ఆయుధాల తయారీ నుండి జీవ రక్షక పనికి
జీవిత కథ
ఆయుధాల తయారీ నుండి జీవ రక్షక పనికి
చెప్పినది ఈసీడోరస్ ఈస్మైలీడిస్
నేను మోకరించి ప్రార్థిస్తుండగా నా కన్నీళ్లు జల జలా రాలాయి. “ఓ, దేవా, నేను ఆయుధాల తయారీలో ఇక పనిచేయకూడదని నా మనస్సాక్షి చెప్తుంది. నేను మరో ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నించాను, కాని సంపాదించుకోలేకపోయాను. రేపు నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తాను. యెహోవా, దయచేసి నా పిల్లలు ఆకలితో అలమటించిపోకుండా కాపాడు” అని మొరపెట్టాను. నేనెలా ఈ పరిస్థితికి చేరుకున్నానో చెప్పనివ్వండి.
ఉత్తర గ్రీసులోని డ్రామా అనే ప్రాంతంలో జనజీవితం ప్రశాంతంగా, నిరాడంబరంగా గడిచిపోతుండేది, 1932 లో నేనక్కడే జన్మించాను. నేను విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని తాను కోరుకుంటున్నట్లు నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. అందుకు ఆయన నన్ను ప్రోత్సహించేవారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో గ్రీసు కొల్లగొట్టబడినప్పుడు, గ్రీకుల మధ్య వాడుకలో ఉన్న నినాదం ఏమిటంటే: “మీరు మా ఆస్తిపాస్తులను దోచుకోగలరు గానీ మా మనస్సుల్లో ఉన్నది దోచుకోవడం మీవల్ల కాదు.” నేను పెద్ద చదువులు చదివి ఎవ్వరూ దోచుకోవడం వీలుపడని సంపదను సంపాదించుకోవాలని నిశ్చయించుకున్నాను.
నేను యౌవనస్థునిగా ఉన్నప్పటి నుండే గ్రీక్ ఆర్థడాక్స్ చర్చి స్పాన్సర్ చేసిన వివిధ యౌవనుల గుంపుల్లో సభ్యునిగా ఉండేవాడిని. ప్రమాదకరమైన తెగల నుండి దూరంగా ఉండమని అక్కడ మాకు చెప్పబడేది. ఒక గుంపు గురించి చెప్పడం నాకు బాగా జ్ఞాపకం ఉంది, అది యెహోవా సాక్షుల గుంపు, ఎందుకంటే వాళ్లు క్రీస్తు విరోధిని సూచిస్తారని చెప్పబడేది.
నేను 1953 లో ఏథెన్సులో ఒక సాంకేతిక పాఠశాల నుండి పట్టా పుచ్చుకుని, పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసుకుంటూ చదువుకోవడం సాధ్యమౌతుందేమోనని జర్మనీకి వెళ్లాను. కాని అది సాధ్యం కాలేదు, దానితో నేను ఇతర దేశాలకు వెళ్లాను. కొన్ని వారాల తర్వాత, నేను బెల్జియంలోని ఒక ఓడరేవు దగ్గర ఉన్నప్పుడు నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేకుండాపోయింది. నేను ఒక చర్చిలోకి వెళ్లి నేలమీద కూర్చుని ఏడవటం నాకు బాగా
గుర్తుంది, నేను ఎంతగా ఏడ్చానంటే నా కన్నీళ్లతో అక్కడ నేల కొంతమేరకు తడిసిపోయింది. నేను అమెరికాకు వెళ్లడానికి దేవుడు సహాయం చేస్తే, వస్తుసంపదలు సంపాదించుకోవటానికి ప్రయాసపడను గానీ చక్కగా చదువుకుని మంచి క్రైస్తవునిగా, మంచి పౌరునిగా ఉండటానికి కృషి చేస్తానని నేను ప్రార్థించాను. చివరికి 1957 లో నేను అక్కడికి చేరుకున్నాను.అమెరికాలో క్రొత్త జీవితం
భాష రాని, చేతిలో అంతగా డబ్బు లేని వలసదారుడినైన నాకు అమెరికాలో జీవితం చాలా కష్టంగా ఉండేది. నేను రాత్రిపూట రెండు ఉద్యోగాలు చేస్తూ పగలు కాలేజీకి వెళ్లేవాడిని. వివిధ కాలేజీలకు వెళ్లి చివరికి జూనియర్ కాలేజీ చదువు ముగించాను. తర్వాత నేను లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి వెళ్లి అప్లైడ్ ఫిజిక్స్‌లో బి.ఎస్.సి డిగ్రీ సంపాదించాను. కష్టతరమైన ఈ సంవత్సరాలన్నిటిలోనూ కొనసాగడానికి, విద్యాభ్యాసం గురించి నాన్నగారు చెప్పిన మాటలే నాకు ప్రోత్సాహాన్నిచ్చేవి.
