మీకు జ్ఞాపకమున్నాయా?
మీకు జ్ఞాపకమున్నాయా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి అభినందించారా? మరి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:
• కొరియాలో క్రిస్మస్ ఆచరించటానికి ఏది మార్గం సుగమం చేసింది?
డిసెంబరు నెలలో, వంటగది దేవుడు పొగ గొట్టం గుండా వస్తూ వరాలను తీసుకువస్తాడని కొరియాలోను, ఇతర దేశాల్లోను ఒక ప్రాచీన నమ్మకం ఉండేది. పైగా, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా సైనికులు స్థానిక చర్చీల్లో కానుకలను పంచేవారు.—12/15, పేజీలు 4, 5.
• యెషయా 21:8 నెరవేర్పులో, మన కాలంలో ఏ “కావలివాడు” దేవునికి ఉన్నాడు?
కావలివాని తరగతిగా సేవచేస్తున్న ఆత్మాభిషిక్తులైన క్రైస్తవులు, బైబిలు ప్రవచనాలను నెరవేరుస్తున్న ప్రపంచ సంఘటనల భావాన్ని చెబుతూ ప్రజల్ని అప్రమత్తులుగా చేశారు. లేఖనరహిత సిద్ధాంతాలను ఆచారాలను గుర్తించి నివారించటానికి కూడా వారు బైబిలు విద్యార్థులకు సహాయం చేశారు.—1/1, పేజీలు 8, 9.
• “పోలిష్ బ్రద్‌రెన్” ఎవరు?
వారు బైబిలును అంటిపెట్టుకోవటాన్ని ప్రోత్సహించిన 16, 17 శతాబ్దాల్లో పోలండ్‌లో ఉన్న చిన్న మతగుంపు. వారు త్రిత్వము, శిశు బాప్తిస్మం, నరకాగ్ని వంటి చర్చి సిద్ధాంతాలను తిరస్కరించారు. కొంతకాలానికి, వారు తీవ్రంగా వేధించబడి ఇతర దేశాలకు చెదిరిపోయేలా ఒత్తిడి చేయబడ్డారు.—1/1, పేజీలు 21-3.
• భవిష్యకారులు, ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్పినవాటికన్నా, బైబిలు ప్రవచనాలే ఎందుకు ఎక్కువ నమ్మదగినవి?
వాళ్ళు యెహోవా దేవుడ్నీ, ఆయన వాక్యమైన బైబిలునీ అలక్ష్యం చేస్తారు కాబట్టి ప్రవక్తలమని చెప్పుకునే వీరందరూ కూడా నమ్మదగినవారుకాదని రూఢి అయ్యింది. దేవుని సంకల్పానికి అనుగుణ్యంగా ఎలా వివిధ సంఘటనలు సంభవిస్తాయో తెలుసుకోవటానికి బైబిలు ప్రవచనాలు మాత్రమే మీకు సహాయం చేయగలవు. అవి మీకూ మీ కుటుంబానికీ నిత్య ప్రయోజనాన్ని చేకూర్చగలవు. నిత్యప్రయోజనానికై సంఘటనలు ఎలా దేవుని ఉద్దేశానికి అనుగుణ్యంగా ఉన్నాయో తెలుసుకోవటానికి కేవలం బైబిలు ప్రవచనాలే మీకు సహాయపడతాయి.—1/15, పేజీ 3.
• మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామని ఋజువు చేసే కొన్ని నిదర్శనాలేమిటి?
పరలోకంనుంచి సాతాను పడద్రోయబడిన పరిణామాలను మనం చూస్తున్నాము. (ప్రకటన 12:9) ప్రకటన 17:9-11 లో ప్రస్తావించబడిన చివరి “రాజు” కాలంలో మనం జీవిస్తున్నాము. అభిషిక్తులైన క్రైస్తవుల సంఖ్య తగ్గిపోతూ ఉంది, అయినప్పటికీ మహాశ్రమ మొదలైనప్పుడు వారిలో కొందరు ఇంకా ఈ భూమిపై ఉంటారని స్పష్టమౌతుంది.—1/15, పేజీలు 12, 13.
• హబక్కూకు పుస్తకం ఎప్పుడు వ్రాయబడింది, దానిపై మనకు ఎందుకు ఆసక్తి ఉండాలి?
దాదాపు సా.శ.పూ. 628 లో ఈ బైబిలు పుస్తకం వ్రాయబడింది. ప్రాచీన యూదాపై, బబులోనుపై యెహోవా విధించిన తీర్పులు దీనిలో ఉన్నాయి. అంతేగాక, ప్రస్తుత దుష్టవిధానంపైకి త్వరలో రానైవున్న దైవిక తీర్పు గురించి కూడా ఇది చెబుతుంది.—2/1, పేజి 8.
