కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ఖరీదైన తైలముతో యేసు అభిషేకించబడినప్పటి ఆక్షేపణను మూడు సువార్తలు చెబుతున్నాయి. అపొస్తలులలో అనేకులు ఆక్షేపించారా, లేక అది యూదా మాత్రమేనా?

ఈ సంఘటనను మనం మత్తయి, మార్కు, యోహానులు వ్రాసిన సువార్తలలో చూస్తాము. ఈ ఆక్షేపణలో యూదా నాయకత్వం తీసుకున్నట్లు కనిపిస్తుంది, కనీసం కొందరు అపొస్తలులు ఆయనతో ఏకీభవించి ఉంటారు. నాలుగు సువార్తలు ఉన్నందుకు మనం ఎందుకు కృతజ్ఞులమై ఉండాలో ఈ సంఘటన ఉదహరిస్తోంది. ప్రతి రచయిత ఖచ్చితంగానే రచించారు, కానీ అందరూ అవే వివరాలను చెప్పలేదు. సమాంతర వృత్తాంతాలను పోల్చటం ద్వారా, అనేక సంఘటనల సమగ్రమైన, మరింత విశదమైన వీక్షణాన్ని మనం పొందవచ్చు.

మత్తయి 26:6-13లోని వృత్తాంతం స్థలాన్ని—బేతనియలోని కుష్ఠరోగి ఇల్లు—ఇస్తుంది, కానీ యేసు తలమీద పరిమళ తైలాన్ని పోసిన స్త్రీ పేరును చెప్పటం లేదు. మత్తయి ఇలా చెప్పాడు: “శిష్యులు చూచి కోపపడి” ఆ అత్తరును గొప్ప వెలకు అమ్మి బీదలకియ్యవచ్చునే అని అన్నారు.—ఇటాలిక్కులు మావి.

మార్కు వృత్తాంతం ఆ వివరాలన్నింటినీ ఇస్తుంది. కానీ ఆమె అత్తరుబుడ్డిని పగులగొట్టిందని ఆయన కలుపుతున్నాడు. అందులో బహుశ ఇండియానుంచి తెప్పించబడిన “అచ్చ జటామాంసి” అయిన పరిమళ తైలం ఉంది. ఆక్షేపణ చేసినట్లుగా, మార్కు నివేదిస్తున్నట్లు “కొందరు కోపపడి,” “ఆమెనుగూర్చి సణుగుకొనిరి.” (ఇటాలిక్కులు మావి.) (మార్కు 14:3-9) కాబట్టి రెండు వృత్తాంతాలు ఒక అపొస్తలుని కంటే ఎక్కువమందే ఆ ఆక్షేపణ చేయడంలో ఉన్నారని చూపిస్తున్నాయి. అయితే అది ఎలా మొదలైంది?

ప్రత్యక్ష సాక్షి అయిన యోహాను, యుక్తమైన వివరాలను ఇస్తున్నాడు. ఆయన ఆ స్త్రీ పేరు చెప్తున్నాడు. ఆమె—లాజరు, మార్తల సహోదరి అయిన మరియ. విరుద్ధంగా ఉన్నాయని ఎంచే బదులు వివరాలుగా తీసుకోదగిన దీన్ని యోహాను అందిస్తున్నాడు: “[ఆమె] యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను.” (ఇటాలిక్కులు మావి.) వృత్తాంతాలన్నీ కలుపగా, యోహాను “అచ్చ జటామాంసి” అని నిర్ధారిస్తున్న తైలాన్ని యేసు తలమీదను పాదముల మీదను మరియ పోసింది అని మనం చూడగలం. యోహాను యేసుకు అత్యంత సన్నిహితుడు, ఆయనపట్ల అనుచితమైనదేది జరిగినా ఆయనకు ఆగ్రహం కల్గుతుంది. మనం ఇలా చదువుతాము: “ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైయున్న ఇస్కరియోతు యూదా—యీ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను.”—యోహాను 12:2-8.

నిజమే, యూదా “ఆయన శిష్యులలో ఒకడు,” కానీ ఆ స్థానంలో ఉన్న ఒక వ్యక్తి యేసును అప్పగించాలని చూస్తున్నాడన్న విషయంపట్ల యోహాను ఆగ్రహాన్ని మీరు ఊహించగలరు. యోహాను 12:4 గురించి అనువాదకుడైన డా. సి. హోవర్డ్‌ మాథనీ ఇలా అంటున్నాడు: “‘చేయనైయున్న’ [లేదా, “నైయున్న”] అనే పదమూ, ‘అప్పగింపబోవటము’ [లేదా, అప్పగింపనైయున్న]” అనే పదమూ ఈ రెండూ క్రమానుగత చర్యను వివరిస్తున్నాయి. దీని ద్వారా మనకు, యూదా యేసును అప్పగించడం అనేది అప్పటికప్పుడు తీసుకున్న చర్య కాదనీ ఆలోచనరహితంగా తీసుకున్న చర్య కాదనీ తెలుస్తుంది. దాని విషయమై చాలా రోజులు ఆలోచించడం పథకం వేయడం జరిగింది.” యూదా ఇలాగున “చెప్పినది బీదలమీద శ్రద్ధకలిగి కాదుగాని వాడు దొంగయైయుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను” అని యోహాను నివేదిస్తున్నాడు.

అందుకని దొంగయైన యూదా ఆక్షేపణను లేవనెత్తాడని చెప్పడం సహేతుకంగా ఉంది. ఎందుకంటే, విలువైన అత్తరును అమ్మి ఆ డబ్బును తన దగ్గర ఉన్న డబ్బుసంచీలో వేస్తే తనకు దొంగిలించడానికి మరింత ఎక్కువ డబ్బు ఉంటుందని వాని ఆశ. ఆయనిలా ఆక్షేపణనెత్తగానే, అది వాస్తవమేనని ఏకీభవిస్తూ బహుశ అపొస్తలులలో కొందరు సణిగివుంటారు. అయితే ఆక్షేపణకు అసలు మూలం యూదా.