్పుకునేందుకు నేను కూడా అవకాశమివ్వడం న్యాయమని నేను భావిస్తున్నాను.”
మరోసారి మీరు మీ పిల్లలతో “అలా మాట్లాడకు” లేదా “నువ్వలా అస్సలు ఆలోచించకూడదు” అని చెప్పాలని అనిపించినప్పుడు యేసు చెప్పిన ఈ ప్రఖ్యాత సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి: “మనుష్యులు మీకేలాగు చేయవలెనని మీరు కోరుదురో ఆలాగు మీరును వారికి చేయుడి.” (లూకా 6:31) ఉదాహరణకు, మీరు చేసిన ఒక తప్పువల్లే పనిస్థలంలో మీతో ఎవరైనా కఠినంగా వ్యవహరించినప్పుడు లేదా మీరు నిరుత్సాహానికి గురయ్యారని ఊహించుకోండి. మీరు ఆ ఉద్యోగం చేయలేకపోతున్నానని చెబుతూ, మీ సన్నిహిత స్నేహితునికి మీ బాధను చెప్పుకుంటారు. మీ స్నేహితుడు ఎలా స్పందిచాలని మీరు కోరుకుంటారు? వెంటనే మీ స్నేహితుడు, నువ్వలా బాధపడకూడదు, తప్పు నీవల్లే జరిగింది కదా అనాలని అనుకుంటారా? లేదా మీ స్నేహితుడు ఇలా చెప్పాలని కోరుకుంటారా: “అది నీకు చాలా కష్టంగా ఉండవచ్చు. బహుశా ఆ రోజు నువ్వు చాలా ఇబ్బందిపడి ఉంటావు?”
పిల్లలు అలాగే పెద్దలు తమకు సలహా ఇచ్చేవారు తమను, తాము ఎదుర్కొనే కష్టాలను నిజంగా అర్థంచేసుకుంటున్నారని తమకనిపిస్తే వారిచ్చే సలహాను స్వీకరించే అవకాశం ఉంది. “జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును” అని దేవుని వాక్యం చెబుతోంది.—సామెతలు 16:23.
మీరిచ్చే ఏ సలహానైనా గంభీరంగా తీసుకుంటున్నారని మీరెలా నిశ్చయతను కలిగివుండవచ్చు? (g 8/07)
[అధస్సూచి]
^ చనిపోవడం గురించి మాట్లాడే ఎలాంటి మాటలనైనా ఏ మాత్రం తేలికగా తీసుకోకండి.
[8వ పేజీలోని బ్లర్బ్]
“సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.”—సామెతలు 18:13