• సామర్థ్యంగల భార్యకై ఒక తల్లి ఇచ్చిన జ్ఞానయుక్తమైన ఉపదేశాన్ని బైబిల్లో మనం ఎక్కడ చూడవచ్చు?
అలాంటి శ్రేష్ఠమైన ఉపదేశానికి మూలం సామెతలు చివరి అధ్యాయం 31 లో ఉంది.—2/1, పేజీలు 30, 31.
• “క్రీస్తు మనస్సు”ను యెహోవా మనకు బయల్పరచినందుకు మనం ఎందుకు కృతజ్ఞులమై ఉండాలి? (1 కొరింథీయులు 2:16)
యెహోవా, సువార్త వృత్తాంతాల ద్వారా మనం యేసు ఆలోచనల్నీ, అనుభూతుల్నీ, కార్యకలాపాల్నీ, ప్రాధాన్యతల్నీ నేర్చుకునేలా చేశాడు. ఇది మనం మరింతగా యేసువలే ఉండేలా సహాయం చేస్తుంది, ప్రత్యేకించి జీవరక్షక ప్రకటనా పనికి మనమిచ్చే ప్రాధాన్యత విషయంలో అలా ఉండడానికి ఇది మనకు సహాయం చేస్తుంది.—2/15, పేజి 25.
• నేడు దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడా?
ఇస్తాడు. దేవుడు అన్ని రకాల ప్రార్థనలకు జవాబివ్వడని బైబిలు చూపిస్తున్నప్పటికీ, వైవాహిక సమస్యలను పరిష్కరించుకోవడంలో సహాయం కోసం, ఓదార్పు కోసం ప్రార్థించిన వారికి తరచూ ఆయన ప్రతిస్పందించాడని ఆధునిక దిన అనుభవాలు నిరూపిస్తున్నాయి.—3/1, పేజీలు 3-7.
• దేవుని శక్తిని పొందటానికి మనం ఏమి చేయవచ్చు?
మనం దాన్ని ప్రార్థనలో అడగవచ్చు, బైబిలు ద్వారా ఆధ్యాత్మిక బలాన్ని పొందవచ్చు, క్రైస్తవ సహవాసం ద్వారా బలాన్ని పొందవచ్చు.—3/1, పేజీలు 15, 16.
• క్రైస్తవ కూటాల నుండి తమ పిల్లలు మరింత ప్రయోజనం పొందేందుకు తల్లిదండ్రులు ఎలా సహాయపడగలరు?
బహుశ కూటాలకు ముందు పిల్లలు చిన్నకునుకు తీసేలా చేసి, కూటాలు జరుగుతున్నప్పుడు మెలకువగా ఉండేందుకు వారు తమ పిల్లలకు సహాయపడవచ్చు. వారికి తెలిసిన పదాలు లేక పేర్లు ఉపయోగించబడినప్పుడు ఒక పేపరుపై గుర్తువేయటం వంటి “నోట్స్” తీసుకునేలా వారిని ప్రోత్సహించవచ్చు.—3/15, పేజీలు 17, 18.
• యోబు మాదిరి నుండి మనం నేర్చుకోదగిన కొన్ని విషయాలేంటి?
యోబు దేవునితో తనకుగల సంబంధానికి ప్రథమ స్థానాన్నిచ్చాడు, తోటి మానవులతో వ్యవహరించేటప్పుడు న్యాయంగా ఉన్నాడు, తన వివాహజత పట్ల యథార్థంగా ఉండేందుకు ప్రయత్నించాడు, తన కుటుంబ ఆధ్యాత్మికత పట్ల శ్రద్ధ చూపించాడు, కష్టాల్లో విశ్వాసంగా నిలిచివున్నాడు.—3/15, 25-27 పేజీలు.
• ప్రవచన సందేశాలపై అంతర్దృష్టిని ఇచ్చే కోడ్ బైబిల్లో ఏమైనా దాగి ఉందా?
లేదు. కోడ్ దాగి ఉందని చేయబడుతున్న ఆరోపణలను, కొన్ని లౌకిక పుస్తకాల విషయంలో కూడా చేయవచ్చు. హెబ్రీ ప్రతులలో ఉన్న అక్షర తేడాల వల్ల, దాగి ఉన్నాయని చెప్పబడుతున్న అలాంటి కోడ్‌లు నిష్ఫలమౌతాయి.—4/1, పేజీలు 30, 31.