“ఒంటరియైన వాడు వేయిమంది” అయ్యారు
“ఒంటరియైన వాడు వేయిమంది” అయ్యారు
“వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును.”—యెషయా 60:22.
1, 2. (ఎ) నేడు ఎందుకని భూమిని చీకటి కమ్ముకున్నది? (బి) యెహోవా వెలుగు ఆయన ప్రజలపై క్రమంగా ఎలా ప్రకాశించింది?
“భూమిని చీకటి కమ్ముచున్నది, కటికచీకటి జనములను కమ్ముచున్నది; యెహోవా నీమీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీమీద కనబడుచున్నది.” (యెషయా 60:2) ఈ మాటలు 1919 నుంచి భూమిపైనున్న పరిస్థితిని చక్కగా వర్ణిస్తున్నాయి. క్రైస్తవ మతసామ్రాజ్యం “లోకమునకు వెలుగు” అయిన యేసుక్రీస్తు రాచరిక ప్రత్యక్షత సూచనను తిరస్కరించింది. (యోహాను 8:12; మత్తయి 24:3) “ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథుల,” నాయకుడైన సాతాను “బహు క్రోధము”తో ఉండటం మూలంగా ఈ 20వ శతాబ్దం, మానవ చరిత్రంతటిలో క్రూరమైన, అత్యంత వినాశనకరమైన కాలంగా పరిణమించింది. (ఎఫెసీయులు 6:12; ప్రకటన 12:12) అనేకమంది ప్రజలు ఆధ్యాత్మికంగా అంధకారంలో బ్రదుకుతున్నారు.
2 అయినప్పటికీ, నేడు వెలుగు ప్రకాశిస్తూనే ఉంది. యెహోవా తన అభిషిక్త శేషముపై అంటే, తన పరలోక ‘స్త్రీ’ యొక్క భూ ప్రతినిధులైన తన సేవకులపై ‘ఉదయిస్తున్నాడు.’ (యెషయా 60:1) ప్రత్యేకించి 1919 లో బబులోను సంబంధ చెరనుంచి తాము విడుదల పొందినప్పటినుంచి, వీరు దేవుని మహిమను ప్రతిఫలించి ‘మనుష్యుల ఎదుట తమ వెలుగును ప్రకాశింపజేస్తున్నారు.’ (మత్తయి 5:16) వీరు బబులోను సంబంధ ఆలోచనా విధానపు మిగిలివున్న బంధకాలను వదిలించుకుంటుండగా 1919 నుంచి 1931 వరకు రాజ్యపు వెలుగు అంతకంతకు తేజరిల్లింది. “ఇశ్రాయేలీయులలో శేషించినవారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొఱ్ఱెలు కూడునట్లు వారిని సమకూర్చుదును, తమ మేతస్థలములలో వారిని పోగుచేతును, గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుష్యులు విస్తారముగా కూడుదురు” అన్న తన వాగ్దానాన్ని యెహోవా నెరవేరుస్తుండగా వారు సంఖ్యాపరంగా ఎదుగుతూ వేలకొలదిగా తయారయ్యారు. (మీకా 2:12) వారు 1931 లో యెహోవాసాక్షులు అనే నామాన్ని స్వీకరించినప్పుడు, యెహోవా మహిమ ఆయన ప్రజలపై ఉందని మరెక్కువగా రుజువైంది.—యెషయా 43:10, 12.
3. యెహోవా వెలుగు అభిషిక్తులపై మాత్రమే కాకుండా ఇతరులపై కూడా ప్రకాశిస్తుందని ఎలా స్పష్టమైంది?
