కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాకు నమ్మకంగా ఉండడంలో కొనసాగడం

యెహోవాకు నమ్మకంగా ఉండడంలో కొనసాగడం

యెహోవాకు నమ్మకంగా ఉండడంలో కొనసాగడం

నమ్మకంగా ఉండడం నేడు అరుదే కావచ్చు, కానీ అది, సత్యదేవుడైన యెహోవా సేవకుల విశిష్ట లక్షణం. నమ్మకస్థుడైన వ్యక్తి, విశ్వాసాన్ని పరీక్షించే పరిస్థితుల్లో కూడా స్థిరంగా ఉంటాడు, కాలం గడుస్తున్నా అచంచలంగా ఉంటాడు. మంచి రాజైన హిజ్కియా విషయమే తీసుకోండి. బైబిలు, ఆయనను గురించి ‘ఆయన తరువాత వచ్చిన యూదా రాజులలోను ఆయన పూర్వికులైన రాజులలోను ఆయనతో సమమైనవాడు ఒకడును లేడు’ అని చెబుతుంది. ఆయనను సాటిలేని రాజుగా చేసినదేమిటి? తన చుట్టూ ఉన్నవారు మోలెకు అనే అబద్ధ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పటికీ, ‘ఆయన యెహోవాను హత్తుకొని’ ఉన్నాడు. అవును, ఆయన ‘[యెహోవాను] వెంబడించుటలో వెనుక తీయక మోషేకు ఆజ్ఞాపించిన అజ్ఞలన్నిటిని గైకొంటూ ఉండేవాడు.’—2 రాజులు 18:1-6.

యెహోవాకు నమ్మకంగా ఉన్న మరొక వ్యక్తి అపొస్తలుడైన పౌలు. పౌలు పరిచర్యను గురించి క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఉన్న వృత్తాంతాలు, పూర్ణాత్మతో యెహోవాకు సేవ చేయడంలో పౌలు చూపిన స్థైర్యానికి స్పష్టమైన సాక్ష్యాన్నిస్తున్నాయి. “మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని” అని తన జీవితపు చివరి రోజుల్లో పౌలు స్వయంగా చెప్పుకోగలిగాడు.—2 తిమోతి 4:7.

నమ్మకస్థులుగా ఉండే విషయంలో హిజ్కియా, పౌలూ మనకు మంచి మాదిరులుగా ఉన్నారు ! మన గొప్ప దేవుడైన యెహోవాకు నమ్మకంగా ఉండడంలో కొనసాగుతూ మనం కూడా వారి విశ్వాసాన్ని అనుకరించుదాం.—హెబ్రీయులు 13:7.