ఈ సమయంలోనే, నేను ఎకాటెరీనీ అనే గ్రీకు సుందరిని కలిశాను, 1964 లో మేము వివాహం చేసుకున్నాము. మూడేళ్ల తర్వాత మా మొదటి అబ్బాయి జన్మించాడు, తర్వాతి నాలుగేళ్లలో మరో ఇద్దరు కొడుకులు, ఒక కూతురు జన్మించారు. ఒక కుటుంబాన్ని పోషిస్తూ అదే సమయంలో విశ్వవిద్యాలయంలో చదువుకోవడం నాకు సవాలుదాయకంగా ఉండేది.
అప్పట్లో నేను అమెరికా వైమానికదళం కోసం కాలిఫోర్నియాలోని సన్నివేల్‌లో మిస్సైల్ అండ్ స్పేస్ కంపెనీలో పనిచేస్తున్నాను. నేను ఎజీనా, అపొల్లో రాకెట్ కార్యక్రమాలతో సహా వివిధ విమాన, అంతరిక్ష ప్రాజెక్టుల్లో భాగం వహిస్తున్నాను. అపొల్లో 8, అపొల్లో 11 మిషన్‌ల కోసం నేను చేసిన సేవకు నాకు ఎన్నో మెడల్స్ కూడా లభించాయి. దాని తర్వాత, నేను నా విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ, వివిధ మిలిటరీ స్పేస్ ప్రాజెక్టుల్లో పూర్తిగా నిమగ్నమైపోయాను. ఆ సమయంలో, అందమైన భార్య, ముత్యాల్లాంటి నలుగురు పిల్లలు, గౌరవప్రదమైన ఉద్యోగం, చక్కటి ఇల్లు, వీటన్నిటితో నా జీవితం పరిపూర్ణమైందని నేను భావించాను.
పట్టువదలని విక్రమార్కుడు
1967 తొలికాలంలో, నేను నా ఉద్యోగ స్థలంలో జిమ్ అనే వ్యక్తిని కలిశాను, ఆయన ఎంతో వినయస్థుడు, దయార్ద్ర హృదయంగలవాడు. జిమ్ ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ ఉండేవాడు, నాతోపాటు కాఫీ త్రాగటానికి రమ్మని నేనిచ్చే ఆహ్వానాన్ని ఎప్పుడూ త్రోసిపుచ్చేవాడు కాదు. ఆయన నాతో బైబిలు సమాచారాన్ని పంచుకునేందుకు ఆ సమయాలను ఉపయోగించుకునేవాడు. తాను యెహోవాసాక్షులతో అధ్యయనం చేస్తున్నానని జిమ్ నాకు చెప్పాడు.
జిమ్ ఈ మత గుంపులో చేరాడని విని నేను దిగ్భ్రాంతి చెందాను. అంత మంచివ్యక్తి ఈ క్రీస్తు విరోధి తెగలో ఎలా చేరాడు? అయితే జిమ్ నా పట్ల చూపిస్తున్న వ్యక్తిగత శ్రద్ధను ఆయన దయను నేను నిరాకరించలేకపోయాను. ప్రతి రోజు నేను చదవడానికి ఆయన ఏదో ఒకటి తెచ్చేవాడు. ఉదాహరణకు, ఒకరోజు ఆయన నా ఆఫీసుకు వచ్చి ఇలా అన్నాడు: “ఈసీడోరస్, కావలికోటలోని ఈ శీర్షిక కుటుంబ జీవితాన్ని పటిష్ఠపర్చుకోవడం గురించి మాట్లాడుతుంది. దీన్ని ఇంటికి తీసుకెళ్లి, మీ భార్యతో కలిసి చదవండి.” నేనా శీర్షిక చదువుతానని ఆయనకు చెప్పాను, కానీ తర్వాత నేను టాయ్‌లెట్‌లోకి వెళ్లి ఆ పత్రికను చిన్న చిన్న ముక్కలుగా చింపి చెత్తబుట్టలో వేశాను.
