కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వాడబారని అందం

వాడబారని అందం

వాడబారని అందం

“అందం అదృశ్యమౌతుంది; అందచందం అంతరిస్తుంది,” అని వాల్టర్‌ డి లా మేర్‌ యనే కవి అన్నాడు. ఇక్కడ ఇవ్వబడిన అత్యంత అందమైన బ్రహ్మజెముడు పూవులకు ఇదే సంభవిస్తుంది. వాటి అందం అంతలోనే వాడిపోతుంది.

క్రైస్తవ శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “ఏలయనగా ఇతడు [ధనవంతుడు] గడ్డిపువ్వువలె గతించిపోవును. సూర్యుడుదయించి, వడగాలికొట్టి, గడ్డిని మాడ్చివేయగా దాని పువ్వురాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును; అలాగే ధనవంతుడును తన జీవన విధానములలో వాడిపోవును.”—యాకోబు 1:10, 11.

ఈ అనిశ్చయతా లోకంలో ఆస్తి రాత్రికి రాత్రే నిజానికి అదృశ్యం కావచ్చును. అంతేకాక ధనవంతుడు—ఇతరులవలెనే—‘పువ్వు వికసించినట్లు కొద్దిపాటి ఆయుస్సుగలవాడే.’ (యోబు 14:1, 2) ధనాన్ని సమకూర్చుకొని సుఖపడదామనే తలంపుతో ఆ పనిలో నిమగ్నమైయున్న యొక ధనవంతుని ఉపమానాన్ని గూర్చి యేసు చెప్పాడు. సుఖభోగాలకు కావలసినంత ధనాన్ని సమకూర్చుకున్నానని అతడను కొంటున్నప్పుడే మరణించాడు. యేసు ఇలా హెచ్చరించాడు: “దేవుని యెడల ధనవంతుడుకాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండును.”—లూకా 12:16-21.

“దేవునియెడల ధనవంతుడు.” అంటే ఆ మాటకు యేసు భావమేమిటి? ఇలా ధనవంతుడైన వ్యక్తి “పరలోకమందు ధనాన్ని”—దేవునితో మంచి పేరును కలిగి ఉంటాడు. అటువంటి ఆస్తి ఎన్నటికిని తరిగిపోదు. (మత్తయి 6:20; హెబ్రీయులు 6:10) వాడిపోవు పువ్వువలె నుండక అట్టివాడు బైబిలునందు వాడని చెట్టుకు పోల్చబడియున్నాడు. మరి “అతడు చేయునదంతయు సఫలమగును” అనే అభయం మనకున్నది.—కీర్తన 1:1-3, 6.