3 యెహోవా మహిమ ఉదయించేది కేవలం “చిన్నమంద”లోని లూకా 12:32) లేదు. సెప్టెంబరు 1, 1931 కావలికోట (ఆంగ్లం) సంచిక మరో గుంపును సూచించింది. అది, యెహెజ్కేలు 9:1-11 పై స్పష్టమైన వివరణనిస్తూ, ఆ వచనాల్లో ప్రస్తావించబడిన లేఖికుని సిరాబుడ్డి పట్టుకునివున్న వ్యక్తి అభిషిక్త శేషమును సూచిస్తాడని చూపించింది. ఆ ‘వ్యక్తి’ ఎవరి లలాటములపై గురుతు వేస్తున్నాడు? పరదైసు భూమిపై నిరంతరం జీవించే నిరీక్షణ గల “వేరే గొఱ్ఱెల”పై ఆయన గురుతు వేస్తున్నాడు. (యోహాను 10:16; కీర్తన 37:29) “వేరే గొఱ్ఱెలు” అనే ఈ గుంపు, అపొస్తలుడైన యోహాను దర్శనంలో చూసిన “ప్రతి జనములోనుండియు . . . [వచ్చిన] గొప్పసమూహము”గా 1935 లో గుర్తించబడ్డారు. (ప్రకటన 7:9-14) ఈ గొప్పసమూహాన్ని సమకూర్చే పనికి, 1935 నుంచి ఇప్పటి వరకు విశేషమైన శ్రద్ధనివ్వటం జరిగింది.
మిగిలి ఉన్న వారిపైనేనా? (4. యెషయా 60:3 లో ప్రస్తావించబడిన “రాజులు,” “జనములు” ఎవరు?
4 ఆ సమకూర్పుపని, ఇలా చెప్తున్న యెషయా ప్రవచనాన్ని సూచిస్తుంది: “జనములు నీ వెలుగునకు వచ్చెదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు.” (యెషయా 60:3) ఇక్కడ ప్రస్తావించబడిన “రాజులు” ఎవరు? పరలోక రాజ్యంలో యేసు క్రీస్తుతో పాటు సహవారసులుగా ఉండబోయే 1,44,000 మందిలో శేషించినవారు, వీరు సాక్ష్యపు పనిలో నాయకత్వం వహిస్తున్నారు. (రోమీయులు 8:17; ప్రకటన 12:17; 14:1) ఈనాడు, కొన్ని వేలమందిగానే ఉన్న అభిషిక్త శేషమును, భూ నిరీక్షణ కల్గి యెహోవాచే బోధించబడటానికి ఆయన వద్దకు వస్తూ అలాగే ఇతరులను కూడా రమ్మని ఆహ్వానిస్తున్న ‘జనములు’ సంఖ్యాపరంగా ఎంతగానో మించిపోయారు.—యెషయా 2:3.
ఉత్సాహవంతులైన యెహోవా సేవకులు
5. (ఎ) యెహోవా ప్రజల ఉత్సాహం చల్లబడిపోలేదని ఏ వాస్తవాలు చూపిస్తున్నాయి? (బి) 1999 లో ఏ దేశాల్లో విశిష్టమైన పెరుగుదలలు ఉన్నాయి? (17-20 పేజీల్లో ఉన్న చార్టును చూడండి.)
5 యెహోవా ఆధునిక-దిన సాక్షులు 20వ శతాబ్దమంతటిలోను ఎంతటి ఉత్సాహాన్ని చూపించారో గదా! ఒత్తిళ్లు పెరుగుతున్నప్పటికీ, 2000వ సంవత్సరం ప్రారంభమైనా, వారి ఉత్సాహం చల్లబడిపోలేదు. “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని యేసు ఇచ్చిన ఆజ్ఞను వారు ఇప్పటికీ గంభీరంగా తీసుకుంటున్నారు. (మత్తయి 28:19, 20) ఇరవయ్యో శతాబ్దపు చివరి సేవా సంవత్సరంలో, చురుగ్గావున్న సువార్త ప్రచారకుల సంఖ్య 59,12,492ను చేరుకుంది, అది ఒక క్రొత్త శిఖరాగ్ర సంఖ్య. వారు దేవుని గురించి, ఆయన సంకల్పాల గురించి ఇతరులతో మాట్లాడటంలో మొత్తం 114,45,66,849 గంటల్ని వెచ్చించారు. వారు ఆసక్తిగల 42,00,47,796 మందిని పునర్దర్శించారు, 44,33,884 గృహ బైబిలు పఠనాల్ని నిర్వహించారు. ఉత్సాహవంతమైన సేవ యొక్క ఎంత గమనార్హమైన నివేదిక!