మూడు సంవత్సరాలపాటు, జిమ్ ఇచ్చిన ప్రతి పుస్తకాన్ని, పత్రికను నేను అలాగే నాశనం చేశాను. యెహోవాసాక్షులకు విరుద్ధంగా పక్షపాత వైఖరి ఉన్నప్పటికీ, జిమ్‌ను నా స్నేహితునిగానే ఉంచుకోవాలనే ఉద్దేశంతో నేను, ఆయన చెప్పినవన్నీ విని వాటిని వెంటనే మనస్సులో నుండి తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాను.
అయితే నేను నమ్మే, ఆచరించే అనేక విషయాలు బైబిలు ఆధారితం కాదని ఆ చర్చల ద్వారా నేను తెలుసుకున్నాను. త్రిత్వం, నరకాగ్ని, ప్రసంగి 9:10; కీర్తన 146:4; యోహాను 20:17) గ్రీక్ ఆర్థడాక్స్ చర్చి సభ్యుడినన్న అహంకారంగల నేను జిమ్ చెప్తున్నది సరైనదని బహిరంగంగా అంగీకరించలేకపోయాను. కానీ ఆయన ఎప్పుడూ తన స్వంత అభిప్రాయాన్ని చెప్పకుండా బైబిలును ఉపయోగించేవాడు గనుక, ఈ వ్యక్తి దగ్గర నా కోసం బైబిలు నుండి విలువైన సమాచారం ఉందని నేను చివరికి గ్రహించాను.
ఆత్మ అమర్త్యత వంటి బోధలు లేఖనాధారమైనవి కావని నేను గ్రహించాను. (ఏదో జరుగుతోందని నా భార్య గ్రహించింది, యెహోవాసాక్షులతో సహవసిస్తున్న నీ స్నేహితునితోగానీ మాట్లాడావా అని ఆమె నన్నడిగింది. అవునని నేను చెప్పినప్పుడు ఆమె, “మనం మరే చర్చీకైనా వెళ్దాం కానీ యెహోవాసాక్షుల దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు” అంది. అయితే అనతి కాలంలోనే నేనూ నా భార్యా మా నలుగురు పిల్లలూ అందరం కలిసి యెహోవాసాక్షుల కూటాలకు క్రమంగా వెళ్లడం మొదలుపెట్టాము.
కష్టతరమైన నిర్ణయం
నేను బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు, ప్రవక్తయైన యెషయా వ్రాసిన ఈ మాటలు చదివాను: “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును, యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.” (యెషయా 2:4) నన్ను నేనిలా ప్రశ్నించుకున్నాను, ‘శాంతిని ప్రేమించే దేవుని సేవకుడు నాశనకరమైన ఆయుధాల రూపకల్పనలోనూ ఉత్పాదనలోనూ ఎలా భాగం వహించగలడు?’ (కీర్తన 46:9) నేను ఉద్యోగం మారాల్సిన అవసరం ఉందని గ్రహించటానికి ఎంతో సమయం పట్టలేదు.
ఇది ఒక పెద్ద సవాలన్నది అర్థం చేసుకోదగినదే. నాకు గౌరవప్రదమైన ఉద్యోగం ఉంది. ఎన్నో సంవత్సరాలపాటు కష్టపడి పనిచేసి, విద్యను సముపార్జించి, త్యాగాలు చేసి ఈ స్థానానికి చేరుకున్నాను. నేనీ ఉన్నత స్థానానికి అంచెలంచెలుగా చేరుకున్న తర్వాత, ఈనాడు నా ఉద్యోగాన్ని వదులుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే, యెహోవా పట్ల నాకున్న ప్రగాఢమైన ప్రేమ, ఆయన చిత్తం చేయాలన్న తీవ్రమైన కోరిక చివరికి గెలిచాయి.—మత్తయి 7:21.
