తీసిన ఉంగరాల్ని అది మళ్లీ వారి వ్రేళ్లకు తొడిగించింది
తీసిన ఉంగరాల్ని అది మళ్లీ వారి వ్రేళ్లకు తొడిగించింది
“నా వ్రేళ్లను చూడండి. ఏమన్నా తేడా చూస్తున్నారా?” అని ఒకాయన ఒక యెహోవాసాక్షికి తన చేతిని చూపించినప్పుడు ఆమె అతని చేతికి మునుపు ఉన్న కల్యాణపు ఉంగరం ఇప్పుడు లేదని గమనించింది. తనూ తన భార్య ఇక కలిసివుండలేక విడాకులు తీసుకుందామనే నిర్ణయానికి వచ్చామని వివరించాడు. “వద్దు!” అని ఆ సాక్షి చెప్పింది. “ఈ పుస్తకాన్ని తీసుకుని చదవండి. మీ వివాహ జీవితానికి ఇది సహాయం చేస్తుంది.” అలా చెబుతూ ఆమె నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే బైబిలు ఆధారిత పుస్తకాన్ని అతనికి ఇచ్చింది. *
కొన్నాళ్ల తర్వాత ఆయన ఆ సాక్షి దగ్గరకు ఆనందంగా వచ్చాడు. ఆయన ఆమెకు తన చేతిని చూపించాడు. ఈసారి ఆయన తన కల్యాణపు ఉంగరాన్ని ధరించాడు. ఆ జ్ఞానము పుస్తకాన్ని ఆయనా ఆయన భార్యా చదివారనీ, ఇప్పుడు తామెంతో సంతోషంగా ఉన్నామనీ చెప్పాడు. ఆ పుస్తకం, తీసిన వారి ఉంగరాల్ని అక్షరార్థంగా మళ్లీ వ్రేళ్లకు తొడిగించింది.
భార్యాభర్తలు అన్యోన్యమైన ప్రేమను చూపించుకునేలా బైబిలు ఉపదేశం సహాయం చేయగలదు. అది నిజం, ఎందుకంటే బైబిలు గ్రంథకర్త మన సృష్టికర్తే. ఆయన ఇలా చెప్తున్నాడు: “నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.”—యెషయా 48:17.
[అధస్సూచీలు]
^ పేరా 1 వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది.