కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని జ్ఞానము—అదెలా ప్రదర్శితమౌతుంది?

దేవుని జ్ఞానము—అదెలా ప్రదర్శితమౌతుంది?

దేవుని జ్ఞానము—అదెలా ప్రదర్శితమౌతుంది?

పట్టణాన్నంతటిని నాశనం నుండి తప్పించిన, బీదవాడే అయినప్పటికీ జ్ఞానవంతుడైన వ్యక్తిని గూర్చిన కథను జ్ఞానియైన సొలొమోను రాజు ఈ మాటలతో ముగించాడు: “బీదవారి జ్ఞానము తృణీకరింపబడును, వారి మాటలు ఎవరును లక్ష్యముచేయరు.” అయితే విచారకరంగా, “ఎవరును ఆ బీదవానిని జ్ఞాపకముంచుకొనలేదు.”—ప్రసంగి 9:14-16.

ఈ బీదవారు ఎంతో ఘనమైన కార్యాలు చేసినప్పటికీ సాధారణంగా మనుష్యులు వాళ్ళను చిన్నచూపు చూస్తారు. యేసు విషయంలో అది నిజమయ్యింది. ఆయన, ‘తృణీకరింపబడినవాడు, మనుష్యులవలన విసర్జింపబడినవాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధి ననుభవించినవాడు’ అవుతాడని యెషయా ఆయన గురించి ప్రవచించాడు. (యెషయా 53:3) యేసుకు, తన కాలంలోని ప్రముఖులైన నాయకులవలే మంచి హోదా లేదా పలుకుబడి లేకపోవడంవల్ల కొంతమంది ఆయనను తృణీకరించారు. అయినప్పటికీ ఆయనకు పాపులైన ఏ మానవునికంటే కూడా అధిక జ్ఞానము ఉంది. యేసు స్వగ్రామంలోని ప్రజలు “వడ్లవాని కుమారుడు” అయిన ఈయన అలాంటి జ్ఞానాన్ని చూపించి అంతటి గొప్ప కార్యాలు చేశాడన్న విషయాన్ని గుర్తించడానికి నిరాకరించారు. అయితే అది ఒక గంభీరమైన తప్పు, అందుకే “వారి అవిశ్వాసమునుబట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు” అని ఆ వృత్తాంతము చెప్తుంది. ఆ ప్రజలకు అదెంతటి నష్టం !—మత్తయి 13:54-58.

మనం కూడా అలాంటి తప్పునే చేయకుండా ఉందాము. “జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందున”ని యేసు చెప్పాడు. ఎవరైతే దేవుని పని చేస్తూ పరలోక జ్ఞానాన్ని అందిస్తున్నారో వాళ్ళు, తమకున్న హోదాను లేక స్థానాన్ని బట్టి కాదు గానీ తమ బైబిలు ఆధారిత విశ్వాసం ద్వారా, క్రియల ద్వారా తాము ఫలించే “మంచి ఫలము”లను బట్టే సుప్రసిద్ధమౌతారు.—మత్తయి 7:18-20; 11:19.