కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒక ప్రత్యేక సందర్భం—మీరు అక్కడ ఉంటారా?

ఒక ప్రత్యేక సందర్భం—మీరు అక్కడ ఉంటారా?

ఒక ప్రత్యేక సందర్భం—మీరు అక్కడ ఉంటారా?

ఒక స్మృతిదాయక దినాన, 3,500 ఏళ్ల క్రితం, ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయుల ప్రతి కుటుంబం ఒక గొర్రెపిల్లను గానీ మేకపిల్లను గానీ చంపి దాని రక్తాన్ని ద్వారబంధపు పైకమ్మీమీదను రెండు నిలువు కమ్మీలమీదను చల్లమని యెహోవా దేవుడు చెప్పాడు. అదే రాత్రి, దేవదూత ఆ విధంగా గుర్తు వేయబడిన ఇండ్ల మీదుగా దాటి వెళ్లాడు కానీ ఐగుప్తీయుల ఇండ్లలోని తొలిపిల్లలనందరినీ హతమార్చాడు. తర్వాత ఇశ్రాయేలీయులందరూ స్వతంత్రులు చేయబడ్డారు. ఆ సంఘటన వార్షిక జ్ఞాపికగా యూదులు పస్కాను జరుపుకుంటారు.

తన చివరి పస్కాను అపొస్తలులతో జరుపుకున్న వెంటనే యేసు, తన త్యాగపూరిత మరణ జ్ఞాపకార్థమై ఒక భోజనాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన పులియని రొట్టెను తన అపొస్తలులకు ఇచ్చి ఇలా అన్నాడు: “మీరు తీసికొని తినుడి; ఇది నా శరీర[ము].” తర్వాత ఒక గిన్నెడు ద్రాక్షారసం ఇచ్చి ఇలా అన్నాడు: “దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.” యేసు ఇంకా ఇలా అన్నాడు: “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయు[డి].” (మత్తయి 26:26-28; లూకా 22:19, 20) అలా తన అనుచరులు తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలని యేసు ఆజ్ఞాపించాడు.

ఈ సంవత్సరం యేసు మరణ వార్షిక జ్ఞాపకార్థదినం బుధవారం, ఏప్రిల్‌ 19, సూర్యాస్తమయం తర్వాత ప్రారంభమౌతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు యేసు చెప్పినట్లుగా ఈ జ్ఞాపకార్థ దినాన్ని ఆచరించటానికి ఆ ప్రత్యేక రాత్రి సమకూడుతారు. దాన్ని మాతో పాటు గమనించటానికి మిమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నాము. ఆ కూటం జరిగే నిర్దిష్టమైన స్థలమూ సమయం కోసం స్థానిక యెహోవాసాక్షులను సంప్రదించండి.