కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మానవజాతికి ఒక సహాయకుడు ఎందుకు అవసరం

మానవజాతికి ఒక సహాయకుడు ఎందుకు అవసరం

మానవజాతికి ఒక సహాయకుడు ఎందుకు అవసరం

‘పూర్వము హానికరుడను దూషకుడను’ అని ఒకప్పుడు అహంకారియు హింసకుడును అయిన ఒక వ్యక్తి స్వయంగా ఒప్పుకుంటున్నాడు. దైవభయంగల యేసుక్రీస్తు అనుచరులను ఆయన విపరీతంగా దూషించేవాడు, శిలా హృదయుడిలా వాళ్ళను హింసించేవాడు, చివరికి చంపేవాడు కూడా. అయినప్పటికీ, “కనికరింపబడితిని” అని కృతజ్ఞతాభావంతో ఆయన అంటున్నాడు. ఇంత ఉగ్ర హింసకుడైన ఈ మనిషే తర్వాత నమ్మకస్థుడైన క్రైస్తవ అపొస్తలుడైన పౌలుగా మారాడు అని అంటే నమ్మలేమని అనిపించవచ్చేమో కానీ అదే జరిగింది.—1 తిమోతి 1:12-16; అపొస్తలుల కార్యములు 9:1-19.

పౌలు చేసినటువంటి పనులనే అందరూ చేసి ఉండరు. కానీ, దేవుని ప్రమాణాలను చేరుకోవడంలో మనమందరమూ విఫలులౌతుంటాం. ఎందుకని? “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక”పోవడమే దానికి కారణం. (రోమీయులు 3:23) దేవుని కరుణను పొందలేనంత చెడ్డవాళ్ళమని అనుకుంటూ నిరాశతో కుమిలిపోవడం చాలా సులభం. తన పాపభరితమైన మానసిక వైఖరిని గురించి తలపోస్తూ, “అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?” అని పౌలు తానే ఆశ్చర్యపోతూ ప్రశ్నిస్తున్నాడు. ఆయన తన ప్రశ్నకు తానే జవాబిచ్చుకుంటూ, “మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను” అని వ్రాశాడు.—రోమీయులు 7:24, 25.

నీతిమంతుడైన సృష్టికర్త, పాపులతో ఎలా వ్యవహారాలు కలిగివుండగలడు? (కీర్తన 5:4) ఎలాగో చూద్దాం. “మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను” అని పౌలు అన్న మాటలను గమనించండి. (ఇటాలిక్కులు మావి.) “ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది [“సహాయకుడు,” NW] తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై [“శాంతికరమైన బలియై,” NW] యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు, సర్వలోకమునకును శాంతికరమైయున్నాడు” [“శాంతికరమైన బలియైయున్నాడు,” NW]” అని దేవుని కరుణను పొందిన మరొక వ్యక్తి వివరించాడు.—1 యోహాను 2:1, 2.

యేసుక్రీస్తు, ‘తండ్రియొద్ద ఉన్న సహాయకుడు’ అని ఎందుకు పిలువబడ్డాడు? యేసు మన పాపములకు “శాంతికరమైన బలి” ఎలా అయ్యాడు?

ఒక సహాయకుడు ఎందుకు అవసరమయ్యాడు

“అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు” యేసు భూమి మీదకు వచ్చాడు. (మత్తయి 20:28) విమోచన క్రయధనము అంటే తిరిగి కొనుక్కునేందుకు లేదా తిరిగి తీసుకువచ్చేందుకు, ఎవరినైనా లేక దేనినైనా విడిపించేందుకు చెల్లించే మూల్యము. “విమోచన క్రయధనము” అనే మాటకు హెబ్రీలో ఉపయోగించబడిన క్రియారూపానికి పాపాలను పరిహరించడం లేదా ప్రాయశ్చిత్తం చేయడం అనే అర్థాలున్నాయి. (కీర్తన 78:38) మత్తయి 20:28 లో ఉపయోగించబడిన గ్రీకు పదం, యుద్ధంలో చెరగా తీసుకోబడినవారిని తిరిగి తీసుకువచ్చేందుకు లేదా దాసులను విడిపించేందుకు చెల్లించే క్రయధనాన్ని సూచిస్తుంది. న్యాయం జరగాలంటే, కోల్పోయిన దానికి సమానమైన దాన్ని ఇవ్వాలి.

దేవునికి వ్యతిరేకంగా మొదటి మానవుడు చేసిన తిరుగుబాటు మూలంగా, మానవజాతి దాసత్వం క్రిందకు వచ్చింది. ఆదికాండము 3వ అధ్యాయం చూపిస్తున్నట్లు, పరిపూర్ణ మానవుడైన ఆదాము, యెహోవా దేవునికి అవిధేయత చూపడాన్ని ఎన్నుకున్నాడు. అలా చేయడం ద్వారా, ఆయన తనను తానూ అలాగే తనకు అప్పటికింకా జన్మించని తన పిల్లలనూ పాప మరణాల దాసత్వానికి అమ్మివేశాడు. తనూ, తన సంతానమూ పరిపూర్ణ మానవ జీవం అనే బహుమానాన్ని కోల్పోయేలా చేశాడు.—రోమీయులు 5:12, 18, 19; 7:14.