6. పయినీర్ల కోసం ఏ క్రొత్త ఏర్పాటు చేయడమైనది, దానికి ప్రతిస్పందన ఎలా ఉంది?
6 గత జనవరిలో పరిపాలక సభ, పయినీర్లు సేవలో వెచ్చించ వలసిన గంటల్లో సవరింపును ప్రకటించింది. అనేకమంది క్రమ పయినీర్లుగా, సహాయ పయినీర్లుగా చేరటానికి దాన్ని అవకాశంగా తీసుకున్నారు. ఉదాహరణకు, 1999వ సంవత్సరపు మొదటి నాలుగు నెలల్లో, నెదర్లాండ్స్ బ్రాంచి ఆఫీసు, క్రితం సంవత్సరం అదే కాలంలో కన్నా నాలుగు రెట్లు అధికంగా క్రమ పయినీర్ల దరఖాస్తులను అందుకుంది. ఘానా ఇలా రిపోర్టు చేస్తుంది: “క్రొత్త పయినీరు గంటల లక్ష్యం అమల్లోకి రాగానే, క్రమ పయినీర్ల సంఖ్య ఒక్కసారిగా విజృంభించింది.” ప్రపంచవ్యాప్తంగా పయినీర్ల సంఖ్య, 1999 సేవా సంవత్సరంలో, 7,38,343ను చేరుకుంది—అది ‘సత్‌క్రియలయందాసక్తికి’ అద్భుతమైన నిదర్శనం.—తీతుకు 2:14.
7. యెహోవా తన సేవకుల ఉత్సాహవంతమైన కార్యకలాపాన్ని ఎలా ఆశీర్వదించాడు?
7 ఔత్సాహికులైన తన సేవకుల కార్యకలాపాల్ని యెహోవా ఆశీర్వదించాడా? నిశ్చయంగా. యెషయా ద్వారా ఆయనిలా అంటున్నాడు: “కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు; నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు.” (యెషయా 60:4) సమకూర్చబడిన అభిషిక్త “కుమారులు,” “కుమార్తెలు” ఇనుమడించిన ఉత్సాహంతో దేవుని సేవ చేస్తున్నారు. మరి ఇప్పుడు, 234 దేశాల్లోను ద్వీపాల్లోను, వేరే గొఱ్ఱెలు యెహోవా అభిషిక్త “కుమారులు,” “కుమార్తెల” పక్షానికి సమకూర్చబడుతున్నారు.
“ప్రతి సత్కార్యము”
8. యెహోవాసాక్షులు ఏ ‘సత్‌క్రియలు’ చేయడంలో చురుగ్గా ఉంటారు?
8 రాజ్య సువార్తను ప్రకటించి, ఆసక్తిగల ప్రజలు శిష్యులుగా తయారవటానికి సహాయం చేయాల్సిన బాధ్యత క్రైస్తవులకుంది. అయితే వారు “ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి” ఉంటారు. (ఇటాలిక్కులు మావి.) (2 తిమోతి 3:16) అందుకే, వారు తమ కుటుంబాలపట్ల ప్రేమపూర్వకంగా శ్రద్ధ తీసుకుంటారు, ఆతిథ్యం ఇస్తారు, రోగులను సందర్శిస్తారు. (1 తిమోతి 5:8; హెబ్రీయులు 13:16) అంతేగాక, స్వచ్ఛంద సేవకులు రాజ్యమందిరాల నిర్మాణం లాంటి ప్రాజెక్టుల్లోను పనిచేస్తారు, ఆ పని కూడా సాక్ష్యాన్నివ్వగలదు. టోగోలో, సహోదరులు ఒక రాజ్యమందిరాన్ని నిర్మించిన తర్వాత స్థానికంగా జనాదరణగల చర్చికి చెందిన బాధ్యతగల వ్యక్తులు వచ్చి, యెహోవాసాక్షులు ఎందుకు తామే సొంతంగా మందిరాలను కట్టుకోగల్గుతున్నారనేది తెలుసుకోడానికి ఇష్టపడ్డారు, ఇలాంటి వాటికి చర్చీలైతే కూలీలను పెట్టుకోవాల్సివస్తుంది మరి! మంచి నాణ్యతగల రాజ్యమందిరాల నిర్మాణం ఇరుగుపొరుగున ఎంత అనుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుందంటే, కొంతమంది ప్రజలు రాజ్యమందిరాలు నిర్మించబడబోయే ప్రాంతాల్లో ఇళ్లను అద్దెకు తీసుకోవడానికి లేక ఇళ్లను నిర్మించుకోవడానికి ఇష్టపడుతున్నారని టోగో నివేదిస్తుంది.