వాషింగ్టన్‌లోని సియాటిల్‌లో ఉన్న ఒక కంపెనీలో ఉద్యోగం సంపాదించుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. అయితే, యెషయా 2:4తో పొందికలేని పనిలో నేను ఇంకా నిమగ్నమై ఉన్నానని త్వరలోనే గ్రహించి, చాలా నిరాశ చెందాను. అందులోనే వేరే ప్రాజెక్టుల్లో మాత్రమే పని చేయాలని నేను చేసిన ప్రయత్నాలు విఫలమైపోయాయి, మళ్లీ నా మనస్సాక్షి నన్ను బాధించడం మొదలుపెట్టింది. నేను నా ఉద్యోగాన్ని కాపాడుకుని అదే సమయంలో నిర్మలమైన మనస్సాక్షి కల్గివుండడం సాధ్యం కాదని నాకు స్పష్టమైపోయింది.—1 పేతురు 3:21.
మేము ప్రాముఖ్యమైన మార్పులు చేసుకోవలసిన అవసరముందని నేను గ్రహించాను. ఆరు నెలలు గడవక ముందే మేము మా జీవన విధానాన్ని మార్చుకుని, మా కుటుంబ ఖర్చులను సగానికి తగ్గించేశాము. ఆ తర్వాత మేము మా విలాసవంతమైన ఇంటిని అమ్మేసి, కొలరాడోలోని డెన్వర్‌లో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాము. ఇప్పుడిక మరో పెద్ద అడుగు వేయడానికి అంటే నా ఉద్యోగాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. మనస్సాక్షిపూర్వకంగా నాకున్న అభ్యంతరాన్ని తెలియజేస్తూ నేను రాజీనామా లేఖ వ్రాశాను. ఆ రాత్రి పిల్లలందరూ నిద్రపోయాక నేను నా భార్యతోపాటు మోకాళ్లూని, ఈ శీర్షికారంభంలో వివరించినట్లుగా యెహోవాకు ప్రార్థించాను.
నెల తిరగక ముందే మేము డెన్వర్‌కు వచ్చి, రెండు వారాల తర్వాత అంటే 1975 జూలైలో నేను, నా భార్య బాప్తిస్మం తీసుకున్నాము. ఆరు నెలలు గడిచినా నేను ఉద్యోగం సంపాదించుకోలేకపోయాను, మా దగ్గరున్న డబ్బు కొద్దికొద్దిగా ఖర్చైపోతోంది. ఏడవ నెలకల్లా మా దగ్గర మిగిలివున్న డబ్బు మా ఇంటి కోసం కట్టవలసిన నెలసరి బాకీకన్నా తక్కువే ఉంది. నేను ఏదో మత్తయి 6:33.
ఒక ఉద్యోగం దొరికితే చాలని వెదకడం మొదలుపెట్టాను, త్వరలోనే నాకు ఇంజినీరుగా ఉద్యోగం దొరికింది. జీతం మాత్రం ముందు నేను సంపాదిస్తున్నదానికి సగం వస్తుందంతే; అయినప్పటికీ అది నేను యెహోవాను అడిగినదానికన్నా ఎంతో ఎక్కువే. నేను ఆధ్యాత్మిక విషయాలకు మొదటి స్థానం ఇవ్వగల్గినందుకు ఎంతగా సంతోషించానో!—యెహోవాను ప్రేమించేలా మా పిల్లల్ని పెంచడం
ఆ తర్వాత, మా నలుగురు పిల్లలనూ దైవిక సూత్రాలకు అనుగుణ్యంగా పెంచడమనే సవాలుతో కూడిన పనిలో నేనూ ఎకాటెరీనీ నిమగ్నమైపోయాము. సంతోషకరంగా, యెహోవా సహాయంతో వాళ్లంతా పరిణతి చెందిన క్రైస్తవులుగా ఎదిగి, రాజ్యప్రకటన అనే ప్రాముఖ్యమైన పనికి తమ జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకోవడాన్ని చూశాము. మా కుమారులైన క్రిస్టోస్, లేక్స్, గ్రెగరి ముగ్గురూ మినిస్టీరియల్ ట్రెయినింగ్ స్కూలు నుండి పట్టభద్రులై ఇప్పుడు సంఘాలను సందర్శిస్తూ, వాటిని బలపరుస్తూ వివిధ నియామకాల్లో సేవచేస్తున్నారు. మా కుమార్తె ట్యూలా న్యూయార్క్‌లో ఉన్న యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయంలో స్వచ్ఛంద సేవకురాలిగా సేవ చేస్తోంది. వాళ్లందరూ యెహోవా సేవ చేసేందుకుగానూ ఎంతో జీతం వచ్చే మంచి ఉద్యోగాలను వదులుకోవడం చూసి మా హృదయాలు కదిలిపోయాయి.