ప్రాచీన ఇశ్రాయేలు జనాంగంలోని ప్రజలు చేసే పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేందుకుగాను లేదా పాపాలను పరిహరించేందుకుగాను జంతు బలులను ఇచ్చే ఏర్పాటును దేవుడు చేశాడు. (లేవీయకాండము 1:4; 4:20, 35) తత్ఫలితంగా, పాపం చేసే వాని ప్రాణానికి మారుగా జంతువుల ప్రాణం బలిగా అర్పించబడేది. (లేవీయకాండము 17:11) కనుక, “ప్రాయశ్చిత్తార్థ దినము”ను “విమోచన క్రయధనముల దినము” అని కూడా అనవచ్చు.—లేవీయకాండము 23:26-28.

అయితే, జంతువులు మానవులకన్నా తక్కువైనవి కనుక, “ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను [సంపూర్ణముగా] తీసివేయుట అసాధ్యము.” (హెబ్రీయులు 10:1-4) అర్పించబడే ఒక బలికి శాశ్వతంగా పాపాలకు ప్రాయశ్చిత్తం చేయగల లేదా పాపాలను తీసివేయగల మూల్యం ఉండాలంటే అది ఆదాము కోల్పోయిన దానికి సమానమైన మూల్యం గలదై ఉండాలి. న్యాయపు త్రాసుప్రకారం ఒక పరిపూర్ణ మానవుడు (ఆదాము) కోల్పోయిన దాన్ని పూరించేందుకు మరొక పరిపూర్ణ మానవుడు (యేసుక్రీస్తు) అవసరమయ్యాడు. ఆదాము తన సంతానాన్ని పాపమరణాల దాసత్వానికి అమ్మివేశాడు కనుక, ఆ పిల్లలను విడిపించాలంటే, ఆదాము కోల్పోయిన దానికి సమానమైన ఒక పరిపూర్ణ మానవ ప్రాణం మాత్రమే విమోచన క్రయధనం కాగలదు. నిజమైన న్యాయం జరిగేందుకు ‘ప్రాణమునకు ప్రాణము’ అవసరము.—నిర్గమకాండము 21:23-25.

ఆదాముకు పిల్లలకు జన్మనిచ్చే సామర్థ్యం ఉండింది. కానీ పిల్లలకు జన్మనివ్వక ముందే, ఆదాము పాపం చేయడం వల్ల, ఆయనకు మరణశిక్ష విధించబడినప్పుడు, ఆయనకు అప్పటికింకా జన్మించని పిల్లలకు కూడా మరణశిక్ష విధించబడినట్లయ్యింది. అలా అప్పటికీ జన్మించని పిల్లలు కూడా ఆయనతోపాటే చనిపోయినట్లయ్యింది. మరొకవైపు, “కడపటి ఆదాము” అయిన పరిపూర్ణుడైన యేసుకు కూడా పిల్లలకు జన్మనిచ్చే సామర్థ్యమున్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోలేదు. ఆయన ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకోకుండా పిల్లలకు జన్మనివ్వకుండా ఉన్నాడు. (1 కొరింథీయులు 15:45) బదులుగా, మానవుల కోసం చనిపోయి, పరిపూర్ణమైన మానవ విమోచన క్రయధనాన్ని ఇచ్చాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయనలో నుండి రాగల భావి వంశం కూడా ఆయనతో పాటు చనిపోయారని చెప్పవచ్చు. ఆదాము యొక్క పాపభరితమైన, చనిపోయే కుటుంబాన్ని యేసు తన సొంత కుటుంబంగా తీసుకున్నాడు. తను సొంత కుటుంబాన్ని కలిగివుండే తన హక్కును వదులుకున్నాడు. తన పరిపూర్ణ మానవ జీవితాన్ని బలిగా ఇస్తూ, ఆదాము నుండి వచ్చినవారినందరినీ తిరిగి కొన్నాడు, అలా వాళ్ళు ఆయన కుటుంబం అవ్వగల్గారు, ఆయన వాళ్ళ “నిత్యుడగు తండ్రి” అయ్యాడు.—యెషయా 9:6, 7.

యేసు చెల్లించిన విమోచన క్రయధనం, విధేయతగల మానవులు దేవుని కరుణనూ నిత్యజీవాన్నీ పొందే మార్గాన్ని తెరిచింది. అందువల్లే, అపొస్తలుడైన పౌలు, “పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము” అని వ్రాశాడు. (రోమీయులు 6:23) విమోచన క్రయధనాన్నివ్వడానికి, యెహోవా, ఆయన ప్రియాతిప్రియమైన కుమారుడైన యేసూ ఎంతో సహించుకోవలసి ఉండింది. అయినప్పటికీ దానికి వెనుకాడక, యెహోవా చూపించిన ప్రేమను బట్టి, సానుభూతిని బట్టి మనం యెహోవాను స్తుతించకుండా ఉండలేము. (యోహాను 3:16) యేసు పరలోక జీవితానికి పునరుత్థానం చేయబడిన తరువాత, విమోచన క్రయధన మూల్యాన్ని పరలోకంలో దేవునికి సమర్పించుకున్నాడు. అలా, తను ‘తండ్రి దగ్గర మనకున్న సహాయకుడు’ అని నిరూపించుకున్నాడు. * (హెబ్రీయులు 9:11, 12, 24; 1 పేతురు 3:18) యేసుక్రీస్తు ఇప్పుడు పరలోకంలో మన సహాయకుడుగా ఉన్నాడని ఎలా రుజువు చేస్తున్నాడు?

[అధస్సూచీలు]

^ పేరా 12 వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకం 4, 7 అధ్యాయాలను చూడండి.

[4వ పేజీలోని చిత్రం]

యేసు యొక్క పరిపూర్ణ మానవ ప్రాణం, ఆదాము సంతతివారికి విమోచన క్రయధనమయ్యింది