9. విపత్తులు సంభవించినప్పుడు యెహోవాసాక్షులు ఎలా ప్రతిస్పందించారు?
9 కొన్నిసార్లు, మరొక విధమైన సత్‌క్రియలు చేయవలసిన అవసరం ఉంటుంది. గత సేవా సంవత్సరంలో అనేక దేశాల్లో విపత్తులు సంభవించాయి, సహాయాన్ని అందజేయడానికి వచ్చినవారిలో మొట్టమొదటివారు తరచూ యెహోవాసాక్షులే. ఉదాహరణకు, హరికేన్ మిచ్ వచ్చినప్పుడు హోండూరాస్‌లోని చాలాభాగం నాశనమైంది. వెంటనే, సహాయ కార్యకలాపాలను సంస్థీకరించేందుకు బ్రాంచి అత్యవసర కమిటీలను ఏర్పాటు చేసింది. హోండురాస్‌లోని, మరితర దేశాల్లోని సాక్షులు ఆహారాన్ని, దుస్తులను, మందులను మరితర నిత్యావసర వస్తువుల్ని విరాళంగా ఇచ్చారు. రీజనల్ బిల్డింగ్ కమిటీలు ఇళ్లను పునర్నిర్మించడానికి తమ నైపుణ్యాలను ఉపయోగించారు. త్వరలోనే, విపత్తుకు గురైన మన సహోదరులు తమ అనుదిన కార్యక్రమాలను పునఃప్రారంభించేందుకు సహాయాన్ని అందుకున్నారు. ఈక్వెడార్‌లో, గొప్ప వరదలు కొన్ని ఇళ్లను నాశనం చేసినప్పుడు యెహోవాసాక్షులు తమ సహోదరులకు సహాయం చేయటానికి వచ్చారు. పరిస్థితితో వారు నైపుణ్యవంతంగా వ్యవహరించిన విధానాన్ని చూసిన తర్వాత, ఒక ప్రభుత్వ అధికారి ఇలా అన్నారు: “నేను గనుక ఈ గుంపును పనికి ఉపయోగించుకోగల్గితే, అద్భుతాలు చేయగలను! మీలాంటి ప్రజలు ప్రపంచ నలుమూలలా ఉండాలి.” అలాంటి సత్‌క్రియలు యెహోవా దేవునికి స్తుతిని కలుగజేసి, ‘అన్ని విషయములలో ప్రయోజనకరమైనదైన దైవభక్తికి’ నిదర్శనంగా ఉంటాయి.—1 తిమోతి 4:8.
వారు “మేఘమువలె” ఎగసివస్తారు
10. అభిషిక్తులైనవారి సంఖ్య తగ్గిపోతున్నప్పటికీ, యెహోవా నామము మునుపెన్నటికన్నా ఎక్కువగా ఎందుకు ప్రకటించబడుతూ ఉంది?
10 యెహోవా ఇప్పుడిలా అడుగుతున్నాడు: “మేఘమువలెను ఎగయు గువ్వలవలెను గూళ్లకు ఎగసి వచ్చు వీరెవరు? . . . నీ కుమారులను . . . తీసికొని వచ్చుటకు ద్వీపములు నాకొరకు కనిపెట్టుకొనుచున్నవి తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు.” (యెషయా 60:8-10) యెహోవా ‘ప్రకాశించే వెలుగుకు’ మొదట ప్రతిస్పందించేది ఆయన “కుమారులు,” అంటే అభిషిక్త క్రైస్తవులు. తర్వాత ప్రతిస్పందించేది “అన్యులు,” అంటే గొప్ప సమూహముకు చెందినవారు, వీరు తమ అభిషిక్త సహోదరులకు యథార్థంగా సేవ చేస్తూ, సువార్త ప్రకటనలో వారి నడిపింపును అనుసరిస్తారు. అలా, అభిషిక్తులైనవారి సంఖ్య తరిగి పోతున్నప్పటికీ, మునుపెన్నటికన్నా ఎక్కువగా యెహోవా నామము భూమ్యంతటా ప్రకటించబడుతూ ఉంది.