పిల్లల్ని అలా విజయవంతంగా పెంచడానికి ఏమి దోహదపడిందని చాలామంది మమ్మల్ని అడిగారు. అయితే పిల్లల్ని పెంచడానికి నిర్దిష్టమైన ఫార్ములా అంటూ ఏదీ లేదు, కాని మేము యెహోవా పట్ల, పొరుగువారి పట్ల ప్రేమతో వారి హృదయాలను నింపడానికి తీవ్రంగా కృషి చేశాము. (ద్వితీయోపదేశకాండము 6:6, 7; మత్తయి 22:37-39) మన క్రియలు మనం యెహోవాను ప్రేమిస్తున్నామని చూపిస్తేనేగానీ మనం ఆయనను ప్రేమిస్తున్నామని చెప్పలేము అన్న విషయాన్ని పిల్లలు గ్రహించారు.
వారంలో ఒక రోజు, సాధారణంగా శనివారం మా కుటుంబమంతా కలిసి పరిచర్యలో పాల్గొనేది. మేము ప్రతి సోమవారం రాత్రి భోజనమయ్యాక మొత్తం కుటుంబమంతా కలిసి బైబిలు అధ్యయనం చేసేవాళ్లం, ఒక్కొక్కరితో విడిగా కూడా బైబిలు అధ్యయనం చేసేవాళ్లం. పిల్లలు చిన్నవయస్సులో ఉన్నప్పుడు, మేము వారంలో పలుమార్లు ఒకొక్కరితో కొద్దిసేపు అధ్యయనం చేసేవాళ్లం, వాళ్లు కాస్త పెద్దవాళ్లవుతుండగా, వారానికి ఒక్కసారే ఎక్కువసేపు అధ్యయనం చేసేవాళ్లం. ఈ అధ్యయనాల సమయంలో, మా పిల్లలు తమ మనస్సు విప్పి మాట్లాడుతూ స్వేచ్ఛగా తమ సమస్యలను మాతో చర్చించేవారు.
కుటుంబమంతా కలిసి వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవాళ్లం. మేమంతా కలిసి సంగీత వాయిద్యాలు వాయించడానికి ఇష్టపడేవాళ్లం, ప్రతి ఒక్కరు తమకు ఇష్టమైన పాటలను వాయించేవాళ్లు. కొన్ని వారాంతాల్లో ప్రోత్సాహకరమైన సహవాసం కోసం ఇతర కుటుంబాలను మా ఇంటికి ఆహ్వానించేవాళ్లం. మేమందరం కలిసి సెలవుల్లో వివిధ ప్రదేశాలకు వెళ్లేవాళ్లం. అలాంటి ఒక ప్రయాణంలో, మేము కొలొరాడో పర్వతాలను పరిశోధిస్తూ, అక్కడి సంఘాలతో కలిసి ప్రాంతీయ పరిచర్యలో పాల్గొంటూ రెండు వారాలు గడిపాము. జిల్లా సమావేశాల్లో వివిధ విభాగాల్లో పనిచేయడాన్ని, వివిధ ప్రాంతాల్లో రాజ్యమందిర నిర్మాణాల్లో సహాయం చేయడాన్ని మా పిల్లలు ఎంతో ప్రియంగా గుర్తు తెచ్చుకుంటారు. మేము మా పిల్లల్ని గ్రీసులో
ఉన్న మా బంధువుల దగ్గరికి తీసుకువెళ్లినప్పుడు, వాళ్లు తమ విశ్వాసం కోసం చెరసాలలో ఉండిన అనేకమంది నమ్మకమైన సాక్షులను కూడా కలవగలిగారు. ఇది వారిపై ఎంతో ప్రగాఢమైన ప్రభావాన్ని చూపించి, సత్యం కోసం దృఢంగా ధైర్యంగా నిలబడాలని నిశ్చయించుకోవడానికి వాళ్లకు సహాయం చేసింది.అయితే, కొన్నిసార్లు మా పిల్లల్లో కొంతమంది తప్పుగా ప్రవర్తించారు, సహవాసుల విషయంలో సరైన ఎంపికలు చేసుకోలేదు అన్నది నిజమే. మరికొన్నిసార్లు మేము కొన్ని విషయాల్లో మరీ కఠినంగా ఉండడం ద్వారా వాళ్లకు సమస్యలు తెచ్చిపెట్టాము. కానీ బైబిలులోవున్నట్లుగా, ‘యెహోవా శిక్షలో పెంచటానికి’ మేము కృషి చేయడం, విషయాలను చక్కబరుచుకోవడానికి ఇటు మాకూ అటు పిల్లలకూ సహాయం చేసింది.—ఎఫెసీయులు 6:4; 2 తిమోతి 3:16, 17.
నా జీవితంలోని అత్యానందభరితమైన సమయం
మా పిల్లలు పూర్తికాల పరిచర్యను ప్రారంభించిన తర్వాత, జీవాన్ని రక్షించే ఈ పనిలో నేనూ ఎకాటెరీనీ ఎక్కువగా భాగం వహించడానికి ఏమి చేయగలమా అని గంభీరంగా ఆలోచించడం మొదలుపెట్టాము. అలా, 1994 లో నాకై నేను ఉద్యోగ విరమణ చేశాక, మేమిద్దరం క్రమ పయినీర్లుగా సేవ చేయడం మొదలుపెట్టాము. స్థానిక కళాశాలలను, విశ్వవిద్యాలయాలను దర్శించడం, అక్కడి విద్యార్థులతో బైబిలు పఠనాలు చేయడం మా పరిచర్యలో ఒక భాగం. కొన్ని సంవత్సరాల క్రితం నేను కూడా వాళ్లున్న స్థితిలోనే ఉన్నాను గనుక నేను వాళ్లు ఎదుర్కొంటున్న కష్టాలను సానుభూతితో అర్థం చేసుకోగలిగాను కాబట్టి, వాళ్లు యెహోవా గురించి తెలుసుకునేందుకు వాళ్లకు సహాయం చేయడంలో నేనెంతగానో విజయం సాధించాను. ఇథియోపియా, ఈజిప్టు, చిలి, చైనా, టర్కీ, థాయ్‌లాండ్, బొలీవియా, బ్రెజిల్, మెక్సికోల నుండి వచ్చిన విద్యార్థులకు సహాయం చేయడం ఎంత ఆనందాన్ని కల్గించిందో! ప్రాముఖ్యంగా నా భాష మాట్లాడేవారికి టెలిఫోన్ సాక్ష్యం ఇవ్వడం నాకెంతో ఇష్టం.
నేను ఏ భాష మాట్లాడినా గ్రీకు యాస ఉండడం మూలంగానూ, వృద్ధాప్యం మూలంగానూ నాకెన్నో పరిమితులు ఉన్నప్పటికీ, నేనెల్లప్పుడూ యెహోవా సేవ కోసం నన్ను నేను అందుబాటులో ఉంచుకుని, “చిత్తగించుము నేనున్నాను నన్ను పంపు”మని చెప్పిన యెషయా స్ఫూర్తినే చూపించాను. (యెషయా 6:8) ఆరుకన్నా ఎక్కువమంది తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకునేందుకు సహాయం చేసే ఆనందం మాకు దక్కింది. నిజంగా అవి మాకెంతో ఆనందభరితమైన సమయాలు.
ఒకప్పుడు నా జీవితం తోటి మానవులను చంపటానికి ఉపయోగించే వినాశనకరమైన ఆయుధాలను తయారుచేయడం చుట్టూ తిరిగేది. కానీ నేనూ నా కుటుంబమూ యెహోవా సమర్పిత సేవకులమై, పరదైసు భూమిపై నిత్యజీవాన్ని పొందడమనే సువార్తను ప్రజలకు ప్రకటించటానికి మా జీవితాలను అంకితం చేసుకునే అవకాశాన్ని ఆయన తన అపారమైన దయచేత మాకిచ్చాడు. నేను తీసుకోవలసి వచ్చిన సవాలుతో కూడిన నిర్ణయాల గురించి ఆలోచించినప్పుడు మలాకీ 3:10 లోని ఈ మాటలు నా మనస్సులో మెదులుతుంటాయి: “మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” నిజంగా ఆయన మా హృదయాలు సంతృప్తితో నిండిపోయేంతగా దీవెనలు కుమ్మరించాడు.