11. (ఎ) ఇప్పటికీ ఏది కొనసాగుతూనే ఉంది, 1999 లో దాని ఫలితం ఏమిటి? (బి) 1999 లో ఏ దేశాలు విశిష్టమైన బాప్తిస్మ సంఖ్యలను చూపిస్తున్నాయి? (17-20 పేజీల్లో ఉన్న చార్టును చూడండి.)
11 ఫలితంగా, ‘గువ్వలు గూళ్లకు ఎగసి’ వచ్చే రీతిలోనే, లక్షలాదిమంది ప్రవాహంలా వచ్చి క్రైస్తవ సంఘంలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాదిమంది వారితో కలుస్తున్నారు, ఇంకా అనేకులు రావడానికి ద్వారం తెరిచే ఉంది. యెషయా ఇలా అంటున్నాడు: “నీయొద్దకు జనముల భాగ్యము తేబడునట్లు . . . నీ ద్వారములు రాత్రింబగళ్లు వేయబడక నిత్యము తెరువబడి యుండును.” (యెషయా 60:11) గత సంవత్సరం 3,23,439 మంది యెహోవాకు తాముచేసుకున్న సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకున్నారు, అయినా ఆయన ఇంకా ద్వారములను మూయలేదు. “అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు” అంటే, గొప్ప సమూహం సభ్యులు ఇప్పటికీ వాటిగుండా గుంపుగా వస్తున్నారు. (హగ్గయి 2:7) అంధకారాన్ని విడిచి రావాలని కోరుకునేవారెవరూ వెనక్కు పంపివేయబడరు. (యోహాను 12:46) వెలుగుపట్ల వారికున్న ప్రశంసను అలాంటి వారందరు ఎన్నడూ కోల్పోకుందురు గాక!
నిర్భయంగా వ్యతిరేకతను ఎదుర్కోవటం
12. చీకటిని ప్రేమించేవారు వెలుగును రూపుమాపటానికి ఎలా ప్రయత్నించారు?
12 చీకటిని ప్రేమించేవారు యెహోవా వెలుగును ద్వేషిస్తారు. (యోహాను 3:19) కొందరు ఆ వెలుగును రూపుమాపాలని కూడా ప్రయత్నిస్తారు. అది ఎదురు చూడని విషయమేమీ కాదు. ‘ప్రతి మనుష్యుని వెలిగించే నిజమైన వెలుగైన’ యేసు కూడా అపహసించబడి, వ్యతిరేకించబడి, తన స్వదేశస్థులచే చివరికి చంపివేయబడ్డాడు. (యోహాను 1:9) 20వ శతాబ్దమంతటిలోనూ యెహోవాసాక్షులు కూడా యథార్థంగా యెహోవా వెలుగును ప్రతిఫలింపజేస్తుండగా అపహసించబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు, నిషేధించబడ్డారు, చివరికి చంపివేయబడ్డారు. ఇటీవలి సంవత్సరాల్లో, దేవుని వెలుగును ప్రతిఫలించేవారి గురించి, వ్యతిరేకులు సమాచార మాధ్యమాల ద్వారా అపప్రథలను వ్యాప్తి చేశారు. కొందరైతే యెహోవాసాక్షులు ప్రమాదకరమైన వారని, వారిపై ఆంక్షలు విధించాలని లేక వారిని నిషేధించాలని ప్రజలు నమ్మేలా చేయాలని ప్రయత్నిస్తున్నారు. అలాంటి వ్యతిరేకులు విజయం సాధించారా?