[27వ పేజీలోని బాక్సు/చిత్రం]
లేక్స్: మా నాన్నగారికి వేషధారణంటే అసహ్యం. ప్రాముఖ్యంగా కుటుంబానికి మాదిరికరంగా ఉండే విషయంలో వేషధారణతో ఉండకూడదని ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన తరచూ మాకిలా చెప్పేవారు: “మీరు మీ జీవితాన్ని యెహోవాకు సమర్పించుకోవడమన్నది ఎంతో గంభీరమైన విషయం. మీరు యెహోవా కోసం త్యాగాలు చేయడానికి సుముఖంగా ఉండాలి. క్రైస్తవునిగా ఉండడమంటే అదే మరి.” ఈ మాటలు నా మనస్సులో ముద్రించుకుపోయి, యెహోవా కోసం త్యాగాలు చేయడంలో మానాన్నగారి మాదిరిని అనుకరించేందుకు అవి నాకు సహాయం చేశాయి.
[27వ పేజీలోని బాక్సు/చిత్రం]
క్రిస్టోస్: నా తల్లిదండ్రులు యెహోవా పట్ల చూపించిన పూర్ణాత్మతో కూడిన యథార్థతను, తల్లిదండ్రులుగా తమకున్న బాధ్యత పట్ల వారికున్న బలమైన అంకిత భావాన్ని నేనెంతగానో మెచ్చుకుంటున్నాను. ఒక కుటుంబంగా అన్నీ అంటే మా సేవ మొదలుకొని మా సెలవుల వరకూ అన్నీ మేము కలిసే ఆనందించేవాళ్లం. మా తల్లిదండ్రులు ఇతర అనేక విషయాల్లో నిమగ్నమై ఉండగల్గే అవకాశం ఉన్నప్పటికీ, వాళ్లు తమ జీవితాలను నిరాడంబరంగా గడుపుతూ, పరిచర్యపై తమ అవధానాన్ని కేంద్రీకరించారు. ఈనాడు నేను యెహోవా సేవలో పూర్తిగా నిమగ్నమై నిజంగా ఎంతో ఆనందంగా ఉన్నాను.
[28వ పేజీలోని బాక్సు/చిత్రం]
గ్రెగరి: నా పరిచర్యను విస్తృతపర్చుకోమని నా తల్లిదండ్రులిచ్చిన ప్రోత్సాహకరమైన మాటలకంటే వారి మాదిరీ, యెహోవా సేవలో వారు పొందుతున్న ఆనందమూ, పూర్తికాల పరిచర్యను ప్రారంభించేందుకు ఉన్న ఏ చింతలనైనా చికాకులనైనా ప్రక్కనబెట్టి నా పరిస్థితులను పునఃపరిశీలించుకుని నేను యెహోవా పనిలో సంపూర్ణంగా నిమగ్నమవ్వడానికి నాకు పురికొల్పునిచ్చాయి. నన్ను నేను యెహోవా సేవలో వెచ్చించుకోవడం ద్వారా లభించే ఆనందాన్ని నేను కనుగొనడానికి నాకు సహాయం చేసినందుకు అమ్మానాన్నలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
[28వ పేజీలోని బాక్సు/చిత్రం]
ట్యూలా: యెహోవాతో మా సంబంధం అత్యంత అమూల్యమైనదనీ, దాన్ని మేము ఎప్పుడూ భద్రంగా కాపాడుకోవాలనీ, మనం నిజంగా సంతోషంగా ఉండగలిగేది మనకున్న శ్రేష్ఠమైనదాన్ని యెహోవాకు ఇవ్వడం ద్వారా మాత్రమేననీ మా అమ్మా నాన్న ఎప్పుడూ నొక్కి చెప్పేవారు. వారు యెహోవా మాకు నిజమైన వ్యక్తిగా ఉండేలా చేశారు. యెహోవాను సంతోషపర్చడానికి మనకు సాధ్యమైనదంతా చేయడానికి మనం ప్రయత్నించామని నిశ్చయపర్చుకొని నిర్మలమైన మనస్సాక్షితో నిద్రకు ఉపక్రమించగల్గడంలో వర్ణనాతీతమైన ఆనందం ఉందని నాన్నగారు తరచూ చెప్తుండేవారు.
[25వ పేజీలోని చిత్రం]
నేను 1951 లో గ్రీసులో సైనికునిగా ఉన్నప్పుడు
[26వ పేజీలోని చిత్రం]
ఎకాటెరీనీతో 1966 లో
[26వ పేజీలోని చిత్రం]
మా కుటుంబం 1996 లో: (ఎడమ నుండి కుడికి, వెనుక) గ్రెగరి, క్రిస్టోస్, ట్యూలా; (ముందు) లేక్స్, ఎకాటెరీనీ, నేను