13. మన పని గురించి ప్రచార మాధ్యమాల్లో వాస్తవాల్ని జ్ఞానయుక్తంగా అందజేసిన ఫలితమేమిటి?
13 లేదు. తగిన సందర్భాల్లో, యెహోవాసాక్షులు మాధ్యమాల ద్వారా వాస్తవాలను వివరించారు. ఫలితంగా, యెహోవా నామము పేపర్లలో, పత్రికల్లో, రేడియోలో, టీవీలో విస్తృతంగా ప్రచారమైంది. అది ప్రకటనా పనికి మంచి ఫలితాలను తెచ్చింది. ఉదాహరణకు, డెన్మార్క్‌లో, జాతీయ టీవీ కార్యక్రమం ఒకటి, “డెన్మార్క్ దేశస్థుల విశ్వాసం ఎందుకు తగ్గిపోతుంది” అనే అంశంతో వ్యవహరించింది. ఇతర మతాల వారితోపాటు యెహోవాసాక్షులను కూడా ఇంటర్వ్యూ చేశారు. ఆ తర్వాత, ఆ కార్యక్రమాన్ని చూసిన ఒక మహిళ ఇలా వ్యాఖ్యానించింది: “దేవుని ఆత్మ ఎవరికుందన్నది స్పష్టంగా తెలిసిపోయింది.” ఆమెతో బైబిలు పఠనం ప్రారంభించబడింది.
14. వ్యతిరేకులు దుఃఖంతో త్వరలోనే దేన్ని గుర్తించవలసి ఉంటుంది?
14 ఈ లోకంలో అనేకులు తమను వ్యతిరేకిస్తారని యెహోవాసాక్షులకు తెలుసు. (యోహాను 17:14) అయినప్పటికీ, వారు యెషయా ప్రవచనంతో బలపర్చబడ్డారు: “నిన్ను బాధించినవారి సంతానపువారు నీ యెదుటికి వచ్చి సాగిలపడెదరు నిన్ను తృణీకరించినవారందరు వచ్చి నీ పాదములమీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు.” (యెషయా 60:14) తాము దేవునికే వ్యతిరేకంగా పోరాడుతున్నామని వ్యతిరేకులు త్వరలోనే దుఃఖంతో గుర్తించవలసి ఉంటుంది. అలాంటి యుద్ధంలో ఎవరు మాత్రం విజయం సాధించగలరు?
15. యెహోవాసాక్షులు ఎలా ‘జనముల పాలు కుడుస్తారు,’ వారి బోధనా పనిలోను, సువార్త ప్రకటన పనిలోను ఇది ఎలా ప్రతిఫలిస్తోంది?
15 యెహోవా ఇంకా ఇలా వాగ్దానం చేస్తున్నాడు: “నిన్ను శాశ్వత శోభాతిశయముగా . . . చేసెదను. యెహోవానగు నేను నీ రక్షకుడనని . . . నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు.” (యెషయా 60:15, 16) అవును, యెహోవా తన ప్రజలకు రక్షకుడు. వారు ఆయనపై ఆధారపడితే వారు ‘శాశ్వతంగా’ నిలిచి ఉంటారు. సత్యారాధనను పెంపొందింపజేయటానికి అందుబాటులో ఉన్న ఆయా వనరులను ఉపయోగించుకుంటూ వారు ‘జనముల పాలు కుడుస్తారు.’ ఉదాహరణకు, కంప్యూటర్లు, సాంకేతిక సమాచార సదుపాయాల జ్ఞానయుక్త ఉపయోగం కావలికోట 121 భాషల్లోనూ, తేజరిల్లు! 62 భాషల్లోనూ ఏకకాలంలో ప్రచురించడాన్ని సాధ్యం చేస్తోంది. న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్‌ను కొత్త భాషల్లోకి అనువదించటానికి సహాయపడేందుకు ఒక ప్రత్యేకమైన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ రూపొందించబడింది, అలాంటి అనువాదం ఎంతో ఆనందాన్ని కల్గిస్తుంది. క్రొయేషియా భాషలో క్రైస్తవ గ్రీకు లేఖనాల అనువాదం 1999 లో విడుదలైనప్పుడు అనేక వేలమంది ఆనందబాష్పాలు రాల్చారు. ఒక వృద్ధ సహోదరుడు ఇలా అన్నాడు: “ఎంతో కాలం నుంచి నేను ఈ బైబిలు కోసం ఎదురు చూస్తున్నాను. ఇక ఇప్పుడు ప్రశాంతంగా కన్నుమూస్తాను!” న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్ పంపిణీ మొత్తంగా గానీ భాగాలుగా గానీ 34 భాషల్లో 10 కోట్లను దాటిపోయింది.
ఉన్నతమైన నైతిక ప్రమాణాలు
16, 17. (ఎ) కష్టమైనప్పటికీ యెహోవా ఉన్నత ప్రమాణాలను అనుసరించడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) యౌవనులు లోకం నుంచి మలినం కాకుండా ఉండగలరని ఏ అనుభవం చూపిస్తోంది?
16 యేసు ఇలా అన్నాడు: “దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును.” (యోహాను 3:20) మరోవైపు, వెలుగులో నిలిచి ఉండేవారు యెహోవా ఉన్నత ప్రమాణాలను ప్రేమిస్తారు. యెషయా ద్వారా యెహోవా ఇలా అంటున్నాడు: “నీ జనులందరు నీతిమంతులై యుందురు.” (యెషయా 60:21ఎ) లైంగిక అవినీతికి, అసత్యాలకు, అత్యాశా అహంకారాలకు ఆలవాలమైన ఈ లోకంలో నీతియుక్త ప్రమాణాలను కాపాడుకోవటం సవాలుదాయకంగా ఉండగలదు. ఉదాహరణకు, కొన్ని దేశాల్లో, ఆర్థిక వ్యవస్థలు వర్ధిల్లుతున్నాయి, ధనసంపాదనే ఏకైక లక్ష్యంగా ఉండే జీవితవిధానంలో పడిపోయేలా తప్పుదారి పట్టడం చాలా సులభం. అయితే, పౌలు ఇలా హెచ్చరించాడు: “ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.” (1 తిమోతి 6:9) క్రైస్తవ సహవాసం, పవిత్రమైన పరిచర్య, నైతిక సూత్రాలు, కుటుంబ బాధ్యతలు వంటి నిజంగా అవశ్యమైన వాటిని పరిత్యజించేంతగా ఎవరైనా వ్యాపార విషయాల్లో పూర్తిగా మునిగిపోవడం ఎంత శోచనీయమో గదా!
17 తమ తోటివారు అనేకులు మత్తుమందుల దుర్వినియోగంలోనూ అనైతిక విషయాల్లోనూ ఇమిడివున్నప్పుడు, నీతియుక్తమైన ప్రమాణాలను అనుసరించటం ప్రత్యేకించి యువతకు కష్టంగా అపొస్తలుల కార్యములు 15:28, 29) సరైనది చేయటానికి స్థిరంగా నిలబడే, తమ మధ్యనున్న యౌవనులను బట్టి యెహోవాసాక్షులు ఎంతో గర్వపడతారు. వారి విశ్వాసం, వారి తల్లిదండ్రుల విశ్వాసం యెహోవా దేవుని నామానికి “మహిమ”ను తెస్తాయి.—యెషయా 60:21.
ఉంటుంది. సురినామ్‌లో 14 ఏండ్ల అమ్మాయిని వాళ్ల స్కూల్లో కాస్త అందగాడే అయిన ఒక అబ్బాయి తనతో లైంగిక సంబంధానికి వస్తావా అన్నాడు. వివాహానికి వెలుపల అలాంటి సంబంధాలను బైబిలు నిషేధిస్తుందని వివరిస్తూ ఆమె తిరస్కరించింది. స్కూల్లోని ఇతర అమ్మాయిలు ఆమెను అపహసించి, ప్రతి ఒక్కరూ ఆ అబ్బాయితో లైంగిక సంబంధం పెట్టుకోవటానికి తహతహలాడుతుంటారని చెబుతూ ఆమె మనస్సును మార్చటానికి శతవిధాల ప్రయత్నించారు. అయినా ఆ అమ్మాయి గట్టిగా నిలబడింది. కొన్ని వారాల తర్వాత, ఆ అబ్బాయికి హెచ్‌ఐవి పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణై ఎంతో జబ్బుపడ్డాడు. “జారత్వమును విసర్జింపవలెను” అని యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు తాను లోబడగల్గినందుకు ఆ అమ్మాయి ఎంతో సంతోషించింది. (యెహోవా అభివృద్ధిపర్చాడు
18. (ఎ) యెహోవా తన ప్రజల కోసం ఏ గొప్పకార్యాన్ని చేశాడు? (బి) పెరుగుదల కొనసాగుతుందనటానికి ఏ నిదర్శనం ఉంది, వెలుగులో నిలిచి ఉండేవారి కోసం ఏ మహిమాన్విత ఉత్తరాపేక్షలు వేచి ఉన్నాయి?
18 అవును, యెహోవా తన ప్రజలను ఆశీర్వదించి, వారికి నడిపింపునిచ్చి, వారిని బలపర్చి వారిపై వెలుగును ప్రసరింపజేస్తాడు. 20వ శతాబ్దంలో, యెషయా పలికిన ఈ మాటల నెరవేర్పును వాళ్లు చూశారు: “వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును, ఎన్నికలేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.” (యెషయా 60:22) పూర్వం 1919 లో స్వల్పసంఖ్యగా ఉన్న “ఒంటరియైన” వారు “వేయిమంది” కంటే ఎక్కువయ్యారు. మరి ఆ పెరుగుదల ఇంకా పూర్తి కాలేదు! పోయిన సంవత్సరం 1,40,88,751 మంది యేసు మరణ జ్ఞాపకార్థ దిన ఆచరణకు హాజరయ్యారు. అందులో అనేకులు సాక్ష్యమిచ్చే పనిలో చురుగ్గా లేరు. ఆ ప్రాముఖ్యమైన ఆచరణకు వారు హాజరైనందుకు మనం ఎంతో ఆనందిస్తాం, ఇకపై కూడా వారు అలాగే వెలుగు వైపుకు నడుస్తూ ఉండాలని మనం వారిని ఆహ్వానిస్తాము. యెహోవా ఇప్పటికీ తన ప్రజలపై వెలుగును ప్రసరింపజేస్తూనే ఉన్నాడు. ఆయన సంస్థకు ద్వారము ఇంకా తెరువబడే ఉంది. కనుక, అందరం యెహోవా వెలుగులో నిలిచివుండాలని నిశ్చయించుకొందము గాక. అది ఇప్పుడు మనకు ఎంతటి ఆశీర్వాదాలను తెస్తుందో గదా! సమస్త సృష్టి యెహోవాను స్తుతిస్తూ ఆయన దివ్యమైన మహిమనందు ఆనందించేటప్పుడు భవిష్యత్తులో అది ఎంతటి సంతోషాన్ని తీసుకువస్తుందో గదా!—ప్రకటన 5:13, 14.
మీరు వివరించగలరా?
• ఈ చివరి దినాల్లో ఎవరు యెహోవా వెలుగును ప్రతిఫలిస్తున్నారు?
• యెహోవా ప్రజల ఉత్సాహం చల్లబడిపోలేదని ఏది సూచిస్తోంది?
• యెహోవాసాక్షులు చేస్తున్న కొన్ని సత్‌క్రియలు ఏవి?
• తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ మనం దేని గురించి నమ్మకం కల్గివున్నాము?
[అధ్యయన ప్రశ్నలు]
[17-20వ పేజీలోని చార్టు]
ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 1999 సేవా సంవత్సరపు నివేదిక
(For fully formatted text, see publication.)
[15వ పేజీలోని చిత్రాలు]
యెహోవా సంస్థలోకి ప్రజలు ఇంకా సమకూడుతున్నారు
[16వ పేజీలోని చిత్రం]
వెలుగును ప్రేమించేవారికోసం యెహోవా ద్వారమును విశాలంగా తెరిచే ఉంచినందుకు మనం సంతోషిస్తాము